పిల్లాడి ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోయిన పూజ హెగ్డే.. అతని డ్యాన్స్‌కు ఫిదా..మోనికా సాంగ్ కు డ్యాన్స్.. వీడియో వైరల్
మోనికా.. అంటూ ప్రపంచాన్ని తన డ్యాన్స్ తో ఊపేసింది పూజ హెగ్డే. కూలీ సినిమాలో పూజ డ్యాన్స్ చేసిన ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అయితే ఇదే సాంగ్ కు ఓ పిల్లాడి ఎనర్జీని పూజ మ్యాచ్ చేయలేకపోయింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
2025లో దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఊపేసిన పాటల్లో కూలీ సినిమాలోని ‘మోనికా’ సాంగ్ ఒకటి. బుట్టబొమ్మ పూజ హెగ్డే ఈ సాంగ్ లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది. గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఈ సాంగ్ కు తనదైన స్టైల్లో స్టెప్స్ వేసింది. కానీ ఇదే సాంగ్ కు ఓ పిల్లాడి ఎనర్జీని పూజ ఇప్పుడు మ్యాచ్ చేయలేకపోయింది.

మోనికా సాంగ్
2025లో రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులోని మోనికా సాంగ్ తెగ వైరల్ గా మారింది. ఈ పాటలో పూజ హెగ్డే తన అందచందాలతో అలరించింది. అయితే తాజాగా ఓ ఈవెంట్లో ఇదే పాటకు ఓ నాలుగైదేళ్ల పిల్లాడు చేసిన డ్యాన్స్ కు పూజ ఫిదా అయింది.
వైరల్ వీడియో
తాజాగా చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ ఫెస్ట్ కు స్పెషల్ గెస్ట్ గా పూజ హెగ్డే అటెండ్ అయింది. ఇదే ఈవెంట్లో కొంతమంది చిన్నారులు మోనిక సాంగ్ కు డ్యాన్స్ చేశారు. వీళ్లతో కలిసి పూజ కూడా డ్యాన్స్ చేసింది. అయితే ఇందులో ఓ చిచ్చర పిడుగులాంటి పిల్లాడు.. పూజ ముందు నిలబడి మోనిక సాంగ్ కు డ్యాన్స్ అదరగొట్టాడు. అతని ఎనర్జీని పూజ మ్యాచ్ చేయలేకపోయింది.
ఆ పిల్లాడి డ్యాన్స్ కు పూజ ఫిదా అయింది. సాంగ్ ఆగిపోయిన తర్వాత ఆ పిల్లాడికి హెడ్ బో చేస్తూ అప్రిషియేషన్ ఇచ్చింది పూజ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పూజ సినిమాలు
తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా కెరీర్ కొనసాగిస్తోంది పూజ హెగ్డే. ఆమె చివరగా సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీలో హీరోయిన్ గా కనిపించింది. కూలీలో స్పెషల్ సాంగ్ తో మెరిసింది. ఇక దళపతి విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ లో పూజ హీరోయిన్. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.
మరోవైపు హిందీలో హే జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలో నటిస్తోంది పూజ హెగ్డే. తమిళంలో కాంచన 4లో కూడా చేస్తుంది. తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ గా చేస్తోంది పూజ హెగ్డే.
ఆ మూవీతో
తమిళ సినిమా ముగమూడి (2012)తో కెరీర్ స్టార్ట్ చేసింది పూజ హెగ్డే. తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద, డీజే, సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్, ఆచార్య లాంటి సినిమాలు చేసింది పూజ హెగ్డే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


