అఫీషియల్.. హారర్ కామెడీ మూవీ కాంచన 4లో ఇద్దరు హీరోయిన్లు.. అందంతో మెస్మరైజ్ చేయనున్న పూజ హెగ్డే, నోరా ఫతేహి
హారర్ కామెడీ ఫ్రాంఛైజీ కాంచనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు కాంచన 4 రాబోతోంది. ఇందులో అందాల భామలు పూజ హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన కాంచన ఫ్రాంఛైజీ నుంచి మరో సినిమా రాబోతోంది. రాఘవ లారెన్స్ డైరెక్షన్ లోనే కాంచన 4 మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ ఇద్దరు అందాల భామలు కాంచన 4లో ఫీమేల్ లీడ్ రోల్స్ ప్లే చేయనున్నారు.

కాంచన 4 హీరోయిన్లు
కాంచన 4 సినిమాలో పూజ హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే గత ఏడాది జూన్లో మృణాల్ ఠాకూర్ ఈ హర్రర్ కామెడీ ఫ్రాంచైజీలో భాగం అవుతాడని పుకార్లు వచ్చాయి. కానీ అదంతా అబద్దమని తేలిపోయింది. ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో యాక్ట్ చేయడంతో పాటు లారెన్స్ దర్శకుడు, ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నాడు.
వెల్ కమ్
కాంచన 4 సినిమాలో హీరోయిన్లుగా పూజ హెగ్డే, నోరా ఫతేహి పేర్లను ప్రకటించేశారు. వీళ్లకు వెల్ కమ్ చెప్తూ మూవీ ప్రొడక్షన్ హౌస్ రాఘవేంద్ర ప్రొడక్షన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ‘‘అత్యంత భయానక పరిస్థితుల్లోనూ తన అందంతో ఆమె అలరిస్తుంది. పూజ హెగ్డేకు స్వాగతం’’, ‘‘తన అందంతో మీ గుండెెలు కొల్లగొట్టి హారర్ ను మర్చిపోయేలా చేస్తుంది. నోరా వెల్ కమ్’’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.
షూటింగ్ లేట్
కాంచన 4 సినిమా కథా రచన ఎప్పుడో పూర్తయింది. షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ మూవీ గత ఏడాది సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ కు కొంత సమయం పట్టింది. రాఘవ లారెన్స్ రూపొందించిన, దర్శకత్వం వహించిన హర్రర్ కామెడీ సిరీస్ లో ఐదవ చిత్రం కాంచన 4.
ఈ ఫ్రాంఛైజీలో ఫస్ట్ పార్ట్ ముని 2007లో రిలీజైంది. తరువాత 2011లో ముని 2: కాంచన వచ్చింది. కాంచన 2, కాంచన 3 వరుసగా 2015, 2019లో రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రాల్లో రాఘవ లారెన్స్, కోవై సరళ, శ్రీమన్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో కనిపించారు. రాఘవ చివరిసారిగా విజయవంతమైన జిగర్తాండ డబుల్ ఎక్స్ లో కనిపించాడు. ఆయన బెంజ్, అధిగరం, కాలా భైరవ, బుల్లెట్, హంటర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


