Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ గ్యారేజీలో కొత్త కారు- అందులోనే ఫ్రిడ్జ్- రేటు ఎంతో తెలుసా? షాక్ అవాల్సిందే- ఓ లుక్కేయండి
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన లగ్జరీ కార్ల కలెక్షన్‌లోకి కొత్త కారును చేర్చాడు. ఈ భారీ ఎస్‌యూవీలో మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ముంబై వీధుల్లో ఈ కొత్త కార్లో షారుఖ్ చక్కర్లు కొడుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కారు రేటు తెలిస్తే షాక్ అవాల్సిందే. వివరాలపై ఓ లుక్కేయండి.
Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గ్యారేజీలో ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు కొలువై ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో అద్భుతమైన వాహనం వచ్చి చేరింది. రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఒక ఖరీదైన కారును షారుఖ్ కొనుగోలు చేశాడు.

కొత్త కార్లో షారుఖ్
ఇటీవల ముంబై వీధుల్లో తన సరికొత్త కార్లో రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ షారుఖ్ ఖాన్ కెమెరా కంటికి చిక్కాడు. దీంతో ఈ కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారాయి. అసలు ఈ కారు ఏంటీ? రేట్ ఎంత? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఇండియాలోకి అరుదైన 'కాడిలాక్ ఎస్కలేడ్'
షారుఖ్ ఖాన్ కొత్తగా కొనుగోలు చేసిన ఈ కారు పేరు 'కాడిలాక్ ఎస్కలేడ్'. విశేషమేమిటంటే, ఈ కార్లను కాడిలాక్ సంస్థ అధికారికంగా భారతదేశంలో విక్రయించదు. షారుఖ్ దీనిని విదేశాల నుంచి ప్రైవేట్‌గా దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.
ధర ఎంతంటే?
భారీ ఇంపోర్ట్ డ్యూటీలు (దిగుమతి సుంకాలు), ఇతర పన్నులతో కలిపి ఈ కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీలలో (SUV) ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది.
మైండ్ బ్లాక్ ఫీచర్లు
- 6.2 లీటర్ V8 ఇంజిన్‌తో నడిచే ఈ కాడిలాక్ ఎస్కలేడ్.. పవర్ అండ్ లగ్జరీ కాంబినేషన్ గా ఉంటుంది.
- 38 అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే: కారు లోపల డ్యాష్‌బోర్డ్ మొత్తం అద్భుతమైన స్క్రీన్‌తో నిండి ఉంటుంది.
- హై-ఎండ్ మ్యూజిక్ సిస్టమ్: ఏకంగా 42 స్పీకర్లు కలిగిన 'AKG స్టూడియో రిఫరెన్స్' సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఇందులో ఉంది.
- విలాసవంతమైన సీట్లు: హీటెడ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫీచర్లతో కూడిన సీట్లు ప్రయాణాన్ని అత్యంత సుఖవంతంగా మారుస్తాయి.
- మినీ రిఫ్రిజిరేటర్: సెంటర్ కన్సోల్‌లో ఫ్రీజర్ మోడ్‌తో కూడిన ఒక చిన్న ఫ్రిట్జ్ కూడా ఉంటుంది.
- డ్యూయల్-పేన్ పవర్ స్కై గ్లాస్ రూఫ్ (సన్‌రూఫ్) ఈ కారుకు మరింత రాజసాన్ని అద్దింది.
కింగ్ ఖాన్ గ్యారేజీలో ఇతర వాహనాలు
షారుఖ్ ఖాన్ వద్ద ఇప్పటికే రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, బిఎమ్‌డబ్ల్యూ i8 వంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే ఆయన వద్ద రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ గార్డ్ వంటి సెక్యూరిటీ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. "ఆయన దగ్గర ఉన్న డబ్బుకు ఇలాంటి కార్లు వెయ్యి కొనగలరు" అని ఒక అభిమాని సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు.
షూటింగ్‌లతో బిజీ
'పఠాన్', 'జవాన్', 'డంకీ' వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన షారుఖ్.. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అభిషేక్ బచ్చన్ విలన్‌గా కనిపిస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలో దీపికా పదుకొణెతో కలిసి ఈ సినిమా షూటింగ్‌లో షారుఖ్ పాల్గొన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: షారుఖ్ ఖాన్ కొన్న కొత్త కారు ధర ఎంత?
జవాబు: షారుఖ్ కొన్న కాడిలాక్ ఎస్కలేడ్ ధర మన దేశంలో పన్నులు, దిగుమతి సుంకాలతో కలిపి సుమారు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ప్రశ్న: ఈ కారును ఇండియాలో నేరుగా కొనవచ్చా?
జవాబు: లేదు, కాడిలాక్ సంస్థకు ఇండియాలో అధికారిక షోరూమ్‌లు లేవు. దీనిని విదేశాల నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రశ్న: షారుఖ్ ఖాన్ తదుపరి సినిమా ఏది?
జవాబు: షారుఖ్ ప్రస్తుతం 'కింగ్' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఇది డిసెంబర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


