Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల కాంబినేషన్ ఫిక్స్.. నందమూరి అభిమానులకు పూనకాలే!

Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మే 2వ తేదీన రానున్నట్లు సమాచారం. అదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి.

Apr 21, 2026, 19:51:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Balakrishna Koratala Siva: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వార్త సెన్సేషన్‌గా మారింది. 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతోందన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కలయికలో సినిమా రాలేదు. కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల కాంబినేషన్ ఫిక్స్.. నందమూరి అభిమానులకు పూనకాలే!
Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల కాంబినేషన్ ఫిక్స్.. నందమూరి అభిమానులకు పూనకాలే!

దేవర 2 కంటే ముందే బాలయ్యతో?

ప్రస్తుతం కొరటాల శివ చేతిలో జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాల్సిన ‘దేవర 2’ ఉంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ (NTR 31)లో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా పూర్తయ్యే వరకు 'దేవర 2' పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ ఖాళీ సమయంలోనే బాలకృష్ణతో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మే 2వ తేదీని రానున్నట్లు భావిస్తున్నారు. జూన్ 10 నుంచి షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారట.

ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ మూవీ చేస్తున్నాడు. దాంతోపాటుగానే ఈ కొరటాల మూవీ షూటింగ్ కూడా పూర్తి చేయాలన్నది ప్లాన్. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

సింగిల్ సిట్టింగ్‌లోనే కథకు గ్రీన్ సిగ్నల్

సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. కొరటాల శివ చెప్పిన కథను బాలకృష్ణ ఒకే సిట్టింగ్ లో ఓకే చెప్పాడట. గతంలో ఎన్నడూ చూడని విధంగా బాలయ్య ఈ మూవీలో కనిపించనున్నట్లు సమాచారం.

కొరటాల మార్క్ సామాజిక సందేశానికి బాలయ్య మార్క్ ఊర మాస్ ఎలిమెంట్స్ తోడవ్వబోతున్నట్లు సమాచారం. ఇక సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు కూడా తేలింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. బాలకృష్ణ - కొరటాల శివ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చిందా?

ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే మేకర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ రావచ్చని సమాచారం.

2. ఈ సినిమా వల్ల 'దేవర 2' ఆలస్యమవుతుందా?

అవును. ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమా పూర్తయిన తర్వాతే 'దేవర 2' ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

3. బాలకృష్ణ, కొరటాల మూవీ ఏ జానర్‌లో ఉండబోతోంది?

ఇది ఒక పక్కా సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. కొరటాల శివ గత చిత్రాలైన 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' తరహాలోనే ఒక బలమైన సామాజిక అంశం ఇందులో ఉండబోతోందట.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More