Vijay Devarakonda: రణబాలి కోసం విజయ్ దేవరకొండ కష్టం చూశారా? గూస్ బంప్స్ వీడియో.. ఫ్యాన్స్‌తో కేక్ క‌టింగ్‌

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రణబాలి’. ఈ మూవీలో ఓ పోరాట వీరుడిగా విజయ్ నటిస్తున్నాడు. ఇవాళ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీమ్ బీటీఎస్ వీడియో రిలీజ్ చేసింది. ఈ చిత్రం కోసం విజయ్ కష్టాన్ని చూస్తుంటే గూస్ బంప్స్ రావడం పక్కా. 

Published on: May 9, 2026, 16:07:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijay Devarakonda: పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ‘రణబాలి’లా వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరో నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ఇది. ఇవాళ (మే 9) విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రణబాలి మూవీ టీమ్ బీటీఎస్ వీడియో షేర్ చేసింది. ఇందులో గుర్రాన్ని తోలడం కోసం విజయ్ ఎంతలా కష్టపడ్డాడో చూపించారు.

విజయ్ దేవరకొండ (x/RanabaaliFilm)
విజయ్ దేవరకొండ (x/RanabaaliFilm)

హ్యాపీ బర్త్ డే విజయ్

విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ చెప్తూ రణబాలి మూవీ టీమ్ రిలీజ్ చేసిన బీటీఎస్ వీడియో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ‘‘మా స్టాలియన్ (మేలు జాతి గుర్రం) విజయ్ దేవరకొండకు హ్యాపీ బర్త్ డే. పీక్ సినిమాలో పీక్ విజయ్ దేవరకొండను చూసేందుకు రెడీ అవండి. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది’’ అని రణబాలి టీమ్ ఓ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది.

విజయ్ కష్టం

రణబాలి సినిమాలో గుర్రంపై వచ్చే వీరుడిలా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. అందుకే ఈ మూవీ కోసం ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు. విజయ్ హార్స రైడింగ్ నేర్చుకోవడం, పట్టు తప్పి కింద పడిపోవడం, తిరిగి గుర్రాన్ని లొంగదీసుకోవడం, స్వారీ చేయడాన్ని ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి సినిమా సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఫ్యాన్స్ తో కేక్ కటింగ్

తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ తో కలిసి విజయ్ దేవరకొండ కేక్ కట్ చేశాడు. తన ఇంటికి వచ్చిన ఫ్యాన్స్ ను అతను డిసప్పాయింట్ చేయలేదు. బయటకు వెళ్లి తన కోసం స్పెషల్ గా తెచ్చిన కేక్ ను విజయ్ కట్ చేశాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

రష్మిక హాయ్

విజయ్ దేవరకొండ కోసం తమ ఇంటికి వచ్చిన ఫ్యాన్స్ ను రష్మిక మందన్న కూడా పలకరించింది. విజయ్, రష్మిక బాల్కనీపై నుంచి అభిమానులకు హాయ్ చెప్పారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More