టాలెంట్ ఉన్నవారికి నిర్మాత అనిల్ సుంకర గోల్డెన్ ఛాన్స్-కొత్త నటీనటులతో ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్ మూవీ-వినూత్నంగా పరిచయం

నారీ నారీ నడుమ మురారి నిర్మాత అనిల్ సుంకర న్యూ టాలెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్ ప్రకటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్ సినిమాలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పాత్రను వినూత్నంగా పరిచయం చేశారు.

Published on: Jan 26, 2026, 20:26:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఆలోచనలతో సినిమాలు నిర్మించే నిర్మాతగా పేరొందిన అనిల్ సుంకర మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన మూవీ మేకింగ్ రియాలిటీ షో 'షో టైమ్-సినిమా తీద్దాం రండి' ఇప్పటికే సినీ వర్గాల్లోనే కాకుండా క్రియేటివ్ కమ్యూనిటీల్లోనూ మంచి స్పందన తెచ్చుకుంది.

టాలెంట్ ఉన్నవారికి నిర్మాత అనిల్ సుంకర గోల్డెన్ ఛాన్స్-కొత్త నటీనటులతో ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్ మూవీ-వినూత్నంగా పరిచయం
టాలెంట్ ఉన్నవారికి నిర్మాత అనిల్ సుంకర గోల్డెన్ ఛాన్స్-కొత్త నటీనటులతో ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్ మూవీ-వినూత్నంగా పరిచయం

ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్ మూవీ

టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ.. నిర్మాత అనిల్ సుంకర ఇప్పుడు ఏటీవీ ఒరిజినల్స్‌ (ATV Originals) బ్యానర్‌పై కొత్త నటీనటులతో రూపొందే ఫీచర్ ఫిల్మ్ 'ఎయిర్‌ఫోర్స్‌–బెజవాడ బ్యాచ్' (AIRFORCE – Bezawada Batch)ను ప్రకటించారు.

విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితంలోని జరిగిన సంఘటనలు ఆధారంగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో కష్టాలను దాటి ముందుకు సాగుతూ.. ప్రతికూల పరిస్థితులను అధిగమించి చివరికి ఎలా సక్సెస్ అయ్యారు అనే అంశాన్ని ఈ కథ మూలంగా తీసుకున్నారు.

ట్రెండ్‌కు తగినట్లు పరిచయం

ఈ చిత్ర ప్రయాణానికి అధికారికంగా శ్రీకారం చుడుతూ.. తాజాగా తొలి కాస్ట్ మెంబర్‌ను వినూత్న రీతిలో ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆన్‌బోర్డ్ చేశారు. అందుకు సంబందించి విజయవాడలోని ఓ ప్రముఖ జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌లో సరదాగా, మట్టివాసనతో కూడిన సందేశంతో బ్యానర్ ఇప్పడు అందరిని ఆకట్టుకుంది.

'అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు' అంటూ రూపొందించిన ఈ బ్యానర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ 'ఎయిర్‌ఫోర్స్‌–బెజవాడ బ్యాచ్' సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్తోంది.

వెటకారమే ప్రధాన బలంగా

మంచి స్నేహబంధం, బెజవాడ ప్రత్యేకమైన వెటకారం ఈ చిత్రానికి ప్రధాన బలం కాబోతుందని బ్యానర్‌లోని మాటలు చూస్తేనే తెలుస్తోంది. ఈ వినూత్న ఆన్‌బోర్డింగ్‌తో ఇది కేవలం సినిమా ప్రారంభం మాత్రమే కాదని.. కొత్త టాలెంట్, కలలను సాధించుకునే ప్రాజెక్ట్ అని మేకర్స్ స్పష్టం చేశారు. త్వరలోనే మిగతా కాస్ట్ అండ్ క్రూ వివరాలతో పాటు మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ వెల్లడి కానున్నాయి.

ఇదిలా ఉంటే, అనిల్ సుంకర ఇటీవలే నారీ నారీ నడుమ మురారి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.

న్యూ టాలెంట్‌కు గోల్డెన్ ఛాన్స్

సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం థియేటర్లలో విడుదలైన నారీ నారీ నడుమ మురారి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా సినిమాలో కామెడీ అందరిని నవ్విస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా సక్సెస్ అందుకున్న నిర్మాత అనిల్ సుంకర టాలెంట్ ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్ ప్రకటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More