Child Artist: హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్, అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్‌తో టైటిల్- తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఫీల్ మై లవ్

Feel My Love Vinayaka Chavithi Special Poster: హీరోగా 96 మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఆదిత్య భాస్కర్ పరిచయం కానున్నాడు. అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్‌ టైటిల్‌గా వస్తోన్న సినిమా ఫీల్ మై లవ్. వినాయక చవితి పండుగ సందర్భంగా 'ఫీల్ మై లవ్' సినిమా బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ విశేషాలు చూద్దాం.

Published on: Sep 15, 2026, 23:31:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Feel My Love Vinayaka Chavithi Special Poster: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘96’ సినిమాలో చిన్నప్పటి రామ్‌ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆదిత్య భాస్కర్ హీరోగా నటించిన కొత్త చిత్రం రాబోతోంది. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఫీల్ మై లవ్’.

హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్, అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్‌తో టైటిల్- తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఫీల్ మై లవ్
హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్, అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్‌తో టైటిల్- తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఫీల్ మై లవ్

అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్‌తో టైటిల్

ఈ ఫీల్ మై లవ్ సినిమాకు హరి ప్రకాష్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలోని బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ఫీల్ మై లవ్‌తో ఈ సినిమా రావడం విశేషంగా మారింది. తాజాగా ఫీల్ మై లవ్ సినిమా నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

ఆకట్టుకుంటున్న పండుగ పోస్టర్

నూతనంగా విడుదల చేసిన ఫెస్టివ్ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. రొమాన్స్, కామెడీ, భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో ఈ ఫీల్ మై లవ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఫీల్ మై లవ్ టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది.

వినాయక చవితి స్పెషల్ పోస్టర్

ఇప్పుడు వచ్చిన వినాయక చవితి 2026 స్పెషల్ పోస్టర్ ఫీల్ మై లవ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇకపోతే ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్ సరసన ఐరా, అమ్ము అభిరామి కథానాయికలుగా నటిస్తుండగా, మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక కీలక పాత్రల్లో కనిపిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రమోషన్లు

ఫీల్ మై లవ్ సినిమా ప్రమోషన్ల వేగాన్ని పెంచేందుకు మేకర్స్ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. త్వరలోనే పాటలను ఎంతో వైభవంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఫీల్ మై లవ్ ప్రమోషనల్ ఈవెంట్లను నిర్వహించబోతున్నారు. నేరుగా ప్రేక్షకుల వద్దకే వెళ్లి చిత్ర విశేషాలను పంచుకునేలా ప్లాన్ చేశారు.

ప్రకృతి అందాల మధ్య చిత్రీకరణ.. పాన్ ఇండియా రిలీజ్

దక్షిణాదిలోని అత్యంత అందమైన ప్రదేశాలైన చెన్నై, పుదుచ్చేరి, మున్నార్, కొడైకెనాళ్ లొకేషన్లలో ఈ ఫీల్ మై లవ్ సినిమా చిత్రీకరణ జరిపారు. ఈ ప్రకృతి అందాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఎం.ఎస్. సతీష్ కెమెరా వర్క్, రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి అందిస్తున్న సంగీతం యూత్‌ను కట్టిపడేస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

అన్ని భాషల్లో పాన్ ఇండియాగా ఫీల్ మై లవ్ రిలీజ్

ఫీల్ మై లవ్ చిత్రాన్ని కేవలం ఒక్క భాషకే పరిమితం చేయకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. అజయ్ మనోజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More