Pooja Hegde On Vijay: ఓ మై గాడ్.. పార్టీ టైమ్.. విజయ్ విక్టరీపై జన నాయగన్ హీరోయిన్ పూజ హెగ్డే పోస్ట్ వైరల్

Pooja Hegde On Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన‌ దళపతి విజయ్ పై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. సినిమా సెలబ్రిటీలు విజయ్ ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా హీరోయిన్ పూజ హెగ్డే కూడా పోస్టు పెట్టింది. 

Published on: May 5, 2026, 05:51:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pooja Hegde On Vijay: కొంతమంది హిస్టరీని చదువుతారు.. కానీ కొంతమంది ఆ హిస్టరీని క్రియేట్ చేస్తారు. ఆ రెండో కోవకే చెందిన వ్యక్తే దళపతి విజయ్. కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలను వదలేసి రాజకీయాల్లోకి వచ్చిన ఈ స్టార్ హీరో.. తాజా తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అదరగొట్టాడు. దీంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

విజయ్ తో పూజ హెగ్డే (x/hegdepooja)
విజయ్ తో పూజ హెగ్డే (x/hegdepooja)

ఓ మై గాడ్ అంటూ పూజ హెగ్డే

విజయ్ దళపతి చివరి సినిమా ‘జన నాయగన్’. రాజకీయ కెరీర్ కోసం సినిమాలను వదిలేసిన అతను నటించిన లాస్ట్ మూవీ ఇది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్. తాజాగా తమిళనాడు ఎన్నికలు 2026లో విజయ్ పార్టీ టీవీకే విజయ దుందుభి మోగించడంపై పూజ అమితమైన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

‘‘ఓ మై గాడ్. విజయ్ సార్ కంగ్రాచ్యులేషన్స్. ఈ దళపతి కచేరి మరింత పెద్దదిగా మారుతూనే ఉంది. ముందుకు దూసుకెళ్తోంది. పార్టీ టైమ్. లెట్స్ గో’’ అని ఎక్స్ లో విజయ్ తో ఉన్న ఫొటోను పూజ హెగ్డే షేర్ చేసింది.

విజయ్ ప్రభంజనం

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం సృష్టించింది. హంగ్ ఏర్పడిన నేపథ్యంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీవీకే పార్టీ 107 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇంకా 11 సీట్లు కావాలి. ఈ నేపథ్యంలో విజయ్ తో కలిసొచ్చే వాళ్లు ఎవరనేది ఉత్కంఠగా మారింది.

జన నాయగన్ గురించి

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లాస్ట్ మూవీ ‘జన నాయగన్’. ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. 2026 సంక్రాంతికే ఈ మూవీ విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ సెన్సార్ ఆలస్యం కారణంగా మూవీ రిలీజ్ కాలేదు. దీనిపై కోర్టు కేసు కూడా నడిచింది.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జన నాయగన్ లో దళపతి విజయ్, పూజ హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజూ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు నటించారు. ఈ చిత్రానికి హెచ్.వినోద్ డైరెక్టర్. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.

సీఎంగా విజయ్

తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్ సీఎం కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జన నాయగన్ టైటిల్ కార్డ్స్ లో ‘సీఎం దళపతి విజయ్’ అని యాడ్ చేసి మూవీని రిలీజ్ చేస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే జన నాయగన్ మూవీ విడుదలపై అప్ డేట్ వచ్చే అవకాశముంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More