ధర్మేంద్ర, హేమా మాలిని కలిసి నటించిన టాప్ 10 మూవీస్ ఇవే.. డ్రీమ్ గర్ల్‌నే పెళ్లి చేసుకొని.. ఈ ఓటీటీల్లో చూడండి

హిందీ సినిమాలో ఒక శకం ముగిసింది. ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశాడు. అయితే అతడు తన భార్య, డ్రీమ్ గర్ల్ గా పేరుగాంచిన హేమా మాలినితో కలిసి ఎన్నో హిట్ మూవీస్ లో నటించాడు. మరి అవి ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Published on: Nov 24, 2025, 16:41:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందీ సినిమాల్లో రొమాంటిక్ కలయికల విషయానికి వస్తే ధర్మేంద్ర, హేమమాలిని క్లాసిక్ జోడీ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. హేమమాలిని అందం, సొగసుకు నిదర్శనంగా నిలిచి డ్రీమ్ గర్ల్‌గా పేరుగాంచగా.. ధర్మేంద్ర తన ఆకర్షణతో, నటనతో ప్రసిద్ధి చెందాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసినప్పుడు అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయమైంది.

ధర్మేంద్ర, హేమా మాలిని కలిసి నటించిన టాప్ 10 మూవీస్ ఇవే.. డ్రీమ్ గర్ల్‌నే పెళ్లి చేసుకొని.. ఈ ఓటీటీల్లో చూడండి
ధర్మేంద్ర, హేమా మాలిని కలిసి నటించిన టాప్ 10 మూవీస్ ఇవే.. డ్రీమ్ గర్ల్‌నే పెళ్లి చేసుకొని.. ఈ ఓటీటీల్లో చూడండి

1970లు, 1980లలోని ప్రతి బాలీవుడ్ జానర్‌ను కవర్ చేసిన ఫిల్మోగ్రఫీ ఈ జంట సొంతం. మరి వాటిలో అభిమానులను బాగా ఆకర్షించిన టాప్ 10 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి. ప్రస్తుతం వీటిలో కొన్ని ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.

షోలే - ప్రైమ్ వీడియో

భారతీయ సినిమాల్లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటి షోలే. ఇందులో ధర్మేంద్ర, హేమ జోడీ బాగా ఆకట్టుకుంది. ధర్మేంద్ర సరదాగా ఉండే వీరూ పాత్రలో, హేమమాలిని చురుకైన ఓ గుర్రపు బండి నడిపే గ్రామ యువతి బసంతి పాత్రలో నటించారు. వారి సహజమైన కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని ఐకానిక్‌గా మార్చింది.

ప్రతిజ్ఞ - యూట్యూబ్

1975లో వచ్చిన సినిమా ఇది. ఇది కామెడీతో కూడిన రివెంజ్ స్టోరీ. ఇందులో ధర్మేంద్ర నిరక్షరాస్యుడైన ట్రక్ డ్రైవర్ అజిత్ సింగ్‌గా నటించాడు. ఇక హేమమాలిని బలమైన రాధ పాత్ర పోషించింది. ఈ బాక్సాఫీస్ హిట్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

షరాఫత్ - యూట్యూబ్

1970లో వచ్చిన సినిమా ఇది. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి చిత్రాలలో ఒకటి. ఇందులో ధర్మేంద్ర సున్నితమైన కాలేజీ ప్రొఫెసర్ రాజేష్‌గా, హేమమాలిని పారో అనే పాత్రలో నటించారు. ఈ సోషల్ డ్రామా కూడా యూట్యూబ్ లో ఉంది.

దిల్ కా హీరా

1979లో వచ్చిన మూవీ దిల్ కా హీరా. ఈ క్రైమ్ డ్రామాలో ధర్మేంద్ర కస్టమ్స్ ఆఫీసర్ రజత్ శర్మ పాత్రలో నటించాడు. ఈ మూవీలో హేమా మాలిని ఫిమేల్ లీడ్ గా కనిపించింది.

దిల్లగీ

1978లో వచ్చిన సినిమా దిల్లగీ. ఈ మరపురాని రొమాంటిక్ కామెడీలో ధర్మేంద్ర తన సాధారణ యాక్షన్ ఇమేజ్‌కు భిన్నంగా సంస్కృత ప్రొఫెసర్ స్వర్ణ్ కమల్ గా నటించాడు. హేమమాలిని డైనమిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా నటించింది.

ది బర్నింగ్ ట్రైన్

1980లో వచ్చిన సినిమా ది బర్నింగ్ ట్రైన్. ఇందులో అశోక్ సింగ్‌గా ధర్మేంద్ర, ఫిమేల్ లీడ్ గా హేమమాలిని నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేదు.

సీతా ఔర్ గీత - ప్రైమ్ వీడియో

1972లో వచ్చిన సినిమా సీతా ఔర్ గీత. హేమమాలిని డ్యుయల్ రోల్లో నటించింది. ఓవైపు సిగ్గుపడే సీతగా, మరోవైపు ధైర్యవంతురాలైన గీతగా నటించి “డ్రీమ్ గర్ల్”గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ధర్మేంద్ర సాహసోపేతమైన వీధి కళాకారుడు రాకాగా నటించాడు.

తుమ్ హసీన్ మై జవాన్ - ప్రైమ్ వీడియో

1970లో వచ్చిన సినిమా ఇది. ఈ జోడీ కలిసి నటించిన తొలి సినిమా ఇది. అక్కడి నుంచే వీళ్ల మధ్య నిజ జీవితంలో ప్రేమ చిగురించింది. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

దోస్త్ - ఎరోస్ నౌ

ధర్మేంద్ర, హేమా మాలిని లీడ్ రోల్స్ లో నటించిన మరో హిట్ మూవీ ఇది. ఈ సినిమా ప్రస్తుతం ఎరోస్ నౌ ఓటీటీలో అందుబాటులో ఉంది.

జుగ్ను - ప్రైమ్ వీడియో

ధర్మేంద్ర చురుకైన దొంగ జుగ్నుగా నటించిన యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ఇది. హేమమాలిని ఫిమేల్ లీడ్. ఓవైపు థ్రిల్లింగ్ స్టోరీతోపాటు ఈ ఇద్దరి రొమాన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More