Balakrishna: హేమా మాలిని కాళ్లు మొక్కిన బాలకృష్ణ.. ఢిల్లీలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న స్టార్ నటుడు

Balakrishna: బాలకృష్ణ చేసిన పని ఇప్పుడు అతనికి ప్రశంసలు దక్కేలా చేస్తోంది. ఢిల్లీలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు అందుకోవడానికి వెళ్లిన బాలయ్య.. అక్కడ బాలీవుడ్ సీనియర్ నటి హేమా మాలిని కాళ్లు మొక్కిన వీడియో వైరల్ అవుతోంది.

Mar 26, 2026, 13:46:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Balakrishna: బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే. తాజాగా ఈ గాడ్ ఆఫ్ మాసెస్ చేసిన పని సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురిసేలా చేస్తోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడానికి వెళ్లిన అతడు.. అక్కడ కనిపించిన సీనియర్ నటి హేమా మాలిని కాళ్లు మొక్కడం విశేషం.

Balakrishna: హేమా మాలిని కాళ్లు మొక్కిన బాలకృష్ణ.. ఢిల్లీలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న స్టార్ నటుడు
Balakrishna: హేమా మాలిని కాళ్లు మొక్కిన బాలకృష్ణ.. ఢిల్లీలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న స్టార్ నటుడు

బాలయ్య గొప్పతనం

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు అందుకోవడానికి బాలకృష్ణ వెళ్లాడు. అవార్డు అందుకునే ముందు బయట అతనికి సీనియర్ నటి హేమా మాలిని కనిపించింది. దీంతో ఆమె దగ్గరికి వెళ్లి అతడు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.

ఆ తర్వాత కాసేపు ఆమెతో ముచ్చటించిన బాలయ్య.. హేమతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. గతంలో అతని 100వ సినిమా అయిన గౌతమిపుత్ర శాతకర్ణిలో హేమా మాలిని నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె బాలయ్య తల్లి పాత్ర పోషించింది.

బాలకృష్ణకు అవార్డు

ఇండియన్ సినిమాకు బాలకృష్ణ ఇన్ని దశాబ్దాలుగా చేస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. బుధవారం (మార్చి 25) దేశ రాజధానిలో అంగరంగ వైభవంగా మొదలైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026 వేడుకల్లో అతడు ఈ అరుదైన అవార్డును అందుకున్నాడు.

అవార్డు ప్రదానం చేసిన ఢిల్లీ సీఎం..

ఈ గ్రాండ్ అవార్డ్ సెర్మనీ న్యూఢిల్లీలోని ప్రసిద్ధ భారత్ మండపంలో చాలా కన్నులపండువగా జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి బాలయ్య చేసిన విశేషమైన సేవలను గుర్తిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా తన చేతుల మీదుగా అతనికి ఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు.

ఈ వేడుకల్లో కేవలం బాలకృష్ణకు మాత్రమే కాకుండా, సీనియర్ బాలీవుడ్ నటి షర్మిలా టాగూర్, అలాగే దివంగత లెజెండరీ యాక్టర్ ధర్మేంద్రకు కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. ధర్మేంద్ర భౌతికంగా మన మధ్య లేకపోవడంతో, ఆయన కుటుంబ సభ్యులు వేదికపైకి వచ్చి ఆయన తరఫున ఎంతో ఎమోషనల్‌గా ఈ అవార్డును స్వీకరించారు.

ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవాలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వేదికపై సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ గ్రాండ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను అఫీషియల్‌గా ప్రారంభించారు. ఆమెతో పాటు ఆమె క్యాబినెట్ మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ప్రముఖ స్టార్ హీరోయిన్లు హేమమాలిని, కంగనా రనౌత్, సీనియర్ నటి షర్మిలా టాగోర్ లాంటి స్టార్లు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు.

ఫ్యాన్స్ సంబరాలు.. బాలయ్య నెక్స్ట్ సినిమా..

బాలయ్యకు ఈ రేర్ అవార్డు దక్కడంతో అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీలో ఉన్న అతని తోటి నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అందరూ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక బాలయ్య నెక్స్ట్ సినిమాల విషయానికొస్తే.. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో అతడు తన కొత్త సినిమా షూటింగ్ అప్పుడే మొదలుపెట్టేశాడు. ఇదొక పక్కా యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More