Shahrukh Helps Deepika: కడుపుతో ఉన్న దీపికా చేయి పట్టుకుని మెట్లు ఎక్కించిన షారుఖ్ ఖాన్.. ఓల్డ్ వైన్‌లాగా అంటూ!
Shahrukh Khan Helps Pregnant Deepika Padukone: రెండోసారి గర్భవతి అయిన దీపికా పదుకొణెను మెట్లు ఎక్కేందుకు షారుఖ్ ఖాన్ సహాయం చేసిన తీరు ఇంటర్నెట్‌లో నెటిజన్ల మనసు దోచుకుంటుంది. ఈ సంఘటనకు కింగ్ మూవీ సేట్ వేదికగా మారింది. షారుఖ్, దీపికా జంటపై నెటిజన్స్, ఫ్యాన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Shahrukh Khan Helps Deepika Pregnant Padukone On King Set: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కేవలం తెరపైనే కాదు, నిజజీవితంలోనూ 'కింగ్' అనిపించుకున్నారు. రెండోసారి గర్భవతి అయిన దీపికా పదుకొణె ప్రస్తుతం ఆయనతో కలిసి 'కింగ్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

దీపికాకు అండగా నిలిచిన దృశ్యం
అయితే, కింగ్ షూటింగ్ విరామ సమయంలో మెట్లు ఎక్కుతున్న దీపికాకు షారుఖ్ తన చేయి అందించి వెన్నంటే నిలిచిన దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపికా పదుకొణె చేయి పట్టుకుని షారుఖ్ నడిపించిన తీరుకు ఇంటర్నెంట్ ఫిదా అవుతుంది. నలుపు రంగు షర్ట్, ప్యాంట్ ధరించిన షారుఖ్, తన కో-స్టార్ పట్ల చూపిన ఈ ధోరణి ఆయనలోని 'జెంటల్‌మెన్'ను మరోసారి పరిచయం చేసింది.
వెల్లువెత్తుతున్న ప్రశంసలు
ఈ వీడియో చూసిన అభిమానులు షారుఖ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "అందుకే ఆయన కింగ్ ఖాన్ అయ్యారు" అని ఒకరు, "గ్రీన్ ఫ్లాగ్ మెన్ అంటే ఇలాగే ఉంటారు" అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన 'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'హ్యాపీ న్యూ ఇయర్' వంటి సినిమాల జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
దర్శకుడి ఆగ్రహం.. లీకులకు అడ్డుకట్ట
ఈ షారుఖ్, దీపికా జంట వెండితెరపై ఓల్డ్ వైన్‌లాగా రోజురోజుకూ మరింతగా అలరిస్తోందని నెటిజన్లు మురిసిపోతున్నారు. మరోవైపు, షూటింగ్ కింగ్ మూవీ నుంచి షారుఖ్ ఖాన్, దీపికా ఫొటోలు లీక్ అవ్వడంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సౌత్ ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడంతో ఆయన స్పందించారు. "దయచేసి 'కింగ్' సినిమాకు సంబంధించిన లీక్డ్ కంటెంట్‌ను షేర్ చేయకండి. మీకు అద్భుతమైన సినిమా అనుభూతిని అందించేందుకు మా టీమ్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. బిగ్ స్క్రీన్ మీద వచ్చే సర్‌ప్రైజ్ కోసం వేచి చూడండి" అని సిద్ధార్థ్ ఆనంద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేశారు.
'కింగ్' గురించి మరిన్ని విశేషాలు
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ మూవీలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ వంటి స్టార్ నటీనటులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఒక అండర్ వరల్డ్ డాన్‌గా, సుహానా ఆయన శిష్యురాలిగా కనిపిస్తారని సమాచారం.
2023లో 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన షారుఖ్ ఖాన్ 'కింగ్' కోసం కఠినంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా కింగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


