Vasudheva Sutham Review: వసుదేవసుతం రివ్యూ- అదిరిపోయే ట్విస్టులు, విజువల్స్- చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ మూవీ ఎలా ఉందంటే?
Vasudheva Sutham Movie Review And Rating: చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా, పూరి జగన్నాథ్ ఆలయ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఆధ్యాత్మిక యాక్షన్ థ్రిల్లర్ వసుదేవసుతం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమా ఎలా ఉందో నేటి వసుదేవసుతం రివ్యూలో తెలుసుకుందాం.
Vasudheva Sutham Review In Telugu And Rating: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భక్తి, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. 'కార్తికేయ', 'అఖండ' చిత్రాల తరహాలోనే దైవిక శక్తిని, రహస్యాలను ముడిపెడుతూ సరికొత్త కాన్సెప్ట్‌తో నేడు (జూలై 10) థియేటర్లలోకి వచ్చిన చిత్రమే 'వసుదేవసుతం'.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మించారు. ఈ సినిమాకు వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. తెలుగు డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో నేటి వసుదేవసుతం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
పురుషోత్తమపురి అనే ఊరిలోని ప్రముఖ వాసుదేవ ఆలయం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆ ఆలయ చైర్మన్ శర్మ (దువ్వాసి మోహన్)ను హీరా బంధు (మైమ్ గోపి) హతమార్చి, ఆలయ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. అదే సమయంలో హైదరాబాద్‌లో ఉండే కృశవ్ (మహేంద్రన్) వాసుదేవ ఉత్సవాల కోసం ఆ ఊరికి వస్తాడు. అక్కడ హీరా బంధు మేనకోడలు భువి (అంబికా వాణి) పరిచయమై, ఇద్దరూ ప్రేమలో పడతారు.
అయితే, అందరూ వెళ్లడానికి భయపడే 'కోయిరాతల' అనే రహస్య ప్రదేశం గురించి, అలాగే అదృశ్యమైన శర్మ గురించి కృశవ్ అన్వేషణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో కృశవ్‌పై దాడులు జరుగుతాయి. ఈ క్రమంలో సెంట్రల్ మినిస్టర్ (జాన్ విజయ్) ఎంటరై, కృశవ్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ అని చెప్పడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
ఆ తర్వాత ఏమైంది? కృశవ్ జైలుకు ఎందుకు వెళ్లాడు? ఆలయ అధికారాన్ని హీరా బంధు చేజిక్కుంచునేందుకు కారణం ఏంటీ? వాసుదేవ గుడిలో ఎలాంటి నిధి దాగుంది? ఆ నిధి దక్కించుకోవాలంటే చేసే సాహసాలు ఏంటీ? వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో సాగే సినిమానే వసుదేవసుతం.
విశ్లేషణ:
వాసుదేవ ఆలయం, శర్మ హత్యతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో, హీరోయిన్ పరిచయం, ప్రేమ, కృశవ్‌పై దాడులు, మధ్యలో వచ్చే మిస్టరీ అంశాలతో ఇంట్రెస్టింగ్‌గా సినిమా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ కలుగుతుంది.
ద్వితీయార్ధంలో వచ్చే హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ఆత్మలా నిలిచింది. తన అక్క సెంటిమెంట్, కుటుంబ బాధ్యతల చుట్టూ సాగే ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఫ్లాష్‌బ్యాక్ ముగిసిన వెంటనే సినిమా ట్రెజర్ హంట్ మోడ్‌లోకి మారుతుంది. పూరి ఆలయ రహస్యాలు, దాని కింద దాగి ఉన్న నిధిని వెతికే క్రమంలో వచ్చే సీన్లు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటాయి.
విలన్ల నుంచి హీరోను కాపాడటానికి ప్రకృతి, దేవుడు, గరుత్మంతుడు, సర్పాలు వచ్చే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే అసలు విలన్ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉండి సర్‌ప్రైజ్ చేస్తుంది.
అద్భుతమైన ఏఐ (AI) విజువల్స్..
దర్శకుడు వైకుంఠ్ బోను ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. పూరి జగన్నాథ్ ఆలయ విశిష్టతను, బ్రహ్మ పదార్థం గొప్పతనాన్ని నేటి తరానికి నచ్చేలా కల్పిత కథతో అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో గరుత్మంతుడికి సంబంధించిన విజువల్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకున్న విధానం అద్భుతంగా ఉంది.
సస్పెన్స్ ఎలిమెంట్స్‌ని ఎలివేట్ చేయడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలలో గ్రాఫిక్స్ వర్క్ సినిమా స్థాయిని పెంచాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన మహేంద్రన్ ఈ సినిమాలో హీరోగా పరిణతి చెందిన నటనను కనబరిచారు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే?
హీరోయిన్ అంబికా వాణి తన గ్లామర్‌తో, నటనతో ఆకట్టుకుంది. నెగెటివ్ పాత్రల్లో మైమ్ గోపి, జాన్ విజయ్ భయపెట్టారు. ఆటో రామ్ ప్రసాద్, రాజీవ్ కనకాల, తులసి, ఐశ్వర్య లక్ష్మి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. క్లైమాక్స్‌లో పార్ట్-2 కి ఇచ్చిన లీడ్ బానే ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే మైథలాజికల్ మిస్టరీ అంశాలతో ట్రెజర్ హంట్ సినిమా చూడాలనుకునే వారు వసుదేవసుతంపై లుక్కేయవచ్చు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


