నిజానికి భర్తలపై భార్యలు అరవాలి, ఇంట్లో మా ఆయనకు ఏమవుతుందో అడగండి.. చెంపదెబ్బ కొట్టడంపై హీరోయిన్ రాణి ముఖర్జీ కామెంట్స్

భార్యాభర్తల బంధంపై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. భార్యలు తమ భర్తలపై అరుస్తూ మాట్లాడటాన్ని రాణి ముఖర్జీ సమర్థించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తన ఇంట్లో రాణి ముఖర్జీ భర్త గురించి అడగకండి అంటూ కామెంట్స్ చేశారు రాణి ముఖర్జీ.

Published on: Jan 29, 2026, 16:01:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ఇంటి వాతావరణం, దంపతుల మధ్య ఉండాల్సిన సంబంధంపై రాణి ముఖర్జీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు తెరలేపాయి. భర్తలపై భార్యలు గొంతు పెంచి మాట్లాడాలని రాణి అనడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

నిజానికి భర్తలపై భార్యలు అరవాలి, ఇంట్లో మా ఆయనకు ఏమవుతుందో అడగండి.. చెంపదెబ్బ కొట్టడంపై హీరోయిన్ రాణి ముఖర్జీ కామెంట్స్
నిజానికి భర్తలపై భార్యలు అరవాలి, ఇంట్లో మా ఆయనకు ఏమవుతుందో అడగండి.. చెంపదెబ్బ కొట్టడంపై హీరోయిన్ రాణి ముఖర్జీ కామెంట్స్

అసలేం జరిగింది?

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రాణి ముఖర్జీ సమాజంలో లింగ సమానత్వం గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఒక బాలుడు తన తల్లిని తన తండ్రి ఎలా చూస్తున్నాడో గమనిస్తూ పెరుగుతాడని, తండ్రి ప్రవర్తనే కొడుకు వ్యక్తిత్వాన్ని మలుస్తుందని రాణి ముఖర్జీ అభిప్రాయపడ్డారు.

గౌరవం ఇంటి నుంచే

"గౌరవం అనేది ఇంటి నుంచే మొదలవుతుంది. ఇంట్లో తల్లిని తండ్రి సరిగ్గా చూడకపోతే, బయట అమ్మాయిలను కూడా అలాగే చూడవచ్చని అబ్బాయిలు భావిస్తారు. కాబట్టి ఇంట్లో భార్యను గౌరవించే విషయంలో తండ్రులు బాధ్యతగా ఉండాలి. అప్పుడే సమాజంలో మహిళలకు దక్కాల్సిన హోదా ఏంటో అబ్బాయిలకు అర్థమవుతుంది" అని రాణి ముఖర్జీ పేర్కొన్నారు.

అయితే, ఇదే క్రమంలో రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. "భర్త తన భార్యపై అస్సలు గొంతు పెంచకూడదు. నిజానికి భార్యే భర్తపై గొంతు పెంచి మాట్లాడాలి.. అప్పుడే అంతా బాగుంటుంది" అని వ్యాఖ్యానించారు.

చెంపదెబ్బ కొట్టిన విషయం

అంతేకాకుండా తన స్కూల్ రోజుల్లో ఒక అబ్బాయిని చెంపదెబ్బ కొట్టిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. తన భర్త, ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను సరదాగా ఉద్దేశించి "ఇంట్లో ఆయనకు రోజూ ఏమౌతుందో అడగకండి" అంటూ నవ్వేశారు.

నెటిజన్ల ఆగ్రహం: ‘అరవడాన్ని ఎలా సమర్థిస్తారు?’

అయితే, రాణి ముఖర్జీ ఆ మాటలను సరదాగా అన్నప్పటికీ.. సంబంధాల్లో 'అరవడాన్ని' లేదా 'గొంతు పెంచడాన్ని' సాధారణంగా చెప్పడం నెటిజన్లకు నచ్చలేదు. రెడిట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై రాణి ముఖర్జీపై విమర్శల వర్షం కురుస్తోంది.

"ఆమె తనను తాను చాలా ఫన్నీ అనుకుంటుంది.. కానీ ఆమె మాటలు ఏమాత్రం నవ్వు తెప్పించడం లేదు" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, "ఏ బంధంలోనైనా ఒకరిపై ఒకరు అరవడం సరైన పద్ధతి కాదు. ప్రశాంతంగా మాట్లాడుకోవాలి కానీ ఇలా అరిచి గోల చేయడం ఏంటి?" అని మరో నెటిజన్ ప్రశ్నించారు. "ఆమె సీనియర్ నటి అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు" అంటూ విమర్శిస్తున్నారు.

‘మర్దానీ 3’ మూవీతో

ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాణీ ముఖర్జీ తన సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ ‘మర్దానీ 3’ మూవీ విడుదలకు రెడీగా ఉంది. ఇందులో రాణి ముఖర్జీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్‌గా కనిపించనున్నారు.

మహిళలపై జరిగే నేరాలను అరికట్టే నేపథ్యంలో సాగే మర్దానీ 3 చిత్రం జనవరి 30న (అంటే రేపు) థియేటర్లలోకి రానుంది. అభిరాజ్ మిన్వాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాణి ముఖర్జీ భర్త ఆదిత్య చోప్రా నిర్మించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More