CM Vijay: సీఎం అవుతాన‌ని విజ‌య్‌కు ముందే తెలుసా.. వైర‌ల్‌గా ఆ సినిమాలోని కారు నంబ‌ర్ ప్లేట్‌.. దళపతి టైమ్ ట్రావెల్!

CM Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ దళపతి టీవీకే 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు తమిళనాడు సీఎం అయ్యేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు. అయితే తాను సీఎం అవుతానని విజయ్ కు రెండేళ్ల ముందే తెలుసా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. గోట్ మూవీలోని కారు నంబర్ ప్లేట్ వైరల్ అవుతోంది.

Published on: May 6, 2026, 20:32:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CM Vijay: స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాలను పూర్తిగా మార్చేశాడు. కొత్తగా స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ద్వారా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకున్నాడు. మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే అత్యధిక సీట్లు సాధించిన విజయ్ సీఎం కుర్చీపై కూర్చోవడానికి సిద్ధమవుతున్నాడు.

విజయ్ కారు నంబర్ ప్లేట్
విజయ్ కారు నంబర్ ప్లేట్

రాజకీయాల్లో విజయ్

తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఈ పరిణామాలను గమనించిన అభిమానులు, విజయ్ ఈ విజయాన్ని రెండేళ్ల క్రితమే అంచనా వేశాడా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ 2024లో మాత్రమే టీవీకే పార్టీని అధికారికంగా స్థాపించాడు. కానీ, అంతకుముందే ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆశించాడు.

ఆ కారు నంబర్

2024లో విడుదలైన 'గోట్' (GOAT) సినిమాలో విజయ్ నడిపే కారు నంబర్ ప్లేట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఒక సీన్ మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయ్ కారు నడుపుతున్న ఒక సన్నివేశంలో, కారు నంబర్ ప్లేట్ స్పష్టంగా 'TN 07 CM 2026' అని కనిపిస్తుంది. CM 2026 అని ఉండటంతో విజయ్ 2026లో సీఎం అవుతానని ముందే ఊహించారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

టైమ్ ట్రావెల్

ఇప్పుడు సీఎం పదవి చేపట్టడానికి విజయ్ సిద్ధమైన నేపథ్యంలో గోట్ మూవీలోని కారు క్లిప్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. "అద్భుతమైన డీటైలింగ్", "సరిగ్గా సమయం వచ్చేసరికి తన ఆశయాన్ని నిజం చేసుకున్నారు", ‘‘విజయ్ టైమ్ ట్రావెలర్’’ అని పోస్టులు పెడుతున్నారు. ఇకపై ఐపీఎల్ విజేతలను కూడా విజయ్ ముందే చెప్పాలని కొందరు సరదాగా వ్యాఖ్యానించారు.

విజయ్ విజయభేరి

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ విజయభేరి మోగించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 స్థానాలను గెలుచుకుంది. మెజారిటీ మార్కుకు అవసరమైన 118 స్థానాలకు 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో ఇతర పార్టీల మద్దతును కూడగట్టేందుకు విజయ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరోవైపు విజయ్ చివరి చిత్రంగా చెప్పుకుంటున్న 'జాన నాయగన్' (Jana Nayagan) ఇంకా విడుదల కాలేదు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దీనికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: తమిళనాడు ఎన్నికల్లో TVK పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది?

సమాధానం: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ మొత్తం 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ప్రశ్న: 'గోట్' సినిమాలో విజయ్ కారు నంబర్ ప్లేట్ ప్రాముఖ్యత ఏమిటి?

సమాధానం: 'గోట్' చిత్రంలో విజయ్ నడిపే కారు నంబర్ ప్లేట్ 'TN 07 CM 2026' అని ఉంటుంది. ఇది 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ముందే సూచించిందని అభిమానులు నమ్ముతున్నారు.

ప్రశ్న: టీవీకే పార్టీ ఏయే పార్టీలను వెనక్కి నెట్టింది?

సమాధానం: TVK పార్టీ డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) వంటి దశాబ్దాల కాలంగా అధికారంలో ఉన్న ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More