ధర్మేంద్రను గుర్తు చేసుకుంటూ పెళ్లి రోజు ఫొటోలు షేర్ చేసిన హేమా మాలిని.. వీటిని చూస్తే ఎమోషనల్ అవుతానంటూ..

ధర్మేంద్ర చనిపోయిన తర్వాత తొలిసారి అతని భార్య, నటి హేమా మాలిని గురువారం (నవంబర్ 27) సోషల్ మీడియా ద్వారా స్పందించింది. వరుస పోస్టులు చేసింది. అందులో తమ పెళ్లి రోజు ఫొటోలను షేర్ చేసింది.

Published on: Nov 27, 2025, 20:46:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ ఐకాన్, సీనియర్ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24న 89 ఏళ్ల వయసులో మరణించిన విషయం తెలుసు కదా. ఇప్పుడు మూడు రోజుల తర్వాత అతని భార్య, నటి హేమా మాలిని సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తమ పెళ్లి రోజు ఫొటోలు షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఇది వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని చెప్పింది.

ధర్మేంద్రను గుర్తు చేసుకుంటూ పెళ్లి రోజు ఫొటోలు షేర్ చేసిన హేమా మాలిని.. వీటిని చూస్తే ఎమోషనల్ అవుతానంటూ..
ధర్మేంద్రను గుర్తు చేసుకుంటూ పెళ్లి రోజు ఫొటోలు షేర్ చేసిన హేమా మాలిని.. వీటిని చూస్తే ఎమోషనల్ అవుతానంటూ..

ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్న హేమ

గత కొన్ని సంవత్సరాలలో ధర్మేంద్రతో గడిపిన సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ హేమమాలిని పలు అరుదైన చిత్రాలను పంచుకుంది. ఒక ఫొటోలో వారిద్దరూ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కెమెరాకు నవ్వుతూ పోజులిచ్చారు. పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నట్లు ఆ ఫొటో చూస్తే తెలుస్తోంది.

మరొక ఫొటోలో ధర్మేంద్ర.. హేమ ఇచ్చిన పూల బొకేను పట్టుకొని కనిపించాడు. ఆ ఫొటోలో 'నా లైఫ్ లవ్ కు జన్మదిన శుభాకాంక్షలు' అనే స్వీట్ నోట్ ఉంది. మూడవ ఫొటోలో ధర్మేంద్ర, కుమార్తె ఈషా డియోల్ ఇద్దరూ ఒకేలాంటి తెల్లటి షర్టులు ధరించి, కెమెరాకు నవ్వుతూ కనిపించారు.

ఈ ఫొటోలను షేర్ చేస్తూ హేమ ఇలా రాసింది. “కొన్ని మధురమైన కుటుంబ క్షణాలు.. ఇవి దాచుకున్న ఫోటోలు” అని చెప్పింది. మరొక పోస్ట్‌లో ఆమె స్పందిస్తూ.. "నేను ఈ ఫోటోలను చూసినప్పుడు నా భావోద్వేగాలు ఉబికి వస్తున్నాయి. అందుకే ఇన్ని ఫోటోలు షేర్ చేశాను. ఈ ఫోటోలు ఇంతవరకు ఎక్కడా పబ్లిష్ చేయలేదు" అని తెలిపింది.

హేమ, ధర్మేంద్ర లవ్ స్టోరీ

ధర్మేంద్ర 1954లో తన 19వ ఏట ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు (సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజీత) ఉన్నారు. ముంబైకి మకాం మార్చిన తరువాత ధర్మేంద్ర మొదటిసారి హేమమాలినిని కలుసుకున్నారు.

'షరాఫత్', 'తుమ్ హసీన్ మై జవాన్' చిత్రాల నుండి మొదలుపెట్టి 'నయా జమానా', 'సీతా ఔర్ గీత', 'రాజా జానీ', 'జుగ్ను', 'పత్థర్ ఔర్ పాయల్', 'ప్రతిజ్ఞ', 'షోలే' వంటి అనేక చిత్రాలలో వారు కలిసి నటించారు. వారిద్దరూ ఒక హిట్ జోడీగా మారారు.

అప్పటికే ధర్మేంద్రకు పెళ్లి అయినప్పటికీ 1980లో హేమను పెళ్లి చేసుకున్నాడు. దీనిపై బహిరంగంగానే విమర్శలు వచ్చినా.. దశాబ్దాలుగా వాళ్ల బంధం నిలిచింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఈషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. వార్ డ్రామా మూవీ ‘ఇక్కిస్’లో ఆగస్త్య నందాతో కలిసి ధర్మేంద్ర చివరిసారిగా తెరపై కనిపించనున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More