Karan Johar Met Gala: షారుఖ్ ఖాన్ కంటే ఎంతో బెటర్.. కరణ్ జోహార్ లుక్ వైరల్.. రాజా రవివర్మ స్ఫూర్తితో డ్రెస్

Karan Johar Met Gala: మెట్ గాలా 2026లో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ అరంగేట్రం చేశారు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ‘ఫ్రేమ్డ్ ఇన్ ఎటర్నిటీ’ డ్రెస్ తో కరణ్ లుక్ అదిరిపోయింది. ఈ ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ గా మారాయి. రాజా రవివర్మ స్ఫూర్తితో ఈ డిజైన్ రెడీ చేయడం విశేషం. 

Published on: May 5, 2026, 09:40:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karan Johar Met Gala: ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మెట్ గాలా వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ అద్భుతమైన అరంగేట్రం చేశారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో ఆయన అడుగుపెట్టిన క్షణం నుంచే అందరి దృష్టిని ఆకర్షించారు. అతని లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మెట్ గాలాలో కరణ్ జోహార్ (Getty Images via AFP)
మెట్ గాలాలో కరణ్ జోహార్ (Getty Images via AFP)

హాట్ టాపిక్ గా కరణ్

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా రూపొందించిన ఈ డ్రెస్‌లో కరణ్ జోహార్ అదిరిపోయారు. ఫ్యాషన్ ప్రపంచంలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది థీమ్‌కు తగ్గట్టుగా ఆయన దుస్తులు ఉండడంతో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆ థీమ్

ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్ ‘కాస్ట్యూమ్స్ ఆర్ట్’ అనే థీమ్‌తో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా, సంగీతం, డిజైనింగ్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేదికపై కరణ్ జోహార్ ధరించిన దుస్తులకు 'ఫ్రేమ్డ్ ఇన్ ఎటర్నిటీ' అనే పేరు పెట్టారు.

కరణ్ పవర్-షోల్డర్డ్ వింటేజ్ జాకెట్, దాదాపు ఆరు అడుగుల పొడవుతో చేతితో పెయింట్ వేసిన కేప్‌ను ధరించారు. దీనికి తోడు ఆయన తన సొంత జ్యువెలరీ బ్రాండ్ అయిన 'త్యానీ' నుంచి డైమెండ్ నెక్లెస్‌ను, ఉంగరాలను ధరించి తన లుక్‌ను పర్ఫెక్ట్ గా మార్చేశారు.

రాజా రవివర్మ చిత్రాల నుంచి

భారతదేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రాల నుంచి స్ఫూర్తి పొంది ఈ దుస్తులను తయారు చేయించుకున్నట్లు కరణ్ స్పష్టం చేశారు. దీని వెనుక ఉన్న ఆలోచనను ఆయన వివరిస్తూ, "రాజా రవివర్మను ఎంచుకోవడం సరైన నిర్ణయం అనిపించింది, ఎందుకంటే ఆయన తన కళాఖండాల్లో భావోద్వేగాలను పలికించారు. నేను కూడా సినిమాల్లో అదే చేయడానికి ప్రయత్నిస్తున్నా" అని కరణ్ చెప్పారు.

ఊహించని మలుపు

ఈ మైలురాయి క్షణాల గురించి కరణ్ ఒక ప్రకటనలో తన అనుభూతిని పంచుకున్నారు. "సినిమాలను, కాస్ట్యూమ్స్‌ను అమితంగా ఇష్టపడే ఒక సాధారణ కలల ప్రపంచంలో ఉన్న వ్యక్తి నుంచి మెట్ గాలా మెట్లపై నిలబడే స్థాయికి ఎదగడం అనేది ఊహించని మలుపు. ఈ క్షణం నాకు ఎంతో ప్రత్యేకం. కేవలం ఫ్యాషన్ గురించి మాత్రమే కాదు, కథ చెప్పే విధానం గురించి కూడా" అని ఆయన వివరించారు.

అభిమానుల స్పందన

సోషల్ మీడియాలో కరణ్ జోహార్ లుక్ విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు ఆయన స్టైల్‌ను తెగ పొగిడేస్తున్నారు. రెడ్డిట్ లో ఒక యూజర్ స్పందిస్తూ.. "ఈ ఏడాది మెట్ గాలా థీమ్‌ను కరణ్ పర్ఫెక్ట్‌గా ఒడిసిపట్టారు. గతంలో షారుఖ్ ఖాన్‌ ప్రెజెంట్ చేసిన విధానం కంటే ఇది ఎన్నో రెట్లు బాగుంది" అని రాసుకొచ్చారు. మరొకరు "ఈ రోజు రాత్రి ఆయన డ్రెస్సింగ్ అత్యుత్తమంగా ఉంది" అని కామెంట్ చేశారు.

మరో అభిమాని ఏమో.. "కళను, డ్రామను కోల్పోకుండా, పూర్తిగా ఇండియాను ప్రతిబింబించే దుస్తులు ధరించడం చాలా ఆనందంగా ఉంది. ఇది కరణ్ సాధించిన పెద్ద విజయం" అని ప్రశంసించారు. మరో యూజర్ "రాజా జోహార్ లుక్ చాలా రాయల్‌గా ఉంది" అంటూ కామెంటు పెట్టారు.

ఈ సినిమాలు

ఇక సినిమాల విషయానికి వస్తే కరణ్ జోహార్ ప్రస్తుతం 'చంద్ మేరా దిల్' అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వివేక్ సోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే, లక్ష్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామా మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న: కరణ్ జోహార్ మెట్ గాలా 2026 దుస్తులను ఎవరు డిజైన్ చేశారు?

జవాబు: కరణ్ జోహార్ ధరించిన 'ఫ్రేమ్డ్ ఇన్ ఎటర్నిటీ' దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.

ప్రశ్న: కరణ్ జోహార్ మెట్ గాలా దుస్తులకు ఏ చిత్రకారుడు స్ఫూర్తి?

జవాబు: ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రాల నుంచి స్ఫూర్తి పొంది ఈ దుస్తులను తయారు చేశారు.

ప్రశ్న: 'చంద్ మేరా దిల్' చిత్రం ఎప్పుడు విడుదల కానుంది?

జవాబు: 'చంద్ మేరా దిల్' చిత్రం మే 22న థియేటర్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More