వామ్మో.. అజిత్ కుమార్ షాకింగ్ రెమ్యునరేషన్.. అనిల్ సుంకర సినిమా ఆగిపోవడానికి కారణం అదేనా? లేటెస్ట్ బజ్ ఇదే!
తన అప్ కమింగ్ మూవీ కోసం తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు చెదరాల్సిందే. అజిత్ డిమాండ్ కారణంగా ఇప్పుడీ మూవీ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం.
అజిత్ కుమార్.. తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో. తెలుగులోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అజిత్ సినిమాల కోసం అభిమానులు వెయిట్ చేస్తుంటారు. తన స్టార్ డమ్ కారణంగా అజిత్ కూడా రెమ్యునరేషన్ భారీగా పెంచేశారని తెలిసింది. ఇప్పుడు అనిల్ సుంకర నిర్మాతగా రాబోతున్న సినిమా కోసం అజిత్ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని టాక్.

ఏకే64
టాలీవుడ్ ప్రొడ్యూసర్లలో అనిల్ సుంకర ఒకరు. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి మూవీతో ఆయన హిట్ అందుకున్నారు. తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా, అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో అనిల్ సుంకర మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నారనే వార్త రీసెంట్ గా హాట్ టాపిక్ గా మారింది. ఏకే64 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి.
అజిత్ కుమార్ రెమ్యునరేషన్
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ మూవీ అనౌన్స్ మెంట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అజిత్ కుమార్ ఏకంగా రూ.165 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడని సమాచారం. అజిత్ రెమ్యునరేషన్ విషయంలో ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఆలోచనలో పడ్టట్లు తెలిసింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అజిత్ సినిమాలు
54 ఏళ్ల వయసులోనూ తన స్టైల్, గ్రేస్ తో యాక్టింగ్ లో దూసుకుపోతున్నాడు అజిత్ కుమార్. తమిళంలో సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్నారు. 2022లో వాలిమై మూవీలో హీరోగా చేశాడు. ఇక 2023లో తునీవుతో అలరించాడు. 2025లో అజిత్ నటించిన విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
రేసింగ్
అజిత్ కు సినిమాలే కాదు రేసింగ్ అన్న ప్రాణం. ఇప్పుడు రేసర్ గా ట్రాక్ పై కార్లను పరుగులు పెట్టిస్తున్నాడు. అందుకే మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇస్తున్నాడు. అజిత్ రేసింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అజిత్ కుమార్ 1993లో తెలుగులో ప్రేమ పుస్తకం అనే సినిమా చేశాడు.
సూపర్ హిట్
2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు తర్వాత ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు వరుగా బిగ్ షాక్ లు తగిలాయి. అల్లరి నరేష్ మూవీ బంగారు బుల్లోడు, శర్వానంద్, సిద్ధార్థ నటించిన మహాసముద్రం, అఖిల్ సినిమా ఏజెంట్, చిరంజీవి చిత్రం భోళా శంకర్, సందీప్ కిషన్ మజాకా ఇలా వరుసగా ఫ్లాప్ లే వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో 2026 సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో మళ్లీ అనిల్ సుంకర సక్సెస్ అందుకున్నారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


