Anjali Anand: కేవలం లావుగా ఉన్నాననే అలాంటి పాత్రలే ఇస్తున్నారు.. ఓటీటీ హీరోయిన్ అంజలి ఆనంద్ ఆవేదన

Anjali Anand On Body Shaming Typecast: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ఫేమ్ అంజలి ఆనంద్ సినిమా ఇండస్ట్రీలో ఎదురవుతున్న బాడీ షేమింగ్, టైప్‌కాస్టింగ్‌పై స్పందించారు. కేవలం తన శరీర ఆకృతిని చూసే మొదట్లో పాత్రలు ఇచ్చేవారని, నేడు థియేటర్లలోకి వచ్చిన 'ధమాల్ 4' సినిమా ఆఫర్ వెనుక ఉన్న కథను పంచుకున్నారు.

Published on: Jul 10, 2026, 14:08:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anjali Anand On Body Shaming Typecast: సినిమా పరిశ్రమలో ప్రతిభ కంటే బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. సాధారణంగా కాస్త లావుగా ఉండే నటీమణులను కేవలం కామెడీ పాత్రలకో, లేదంటే బాడీ షేమింగ్ జోకులతో అవమానించే పాత్రలకో పరిమితం చేస్తుంటారు.

కేవలం లావుగా ఉన్నాననే అలాంటి పాత్రలే ఇస్తున్నారు.. ఓటీటీ హీరోయిన్ అంజలి ఆనంద్ ఆవేదన
కేవలం లావుగా ఉన్నాననే అలాంటి పాత్రలే ఇస్తున్నారు.. ఓటీటీ హీరోయిన్ అంజలి ఆనంద్ ఆవేదన

బాడీ టైప్ బట్టే

బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ సైతం కెరీర్ ఆరంభం నుంచి ఇదే విధమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' చిత్రంలో రణ్‌వీర్ సింగ్ సోదరి (గాయత్రి అలియాస్ గోలు)గా మెప్పించిన ఆమె.. ఇండస్ట్రీలో తనను కేవలం 'బాడీ టైప్' (శరీర ఆకృతి) బట్టే జడ్జ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టాలెంట్ కంటే ముందే శరీరాన్ని చూశారు!

జూలై 10న (ఈరోజు) ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ కామెడీ ఎంటర్‌టైనర్ 'ధమాల్ 4' (Dhamaal 4) లో అంజలి ఆనంద్ ఒక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పీటీఐ (PTI) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇండస్ట్రీలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. తనకు నటన వచ్చని తెలుసుకునే ముందే, కేవలం లావుగా ఉందనే కారణంతో దర్శకులు తనను సినిమాల్లోకి తీసుకునేవారని చెప్పారు.

"నాకు వచ్చిన ప్రతి అవకాశంలోనూ మొదట నా శరీర ఆకృతిని చూసే ఎంపిక చేశారు. ఆ తర్వాతే వీళ్లు బాగా నటించగలరని నమ్మి వేరే పాత్రలు ఇచ్చారు. నా మొదటి ఓటీటీ వెబ్ సిరీస్ 'అన్‌ట్యాగ్' (Untag)లో కేవలం నా లావు వల్లే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'రాత్ జవాన్ హై', 'డబ్బా కార్టెల్' వంటి సిరీస్‌లలో నాకు నటనకు ప్రాధాన్యమున్న మంచి పాత్రలు దక్కాయి" అని అంజలి ఆనంద్ వెల్లడించారు.

బాడీ షేమింగ్ జోకులు.. 'ధమాల్ 4' తిరస్కరించాలనుకున్నా!

ఓటీటీ వెబ్ సిరీస్‌లతో పాటు బుల్లితెరపై 'ధాయ్ కిలో ప్రేమ్' సీరియల్ ద్వారా అంజలి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె నటించిన దాదాపు అన్ని పాత్రలు లావుగా ఉన్న అమ్మాయిల చుట్టూ, వారిపై వేసే జోకుల చుట్టూనే సాగాయి. చివరకు కరణ్ జోహార్ సినిమాలోనూ ఇదే ధోరణి కొనసాగింది. ఇప్పటివరకు తన శరీరంతో సంబంధం లేని ఒక్క పాత్ర కూడా తనకు దక్కలేదని అంజలి ఆనంద్ అంగీకరించారు.

మన కమర్షియల్ సినిమాలలో ప్లస్ సైజ్ నటీమణులను జోకర్లుగా చూపించే సంస్కృతిపై అంజలి ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే 'ధమాల్ 4' సినిమాలో తన బరువుపై కొన్ని జోకులు ఉన్నాయని తెలిసి మొదట ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాలని అనుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ చిత్రంలో ఆమె రితేష్ దేశ్‌ముఖ్‌కు జోడీగా నటించారు.

"ఈ సినిమాలో నా బరువుపై జోకులు ఉండటంతో మొదట నో చెప్పాలనుకున్నా. ఎందుకంటే నేను ఎప్పుడూ బాడీ షేమింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాను. అందుకే నా అభిమానులు కొందరు ఈ సినిమా ఒప్పుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, ఎవరో ఒకరు ఆ పాత్ర చేయాలి. నేనే ఆ బాధ్యత తీసుకుని, ఆ పాత్రను మరింత గౌరవప్రదంగా ఎలా మార్చాలో ఆలోచించి నటించాను" అని అంజలి ఆనంద్ వివరించారు.

బాక్సాఫీస్ వద్ద 'ధమాల్ 4' సందడి

ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధమాల్ 4' జూలై 10న థియేటర్లలో విడుదలైంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్రాంచైజీ సినిమాలో అర్షద్ వార్సి, సంజయ్ మిశ్రా, సంజీదా షేక్, రవి కిషన్ వంటి భారీ తారాగణం ఉంది.

పూర్తి వినోదాత్మకంగా వచ్చిన ధమాల్ 4 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. భవిష్యత్తులోనైనా తన శరీరంతో సంబంధం లేకుండా కేవలం నటన ఆధారంగా మాత్రమే పాత్రలు వస్తాయని అంజలి ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More