Vijay Rashmika: రణబాలి సెట్లో విరోష్ వెడ్డింగ్ వేడుకలు.. విజయ్, రష్మిక సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్
Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రణబాలి మూవీ సెట్స్ లో విరోష్ జోడీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ జంటకు మూవీ టీమ్ కంగ్రాచ్యులేషన్స్ తెలిపింది. ఈ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.
Vijay Rashmika: టాలీవుడ్ లేటెస్ట్ కపుల్ జోడీ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ జంట ప్రస్తుతం రణబాలి మూవీలో కలిసి నటిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్, రష్మిక జోడీ వెడ్డింగ్ ను ఈ మూవీ టీమ్ సెలబ్రేట్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

రష్మిక, విజయ్ జోడీ
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పెళ్లి తర్వాత వీళ్లు తిరిగి షూటింగ్ కు వెళ్లడంతో రణబాలి సెట్స్ లో సందడి నెలకొంది. రణబాలి మూవీ టీమ్ విరోష్ వెడ్డింగ్ ను సెలబ్రేట్ చేశారు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు అభినందనలు తెలిపారు. ఈ జంట కేక్ కట్ చేసింది.
వైరల్ గా ఫొటోలు
రణబాలి మూవీ సెట్ లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకల ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఈ జంటకు మూవీ టీమ్ అభినందనలు తెలిపింది. రణబాలి, జయమ్మ గెటప్స్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అదిరిపోయారు.
విరోష్ వెడ్డింగ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న జరిగిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా డేటింగ్ లో ఈ విరోష్ జోడీ ఉదయ్ పూర్ లో జరిగిన పెళ్లిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఈ జంట రిసెప్షన్ నిర్వహించింది. ఈ రిసెప్షన్ కు సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు.
రణబాలి గురించి
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి మూవీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రణబాలి చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. భారత స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథతో రణబాలి మూవీ సిద్ధమవుతోంది.
మూడో సినిమా
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మూడో సినిమా రణబాలి. ఈ జంట ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించింది. 2018లో రిలీజ్ అయిన గీత గోవిందం మూవీ షూటింగ్ సమయంలోనే విజయ్, రష్మిక మధ్య లవ్ మొదలైందని అంటారు.
2019లో విడుదలైన డియర్ కామ్రేడ్ తో విరోష్ జోడీ మధ్య రిలేషన్ షిప్ మరింత స్ట్రాంగ్ మారిందని సమాచారం. ఇప్పుడు రణబాలి సినిమాలో ఈ జంట నటిస్తోంది. పెళ్లి, హనీమూన్ తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటోంది ఈ స్టార్ జోడీ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


