Balakrishna: సినిమాకు 70 శాతం వసూళ్లు ఆంధ్రా నుంచే.. తెలంగాణ నుంచి 30 శాతమే: బాక్సాఫీస్ షేర్‌పై బాలకృష్ణ సంచలన కామెంట్స్

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ షేర్ పై బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలోనూ ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలని చెబుతూ.. 70 శాతం వసూళ్లు ఆంధ్రా నుంచే వస్తున్నాయని, తెలంగాణ నుంచి 30 శాతమే అని సంచలన లెక్కలు తీయడం గమనార్హం.

Published on: Jun 25, 2026, 11:50:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో మోస్ట్ అవేటెడ్ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ 'NBK112'ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ముహూర్తపు వేడుక వెంకటాయపాలెంలోని ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగింది.

Balakrishna: సినిమాకు 70 శాతం వసూళ్లు ఆంధ్రా నుంచే.. తెలంగాణ నుంచి 30 శాతమే: బాక్సాఫీస్ షేర్‌పై బాలకృష్ణ సంచలన కామెంట్స్
Balakrishna: సినిమాకు 70 శాతం వసూళ్లు ఆంధ్రా నుంచే.. తెలంగాణ నుంచి 30 శాతమే: బాక్సాఫీస్ షేర్‌పై బాలకృష్ణ సంచలన కామెంట్స్

ఈ క్రేజీ ఈవెంట్‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై మొదటి షాట్‌కు క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని తొలి సీన్‌కు గౌరవ దర్శకత్వం వహించడం విశేషం.

ఏపీ నుంచే 70 శాతం వసూళ్లంటూ..

ఈ వేడుక ముగిసిన తర్వాత నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల మార్కెట్ షేర్, ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వచ్చే కలెక్షన్ల విభజన గురించి బాలకృష్ణ చాలా ఓపెన్‌గా మాట్లాడారు. మన టాలీవుడ్ సినిమాలకు వచ్చే మొత్తం బాక్స్ ఆఫీస్ వసూళ్లలో దాదాపు 70 శాతం కలెక్షన్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయని ఆయన లెక్కలతో సహా రివీల్ చేశారు. మిగిలిన 30 శాతం వసూళ్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నాయని స్పష్టం చేశారు.

"తెలుగు ఇండస్ట్రీకి అతిపెద్ద రెవెన్యూ ఇచ్చేది, సినిమాను బతికించేది ఆంధ్రప్రదేశ్ మార్కెటే. అంత పెద్ద మొత్తంలో ఆదాయం ఇస్తున్నప్పుడు, మన సినిమాల షూటింగ్‌లు కూడా ఎక్కువ శాతం ఇక్కడే జరగాలి. ఏపీలో సినిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టూడియోలు, అధునాతన రికార్డింగ్ థియేటర్ల డెవలప్‌మెంట్ చాలా అవసరం" అని బాలకృష్ణ అన్నారు.

నా సినిమాలు ఎక్కువగా ఇక్కడే..

మిగిలిన టాలీవుడ్ స్టార్ హీరోల కంటే తానే ఎక్కువ సినిమాలను ఆంధ్రప్రదేశ్‌లోని విభిన్న లోకేషన్లలో షూట్ చేశానని బాలయ్య గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి చిన్న, పెద్ద ప్రొడక్షన్ హౌస్ తమ సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ కోసం నవ్యాంధ్ర ప్రాంతాలను ఎంచుకోవాలని కోరారు.

దీనివల్ల లోకల్ గా ఉన్న టాలెంట్స్‌కు మంచి అవకాశాలు రావడంతో పాటు సినీ పరిశ్రమ ఏపీలో వేగంగా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఒక పెద్ద సినిమా లాంచ్ కోసం క్లాప్ కొట్టి దాదాపు 20 ఏళ్లు అయిందని, ఆ గ్యాప్ ను తమ సినిమా భర్తీ చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఆనాటి పరిస్థితులను బట్టి హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ ఏర్పాటైందని, ఇప్పుడు అమరావతి కూడా బాగా అభివృద్ధి చెందుతోందని గుర్తు చేశారు. అందరినీ ఒకేసారి రమ్మని చెప్పడం లేదు.. అలాగని బలవంతం కూడా చేయడం లేదని బాలయ్య చెప్పారు.

కొరటాల శివ మార్క్ పొలిటికల్ డ్రామా..

'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' లాంటి పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్ బ్లాక్‌బస్టర్స్ అందించిన కొరటాల శివ.. గతంలో బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ 'సింహా' సినిమాకు రైటర్‌గా వర్క్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబో సెట్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి.

"పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఎ మూవ్‌మెంట్" అనే ఇంటెన్స్ క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి, యువసుధ ఆర్ట్స్ సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా దాదాపు రూ. 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026 నుంచి అమరావతి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో లాంగ్ షెడ్యూల్స్ తో స్టార్ట్ కానుంది. సమ్మర్ 2027 కానుకగా ఈ సినిమాను గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో సినీ రంగాన్ని, థియేటర్ ఎకానమీని డెవలప్ చేయడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ ఈ వేడుకలో హామీ ఇచ్చారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More