Sign in

Anjali On Rumours: యాంకర్ ఓంకార్‌తో పెళ్లి- ఆ హీరోలతో లవ్ ఎఫైర్లపై హీరోయిన్ అంజలి కామెంట్స్- సీన్ రివర్స్ అయిందంటూ!

Heroine Anjali On Marriage Love Rumours: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అంజలి తన వ్యక్తిగత జీవితం, రహస్య వివాహం, హీరోలతో లవ్ ఎఫైర్స్‌పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కోలీవుడ్ హీరో విశాల్‌తో కలిసి నటిస్తున్న కొత్త సినిమా మకుటం ప్రమోషన్లలో భాగంగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌ను బయటపెట్టేశారు.

Published on: Jul 9, 2026, 13:05:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Heroine Anjali On Marriage Love Rumours: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో అమాయకపు నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'సీతమ్మ'గా చెరగని ముద్ర వేసుకున్నారు హీరోయిన్ అంజలి. రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

యాంకర్ ఓంకార్‌తో పెళ్లి- ఆ హీరోలతో లవ్ ఎఫైర్లపై హీరోయిన్ అంజలి కామెంట్స్- సీన్ రివర్స్ అయిందంటూ!
యాంకర్ ఓంకార్‌తో పెళ్లి- ఆ హీరోలతో లవ్ ఎఫైర్లపై హీరోయిన్ అంజలి కామెంట్స్- సీన్ రివర్స్ అయిందంటూ!

అంజలిపై రూమర్స్

వెండితెరపై ఎంతటి ఘనవిజయం సాధించినా.. ఆమె వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్లు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. టాలీవుడ్‌లో 'బలుపు', 'గీతాంజలి' వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు కోలీవుడ్‌లో 'అంగడి తెరు' (తెలుగులో షాపింగ్ మాల్), అజిత్ నటించిన 'మంకాతా' (తెలుగులో గ్యాంబ్లర్) వంటి భారీ హిట్లతో అంజలి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగారు.

గత కొంతకాలంగా ఆమె వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ, అంజలి పెళ్లిపై, హీరోలతో లవ్ ఎఫైర్లపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కొంతమంది హీరోలు, దర్శకులతో ఆమె ప్రేమలో పడిందని, అమెరికాకు చెందిన ఓ ఎన్నారై (NRI) ని రహస్యంగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిందంటూ వార్తలు ప్రచారమయ్యాయి. ఈ పుకార్లపై అంజలి ఎక్కడా నోరు మెదపలేదు.

యాంకర్ ఓంకార్‌తో పెళ్లి

బుల్లితెర యాంకర్, తెలుగు డైరెక్టర్ ఓంకార్‌ను కూడా అంజలి పెళ్లి చేసుకుంటుందనే వార్తలు పదేళ్ల క్రితం తెగ వైరల్ అయ్యాయి. అయితే, వాటిపై అప్పుడే అంజలి క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ డిక్టేటర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో అసలు డైరెక్టర్ ఓంకార్ ఎవరో కూడా తెలియదని, ఎప్పుడు చూడలేదని, సినిమా ఆఫర్ కూడా రాలేదని అంజలి అప్పుడే ఆ రూమర్స్‌కు స్వస్తి పలికింది.

విశాల్ 'మకుటం' సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ

ఇక ప్రస్తుతం నలభై ఏళ్ల వయసుకు చేరుకున్న అంజలి.. మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీ అవ్వడానికి పక్కా స్కెచ్ వేస్తున్నారు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే తమిళ యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మగుడం' (తెలుగులో మకుటం)లో ఆమె లీడ్ రోల్ పోషిస్తున్నారు.

నా పెళ్లి వార్తల్లో నిజం లేదు

మకుటం సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అంజలికి తన వ్యక్తిగత జీవితం, ప్రేమాయణాలపై మళ్లీ ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ ఇంటర్వ్యూలలో తనపై వస్తున్న రూమర్ల గురించి అంజలి ఎంతో ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు.

ఇన్నేళ్లుగా తనపై వస్తున్న అసత్య ప్రచారాలకు ఈ ఒక్క సమాధానంతో తెరదించారు. హీరోలతో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చాలా వార్తలు వచ్చినట్లు, అవి తనను ఎంతో బాధపెట్టినట్లు అంజలి పేర్కొన్నారు.

నా జీవితంలో ఎవరు లేరు

"నా వ్యక్తిగత జీవితం గురించి వచ్చే రూమర్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి వార్తలను నేను అస్సలు పట్టించుకోను. నేను ఒకరి పేరు చెబితే మీరు మరొకరి గురించి అడుగుతారు. అందుకే నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ప్రస్తుతం నా జీవితంలో ఎవరు లేరు. నేను ఇప్పటికీ ఒంటరిగానే (సింగిల్) ఉన్నాను" అని అంజలి స్పష్టం చేశారు.

అనంతరం తన స్కూల్ డేస్‌లో జరిగిన ఒక ఫన్నీ సంఘటనను అంజలి పంచుకున్నారు. "స్కూల్‌లో నా క్లాస్‌మేట్ నాకు వరుసగా ప్రపోజ్ చేస్తూనే ఉండేవాడు. ఓ రోజు నువ్వు రాఖీ కట్టగలవా అని సవాల్ విసిరాడు. దాంతో నేను ఏమాత్రం ఆలోచించకుండా అతనికి నిజంగానే రాఖీ కట్టాను" అని అంజలి చెప్పారు.

సీన్ రివర్స్ అయింది

"రాఖీ కడితే ఆ అబ్బాయి వెంటపడటం ఆపేస్తాడనుకున్నా. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయింది. వెంటనే రాఖీ తీసి నాకు ఇచ్చేసి వెళ్లిపోయాడు" అని హీరోయిన్ అంజలి చెప్పుకొచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More