Balakrishna Koratala Siva: బాలయ్య మూవీ లాంచ్‌కి అల్లుడే చీఫ్ గెస్ట్.. కొరటాలతో మూవీకి క్లాప్ ఇవ్వనున్న ఏపీ మంత్రి లోకేష్
Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల శివ మూవీ లాంచ్, రానున్న అతిథుల వివరాలు బయటకు వచ్చేశాయి. ఈ మూవీ లాంచ్ వేడుక విజయవాడలో జరగనుండగా.. ఏపీ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ క్లాప్ ఇవ్వనుండటం విశేషం.
Balakrishna Koratala Siva: నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK112' (బాలకృష్ణ 112వ చిత్రం) అఫీషియల్ లాంచ్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవ వేడుకను జూన్ 25న విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి మేకర్స్ సర్వసిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, సినిమా మొదటి సీన్‌కు క్లాప్ కొట్టబోతున్నారు. ఇక ఆయనతోపాటు మరో మంత్రి కందుల దుర్గేష్ కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని ప్రాంతమైన అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వేడుక జరగనుంది.
బాలయ్య మాస్ ఇమేజ్.. కొరటాల సోషల్ మెసేజ్
నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మాస్ అప్పీల్, డైరెక్టర్ కొరటాల శివ మార్క్ సామాజిక బాధ్యతతో కూడిన కథల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'దేవర' లాంటి ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొరటాల శివ.. మొదటిసారి బాలయ్య బాబును డైరెక్ట్ చేయబోతుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి.
బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీకి, కొరటాల రాసే పదునైన సామాజిక సందేశం తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన బజ్ నడుస్తోంది.
విజయవాడలో నారా లోకేష్ హంగామా
ఈ సినిమా ముహూర్తపు వేడుకను కేవలం సినీ ప్రముఖుల మధ్యే కాకుండా, రాజకీయ ప్రాధాన్యత ఉన్న విజయవాడ నగరంలో ప్లాన్ చేయడం వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
ఏపీ మినిస్టర్, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా రానుండటంతో ఈ ఈవెంట్‌కు పొలిటికల్ గా కూడా భారీ గ్లామర్ రాబోతోంది. బాలకృష్ణ కొత్త సినిమాకు లోకేష్ క్లాప్ కొట్టబోయే విజువల్స్ నందమూరి, నారా అభిమానులకు ఒక పండుగలా మారనున్నాయి.
కమర్షియల్ హంగులతో పవర్‌ఫుల్ సబ్జెక్ట్
సినీ వర్గాల లీక్స్ ప్రకారం.. కొరటాల శివ ఈ సినిమా కోసం ఒక బలమైన కమ్యూనిటీ బ్యాక్‌డ్రాప్ ఉన్న సబ్జెక్టును సిద్ధం చేశారట. సమాజంలో జరిగే కొన్ని అన్యాయాలపై ఒక సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది, దానికి బాలయ్య మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే స్క్రీన్ ఏ రేంజ్ లో షేక్ అవుతుంది అనే కాన్సెప్ట్‌తో స్క్రీన్‌ప్లే రాసుకున్నట్లు టాక్.
ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను జూన్ 25న జరిగే ఓపెనింగ్ రోజునే అధికారికంగా ప్రకటించనున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ ఓపెనర్ లలో ఒకటి కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


