ఎదురింటి పుల్ల కూరే కావాలన్న యాంకర్ గాయత్రి- నిర్మాతలు ఆడుకుంటున్నారు, ఆర్టిస్టులు బలైపోతున్నారు- సీరియల్ హీరో కౌశిక్

Serial Actor Krishna Koushik On Telugu Actors: తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌లో హీరోగా చేసిన నటుడు కృష్ణ కౌశిక్. యాంకర్ గాయత్రి భార్గవి పాడ్‌కాస్ట్‌లో ఇటీవల పాల్గొన్న కౌశిక్ బుల్లితెర, సినీ ఇండస్ట్రీలో తెలుగు నటీనటులు పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. ఆ విశేషాలను ఆయన మాటల్లో చూద్దాం.

Published on: Jun 16, 2026, 14:31:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Serial Actor Krishna Koushik On Telugu Actors And Producers:

ఎదురింటి పుల్ల కూరే కావాలన్న యాంకర్ గాయత్రి- నిర్మాతలు ఆడుకుంటున్నారు, ఆర్టిస్టులు బలైపోతున్నారు- సీరియల్ హీరో కౌశిక్ (Gayathri Bhargavi Podcast (YouTube))
ఎదురింటి పుల్ల కూరే కావాలన్న యాంకర్ గాయత్రి- నిర్మాతలు ఆడుకుంటున్నారు, ఆర్టిస్టులు బలైపోతున్నారు- సీరియల్ హీరో కౌశిక్ (Gayathri Bhargavi Podcast (YouTube))

సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై మెగా సీరియల్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు కృష్ణ కౌశిక్. ఒకప్పటి హీరో, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాలాదిత్య అన్న అయిన కృష్ణ కౌశిక్ దాదాపుగా 45 సీరియల్స్ చేస్తే అందులో 18లో మెయిన్ లీడ్‌గా చేసి అలరించాడు.

36 వేలకుపైగా ఎపిసోడ్స్

36 వేలకుపైగా ఎపిసోడ్స్‌లో కనిపించిన కృష్ణ కౌశిక్ నటుడిగానే కాకుండా టెలివిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశాడు. ఎన్నో ఏళ్లుగా తెలుగు నటీనటులకు అవకాశాలు ఇవ్వాలంటూ గళం విప్పుతున్న కృష్ణ కౌశిక్ ఇటీవల యాంకర్ గాయత్రి భార్గవి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు.

ఈ పాడ్‌కాస్ట్‌లో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయం, నాన్ తెలుగు ఆర్టిస్ట్‌లు ఎక్కువైపోవడం గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. అయితే, నెల క్రితం జరిగిన ఈ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు వాళ్లు తగ్గిపోవడం

"టెలివిజన్ ఇండస్ట్రీలో మీరున్నప్పటికీ ఇప్పటికీ జరిగిన మార్పులు ఏంటండి" అని గాయత్రి భార్గవి అడిగింది. "ఒక్కటేనండి.. బాగా పెద్ద మార్పు అంటే తెలుగు వాళ్లు తగ్గిపోవడం. నాన్ తెలుగు వాళ్లు ఎక్కువైపోతున్నారు. చాలా కారణాలు ఉన్నాయి. ఛానెల్స్ ఏమంటాయి. ఫ్రెష్‌నెస్ కావాలంటారు. దేనికి కొత్త మొహం. డాక్టర్స్ ఎప్పటికీ డాక్టర్సే. యాక్టర్స్ ఎప్పటికీ యాక్టర్సే. క్యారెక్టర్‌ని బట్టి ఫ్రెష్‌నెస్ ఉంటుంది" కృష్ణ కౌశిక్ చెప్పారు.

"తమిళంలో నేను ఒక సీరియల్ చేశా విలన్ క్యారెక్టర్. కొవిడ్‌కు ముందు. వాళ్లు ఎంత క్లారిటీగా ఉంటారంటే సీరియల్‌కి ఇద్దరే (తెలుగు వాళ్లు). హీరోనో, హీరో తల్లో ఏదైనా సరే ఇద్దరే. ఇద్దరు నాన్ తమిళియన్స్ దాటితే వాళ్లు ఒప్పుకోరు" అని నటుడు కృష్ణ కౌశిక్ తెలిపారు.

