Deepveer: రెండో ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత తొలిసారి బయట కనిపించిన దీపికా పదుకొణె-భార్యను జాగ్రత్తగా తీసుకెళ్లిన రణ్‌వీర్

Deepika Padukone Ranveer Singh At Airport: దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ త్వరలో రెండో సంతానం కలగనుంది. రెండో ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత మొదటిసారి ఈ జంట ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కారు. దీపికాను రణ్‌వీర్ ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 28, 2026, 10:01:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Deepika Padukone Ranveer Singh At Airport: మంగళవారం (ఏప్రిల్ 28) ముంబై విమానాశ్రయం ఒక ప్రత్యేక దృశ్యానికి వేదికైంది. రెండోసారి గర్భవతి అని ప్రకటించిన తర్వాత దీపికా పదుకొణె తొలిసారి బహిరంగంగా కనిపించారు. తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ప్రయాణానికి సిద్ధమైన దీపికా, చాలా సాధారణంగా కనిపిస్తూనే తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు.

రెండో ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత తొలిసారి బయట కనిపించిన దీపికా పదుకొణె-భార్యను జాగ్రత్తగా తీసుకెళ్లిన రణ్‌వీర్
రెండో ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత తొలిసారి బయట కనిపించిన దీపికా పదుకొణె-భార్యను జాగ్రత్తగా తీసుకెళ్లిన రణ్‌వీర్

ఈ క్రమంలో రణ్‌వీర్ సింగ్ తన భార్య పట్ల చూపిస్తున్న శ్రద్ధ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. కారు దిగినప్పటి నుంచి ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లే వరకు దీపికా వెంటే ఉంటూ, ఆమెను ఎంతో సురక్షితంగా రణ్‌వీర్ గైడ్ చేశారు.

స్టైలిష్ లుక్‌లో దీపికా.. సింపుల్‌గా రణ్‌వీర్

సాధారణంగా సెలబ్రిటీలు ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం పాకులాడుతుంటారు. కానీ దీపికా మాత్రం కంఫర్ట్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. కోబాల్ట్ బ్లూ కలర్ ఓవర్ సైజ్డ్ షర్ట్, దానికి తగ్గట్టుగా ఉండే ట్రౌజర్ ధరించి ఆమె చాలా కూల్‌గా కనిపించారు. తన లుక్‌కు మరింత హంగులు అద్దేలా బ్రైట్ ఎల్లో స్నీకర్స్, క్లాసిక్ బ్లాక్ హ్యాండ్‌బ్యాగ్ ధరించారు.

మరోవైపు రణ్‌వీర్ సింగ్ కూడా వైట్ ఓవర్ సైజ్డ్ టీషర్ట్, మల్టీ పాకెట్ కార్గో డెనిమ్స్‌తో చాలా సింపుల్‌గా కనిపించారు. ఫోటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వడానికి ఇష్టపడకుండా, ఈ జంట నేరుగా లోపలికి వెళ్లిపోయారు.

సోషల్ మీడియాలో వినూత్నంగా ప్రకటన

ఈ నెల ప్రారంభంలోనే తాము మళ్లీ తల్లిదండ్రులం కాబోతున్నామనే విషయాన్ని ఈ జంట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. తమ పెద్ద కుమార్తె 'దువా పదుకొణె సింగ్' చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరించారు.

2018లో ఇటలీలో వివాహం చేసుకున్న ఈ జంటకు, 2024 సెప్టెంబర్‌లో దువా జన్మించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది పాటు పాప ముఖాన్ని దాచిన ఈ దంపతులు, 2025 దీపావళి సందర్భంగా తన పేరును, ఫోటోను అభిమానులకు పరిచయం చేశారు.

కెరీర్ పరంగా ఇద్దరూ బిజీనే!

ఒకవైపు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు వృత్తిపరంగానూ ఇద్దరూ దూసుకుపోతున్నారు. దీపికా ప్రస్తుతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి 'రాకా' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే షారుఖ్ ఖాన్‌తో కలిసి 'కింగ్' అనే భారీ ప్రాజెక్టులోనూ ఆమె భాగమయ్యారు.

రణ్‌వీర్ సింగ్ విషయానికి వస్తే, ఆయన నటించిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 1,750 కోట్ల రూపాయల వసూళ్లతో పాటు, ఇండియాలో 1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. దీని తర్వాత రణ్‌వీర్ సింగ్ జయ్ మెహతా దర్శకత్వంలో 'ప్రళయ్' అనే చిత్రంలో నటించనున్నాడు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. దీపికా పదుకొణె రెండో ప్రెగ్నెన్సీని ఎప్పుడు ప్రకటించారు?

దీపికా, రణ్‌వీర్ దంపతులు 2026 ఏప్రిల్ ప్రారంభంలో తమ రెండో సంతానం గురించి అధికారికంగా ప్రకటించారు.

2. దీపికా పదుకొణె కుమార్తె పేరు ఏమిటి?

దీపికా, రణ్‌వీర్ దంపతుల మొదటి కుమార్తె పేరు 'దువా పదుకొణె సింగ్'. ఆమె 2024 సెప్టెంబర్‌లో జన్మించింది.

3. రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా రికార్డులేమిటి?

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1,750 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో 1,000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన మొదటి హిందీ చిత్రంగా నిలిచింది.

4. దీపికా పదుకొణె అల్లు అర్జున్‌తో కలిసి ఏ సినిమాలో నటిస్తున్నారు?

దీపికా పదుకొణె ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'రాకా' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More