Esha Gupta: భారత్‌కు చేరుకున్న హీరోయిన్ ఈషా గుప్తా- దుబాయ్‌లో ఇరుక్కున్న మంచు విష్ణు, అజిత్, పీవీ సింధు పరిస్థితి ఏంటీ?
Esha Gupta Returned India After Stranded In Abu Dhabi: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అబుదాబిలో చిక్కుకుపోయిన బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. విమానాశ్రయం మూసివేత, క్షిపణి దాడుల భయం మధ్య గడిపిన ఆ గంటల గురించి ఆమె భావోద్వేగంగా స్పందించారు.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులతో అంతర్జాతీయ విమాన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

అబుదాబిలో చిక్కుకుపోయిన హీరోయిన్
ఈ భయానక పరిస్థితుల నడుమ అబుదాబిలో చిక్కుకుపోయిన బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఎట్టకేలకు మార్చి 2న ఢిల్లీ చేరుకున్నారు. సురక్షితంగా ఇంటికి చేరిన తర్వాత, గడిచిన ఆ మూడు రోజుల్లో తను అనుభవించిన నరకాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఏం జరుగుతుందో తెలియని అయోమయం!
"ఫిబ్రవరి 28వ తేదీన నేను విమానాశ్రయానికి చేరుకున్నాను. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఎయిర్‌పోర్టును మూసివేశారు. చుట్టూ అంతా గందరగోళం.. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు" అని ఈషా గుప్తా తెలిపారు.
"కాసేపటికే క్షిపణి దాడుల వార్తలు రావడం మొదలైంది. తర్వాతి నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి. గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఒకరినొకరు ఓదార్చుకుంటూ, తమ కుటుంబ సభ్యులకు ఫోన్లలో మాట్లాడుకుంటూ భయం భయంగా గడిపారు" అని ఈషా గుప్తా అబుదాబిలో చిక్కుకున్న పరిస్థితులను వివరించారు.
యూఏఈ ప్రభుత్వంపై ప్రశంసలు
అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఈషా గుప్తా కొనియాడారు. ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా భోజన వసతులు, హోటల్ రూమ్‌లు ఏర్పాటు చేసిందని తెలిపారు.
భయం ఉన్నా కూడా
"నేను చెక్-ఇన్ కాకపోవడంతో వెంటనే వెనక్కి తిరిగి అబుదాబిలోని హోటల్‌కు చేరుకున్నాను. అక్కడ స్టాఫ్ ముఖాల్లో భయం ఉన్నా.. ఎక్కడా కూడా ప్రయాణికులకు ఒత్తిడి కలగకుండా అద్భుతంగా పనిచేశారు" అని ఈషా గుప్తా పేర్కొన్నారు.
భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు
అదృష్టవశాత్తూ ఇతిహాద్ ఎయిర్‌వేస్ నడిపిన మొదటి కమర్షియల్ ఫ్లైట్‌లోనే ఈషా గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. తనను సురక్షితంగా రప్పించేందుకు కృషి చేసిన భారత ప్రభుత్వానికి, యూఏఈ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ 'రాధే రాధే' అంటూ తన నోట్‌ను ముగించారు.
యుద్ధం ముదురుతోంది.. విమానాలు రద్దు!
గత వారం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించడంతో పరిస్థితులు విషమించాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో యూఏఈ, దోహాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో గల్ఫ్ దేశాల విమాన మార్గాలను మూసివేశారు.
ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయం పరిమితంగా కొన్ని ప్రత్యేక విమానాలను నడుపుతున్నప్పటికీ, ప్రయాణికులు ఎయిర్‌లైన్ నుంచి అధికారిక సమాచారం వస్తేనే విమానాశ్రయానికి రావాలని అధికారులు సూచించారు.
మంచు విష్ణు, అజిత్ పరిస్థితి ఏంటీ?
కాగా, ఈషా గుప్తాతో పాటు దుబాయ్‌లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, మంచు విష్ణు, సోనాల్ చౌహన్, నర్గీస్ ఫక్రీ, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా చిక్కుకుపోయారు. ఈషా గుప్తా భారత్‌కు చేరుకున్న వేళ మంచు విష్ణు, అజిత్, పీవీ సింధు, సోనాల్, నర్గీస్‌ల పరిస్థితి ఏమై ఉంటుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
క్షేమంగానే
అయితే, ఈపాటికే తాను క్షేమంగానే ఉన్నట్లు మంచు విష్ణు తెలిపిన విషయం తెలిసిందే. దుబాయిలో ఇరుక్కున్నప్పటికీ మంచు విష్ణు, అజిత్, సోనాల్, సింధు, నర్గీస్, సోనాల్ వంటి స్టార్స్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


