Deepika Padukone: నడవలేని స్థితిలో దీపికా పదుకొణె, జబ్బు పడిన ఆనవాళ్లే కనిపించలేదు.. హీరోయిన్ లారా దత్తా కామెంట్స్
Lara Dutta About Deepika Padukone: బాలీవుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'హౌస్‌ఫుల్' నేటికి 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లారా దత్తా ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. షూటింగ్ సమయంలో దీపికా పదుకొణె మలేరియా బారిన పడి కూడా ఎలా పనిచేశారో వివరించారు.
Lara Dutta About Deepika Padukone: సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో నటీనటులు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు కానీ, ఆ కెమెరా వెనుక వారు పడే శ్రమ, ఆరోగ్య సమస్యలు ప్రేక్షకులకు పెద్దగా తెలియవు. 2010లో వచ్చిన 'హౌస్‌ఫుల్' సినిమా షూటింగ్ సమయంలో దీపికా పదుకొణె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మరో హీరోయిన్ లారా దత్తా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లండన్ షెడ్యూల్ సమయంలో దీపికా పదుకొణెకు మలేరియా సోకింది. వణుకు పుట్టించే జ్వరం ఉన్నా దీపికా ఏమాత్రం వెనక్కి తగ్గలేదని లారా కొనియాడారు.

వణుకుతున్నా ఆగని షూటింగ్
దీపికా పదుకొణె అంకితభావం గురించి లారా దత్తా మాట్లాడుతూ.. "షూటింగ్ జరుగుతున్నప్పుడు దీపికాకు మలేరియా సోకింది. ఆమె నీరసించిపోయి నడవలేని స్థితిలో ఉన్నారు. రాత్రంతా జ్వరంతో వణుకుతూ ఉండేవారు. వైద్యులు వచ్చి మందులు ఇస్తున్నా, మరుసటి రోజు ఉదయం కల్లా మేకప్ వేసుకుని సెట్స్‌లో ఉండేవారు" అని చెప్పారు.
"ఎందుకంటే ఆ షెడ్యూల్‌లో చాలా మంది నటీనటులు ఉండటంతో పాటు డేట్స్ కుదరడం కష్టం. ఆ సమయంలో కొన్ని ఎమోషనల్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. తన వల్ల షూటింగ్ ఆగకూడదనే ఉద్దేశంతో ఆమె తన శక్తినంతా కూడగట్టుకుని నటించారు. ఆమె నటనలో ఎక్కడా జబ్బు పడిన ఆనవాళ్లు కనిపించకపోవడం గమనార్హం" అని లారా దత్తా పేర్కొన్నారు.
స్టార్లతో కళకళలాడిన 'హౌస్‌ఫుల్'
ఇదిలా ఉంటే, సాజిద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన హౌస్‌ఫుల్ సినిమా బాలీవుడ్‌లో ఒక పెద్ద కామెడీ ఫ్రాంచైజీకి పునాది వేసింది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అర్జున్ రాంపాల్, బోమన్ ఇరానీ, లారా దత్తా, దీపికా పదుకొణె వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది.
రూ. 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దురదృష్టవంతుడైన ఓ యువకుడు, తన అదృష్టాన్ని మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, అందులో వచ్చే కామెడీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
తిరుగులేని ఫ్రాంచైజీగా..
2010లో మొదలైన ఈ ప్రయాణం 2012, 2016, 2019, 2025 ఏళ్లలో వరుసగా సీక్వెల్స్‌తో కొనసాగింది. గతేడాది విడుదలైన 'హౌస్‌ఫుల్ 5' కూడా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రేక్షకులను అలరించింది. 16 ఏళ్లు గడిచినా 'హౌస్‌ఫుల్' మొదటి భాగం నేటికీ బుల్లితెరపై కనిపిస్తే ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతూనే ఉంది. లారా దత్తా చెప్పిన ఈ విషయంతో దీపికా పదుకోణె ప్రొఫెషనలిజం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


