Deepika Padukone: రాకా నుంచి దీపికా పదుకొణె అవుట్, ప్రెగ్నెన్సీ వల్ల తగ్గిన పాత్ర నిడివి.. అన్నింటిపై మేకర్స్ క్లారిటీ!
Raaka Makers About Deepika Padukone Rumours Over Pregnancy: రెండోసారి గర్భం దాల్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెపై చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'రాకా' చిత్రం నుంచి దీపికా తప్పుకున్నారని, పాత్ర నిడివి తగ్గిందన్న వార్తలపై చిత్ర యూనిట్ తాజాగా స్పందించింది.
Raaka Makers On Deepika Padukone Rumours: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాకా' (Raaka)లో ఆమె నటిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ప్రెగ్నెన్సీ కారణంగా
ప్రెగ్నెన్సీ కారణంగా దీపికా పదుకొణె పాత్ర నిడివిని తగ్గించారని, లేదంటే ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం తాజాగా ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
రూమర్లకు చెక్ పెట్టిన 'రాకా' టీమ్
దీపికా పదుకొణె పాత్రపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని మేకర్స్ కొట్టిపారేశారు. "షూటింగ్ ప్లాన్ చేసిన ప్రకారమే జరుగుతోంది. 'రాకా' చిత్రంలో దీపికా పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం సెట్స్‌లో షూటింగ్ ఎంతో ఉత్సాహంగా, సజావుగా సాగుతోంది" అని చిత్ర యూనిట్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. దీపికా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం లేదని, షూటింగ్‌లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.
సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో నటీమణులు షూటింగ్‌లకు విరామం తీసుకుంటారు. కానీ, దీపికా మాత్రం వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతున్నారు. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ఆమె కొన్ని సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. గర్భిణిగా ఉన్నప్పటికీ, తన వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కాకూడదని ఆమె నిర్ణయించుకున్నారట.
భారీ అంచనాల మధ్య అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్
కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ, టాలీవుడ్ సెన్సేషన్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో 'రాకా'పై భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేసింది. ఇందులో బన్నీ గుండుతో, రగ్గడ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఇక రాకా సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్స్ అన్నీ టైట్‌గా ఉండటంతో, దీపికా కూడా డెడ్ లైన్స్ పాటించాలని పట్టుదలతో ఉన్నారు. షూటింగ్ సమయంలో ఆమె ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేకర్స్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రెండోసారి పేరెంట్స్ కాబోతున్న దీపికా - రణ్‌వీర్
ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులు తమ రెండో సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆదివారం (ఏప్రిల్ 19) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ పెద్ద కుమార్తె దువా పదుకొణె సింగ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు.
2018లో వివాహం చేసుకున్న రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె జంట 2024 సెప్టెంబర్‌లో మొదటి బిడ్డ దువాకు జన్మనిచ్చారు. ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కపుల్ తల్లిదండ్రులు కాబోతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


