Balakrishna Koratala Siva: అఫీషియల్.. బాలకృష్ణతో కొరటాల మూవీ.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్.. సంక్రాంతి బరిలో..
Balakrishna Koratala Siva: నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివతో కలిసి ఆయన NBK112 చిత్రాన్ని చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Balakrishna Koratala Siva: ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ.. తన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 (తాత్కాలిక టైటిల్) షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలయ్య.. తాజాగా తన 112వ చిత్రంపై స్పష్టత ఇచ్చారు. అపజయమెరుగని దర్శకుడిగా పేరున్న కొరటాల శివ, బాలకృష్ణ కలయికలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

మాస్ విధ్వంసం ఖాయం!
సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో హీరో పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటూనే, ఒక సామాజిక బాధ్యతను లేదా సందేశాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ ఇమేజ్‌కు, కొరటాల మేకింగ్‌కు సరిగ్గా సరిపోయేలా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఉంది. “Power Meets Purpose, Mass Becomes A Moment” అనే లైన్ ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో స్పష్టం చేస్తోంది.
దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి అదిరిపోయే మాస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, కథ విన్న వెంటనే బాలయ్య ఓకే చెప్పడమే కాకుండా ఆయన క్యారెక్టరైజేషన్ చూసి ఫిదా అయ్యారని సమాచారం. కొన్ని రోజుల కిందటే వీళ్ల కాంబినేషన్ లో మూవీ వస్తుందన్న వార్తలు రాగా.. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
బాలయ్య, కొరటాల మూవీ షూటింగ్ ఎప్పుడు?
ఈ ఏడాది (2026) ద్వితీయార్థంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ భారీ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి తన 'శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్' (SLVC) బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర బృందం భావిస్తోంది.
గతేడాది 'దేవర' మూవీతో ఓ ఫెయిల్యూర్ ఎదురు కాగా.. జూనియర్ ఎన్టీఆర్ తో దేవర 2 చేయడానికి ముందే ఈ బాలయ్య మూవీని కొరటాల ఫినిష్ చేయబోతున్నాడు. అటు గోపీచంద్ మలినేనితో చేస్తున్న పీరియడ్ డ్రామా, ఇటు కొరటాలతో చేయబోతున్న పక్కా మాస్ ఎంటర్టైనర్‌తో నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఓవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో బాలకృష్ణ నటించబోతున్నాడన్న వార్తల నేపథ్యంలో కొరటాల మూవీ కన్ఫమ్ కావడం విశేషం. ఈ లెక్కన బాలయ్య వరుసపెట్టి తన హిట్స్ జాబితాను పెంచుతూ వెళ్లేలా కనిపిస్తున్నాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. NBK112 సినిమాకు దర్శకుడు ఎవరు?
బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
2. బాలకృష్ణ, కొరటాల సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
అధికారిక పూజా కార్యక్రమాలతో మే 1వ తేదీన ఈ సినిమా ప్రారంభమైంది. జూన్ లేదా జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
3. NBK111 చిత్రం అప్‌డేట్ ఏమిటి?
బాలయ్య తన 111వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది ఒక పవర్‌ఫుల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.
4. కొరటాల-బాలయ్య సినిమా విడుదల ఎప్పుడు ఉండవచ్చు?
ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