అదే తెలుగోడి దౌర్భాగ్యం

"కన్నడకు వెళ్లండి. అసలు వాళ్లు నాన్ కన్నడవాళ్లను పెట్టుకోనే పెట్టుకోరు. వాళ్లు సింక్ సౌండ్‌లో పని చేస్తారు. వాళ్లకు జెన్యూన్ కారణాలు ఉన్నాయి. అప్పట్లో కన్నడ రాజ్‌కుమార్ గారు జీవో పాస్ చేయించుకున్నారు. కన్నడ వాళ్లతోనే వర్క్ అవ్వాలి. లోకల్ టాలెంట్‌ను మాత్రమే ఎంకరేజ్ చేయాలని. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది. మన సంస్కృతి, సాంప్రదాయాన్ని మనం ఎంకరేజ్ చేసుకుని పక్కోడికి అన్నం పెట్టాలి. ముందు మన ప్లేట్‌లో ఫుడ్ వాడికి పెడితే మనం ఏం తింటాం" అని కృష్ణ కౌశిక్ అన్నారు.

"మనకు పొరిగింటి పుల్లకూర కావాలి కదా" అని యాంకర్ గాయత్రి భార్గవి అన్నారు. "ఎగ్జాట్లీ. ఇదే తెలుగువాడి దౌర్భాగ్యం. అదే అంటా. ఇవాళ తెలుగులో పర్ఫార్మ్ చేసేవాళ్లు నాకు తెలిసి కనీసం వందమంది ఉన్నారు. కానీ, ఛానెల్స్ ఏమంటాయి.. ఫ్రెష్‌నెస్.. కొత్తగా కావాలి. వాళ్ల పాయింట్‌లో కూడా కరెక్టే. కానీ, 20స్ టీన్స్ సీరియల్స్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఓటీటీలు, సినిమాలవైపు వెళ్తున్నారు" అని కౌశిక్ చెప్పుకొచ్చారు.

సీరియల్ వాళ్లంటే చులకన

"సీరియల్స్ అంటే తక్కువగా చూస్తారు. ఆడియెన్స్‌కు అలాగా లేదండి. కానీ, సినిమా ఇండస్ట్రీ వాళ్లకు మాత్రం చులకన. అరేయ్ కౌశిక్ గాడ్రా. వాడు సీరియల్ ఆర్టిస్ట్‌రా బాబు అంటారు. అయితే ఏంట్రా. ఆర్టిస్టునే కదా. నేను ఇద్దరు కో డైరెక్టర్స్‌ను కలిశా. మీరు సీరియల్స్‌కి గ్యాప్ ఇవ్వాలన్నారు. మిమ్మల్ని ఆడియెన్స్ బాగా చూసేశారు అన్నారు. చూస్తే లాభమే కదా. హీరోలను ఏళ్లతరబడి చూడట్లేదా" అని కౌశిక్ పేర్కొన్నారు.

"స్టార్ హీరోకు 100 టికెట్స్ తెగితే నాకోసం ఒక్క టికెట్ అయిన తెగుద్ది. ఒకరిద్దరు ఇబ్బంది పెట్టారని అందరిని అలాగే అంటగట్టేయ్యొద్దు కదా. ఒకరిద్దరు తెలుగు ఆర్టిస్టుల వల్ల నిర్మాతలు ఇబ్బందిపడ్డారు. అది వాస్తవం. అది నేను ఒప్పుకుంటా. దాన్ని బట్టి అందరిని అలాగే అనుకుంటే ఎలా" అని కౌశిక్ ప్రశ్నించారు.

నా దగ్గర సమాధానం లేదు

"నాకు బెంగళూరులో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుగు వాళ్లు కాదు. వాళ్లే అంటారు. ఎందుకు మమ్మల్ని ఇంతమందిని తీసుకొచ్చేస్తున్నారు. పక్కవాడికే అర్థం అవుతోంది మన బాధ. నాతో సీరియల్ చేసే కన్నడ ఆయనే అంటున్నాడు. కౌశిక్ మీరు మాట్లాడేది కరెక్ట్ పాయింట్. మేము రానివ్వం మిమ్మల్ని. మీరెందుకు రానిస్తున్నారు ఇంతమందిని అన్నాడు. నా దగ్గర సమాధానం లేదు" అని కౌశిక్ చెప్పుకొచ్చారు.

"ఇప్పుడు నాన్ తెలుగు వాళ్లకు ఫస్ట్ తెలుగు డైలాగ్ చెప్పాలి. దాని భావం చెప్పాలి. తర్వాత ప్రాంప్టింగ్ చెప్పాలి. ఇంత ప్రాసెస్‌కు నిర్మాత నాశనం అయిపోతాడండి. అయినా కూడా సీరియల్‌కు ఆరుగురిని పెట్టుకుంటున్నారు. ఛానెల్స్ ఏమో ప్రొడ్యూసర్స్‌ని అంటున్నాయి. నిర్మాతలేమో ఛానెల్స్‌ను అంటున్నారు. వీళ్లిద్దరు రింగా రింగా రోజెస్ ఆడుకుంటున్నారు. మధ్యలో బలైపోయేది ఆర్టిస్టులు" అని కృష్ణ కౌశిక్ అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More