NTR Adavi Ramudu: ఈ సినిమా 10 బాహుబలిలతో సమానం.. పాన్ ఇండియా కాదు.. థియేటర్లలో విసిరిన చిల్లరే రూ.కోటి: రాఘవేంద్రరావు

NTR Adavi Ramudu: టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన 'అడవి రాముడు' సినిమా విడుదలై మంగళవారం (ఏప్రిల్ 28)తో 49 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన సినీ ప్రయాణంలోని మధుర స్మృతులను నెమరువేసుకున్నారు.

Published on: Apr 29, 2026, 16:57:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

NTR Adavi Ramudu: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'రికార్డుల వేట' అంటే గుర్తొచ్చే మొదటి సినిమా 'అడవి రాముడు'. నటరత్న నందమూరి తారక రామారావు (NTR) కథానాయకుడిగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 1977లో విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 28నాటికి 49 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దర్శకేంద్రుడు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకు అప్పటి వసూళ్లు ఇప్పటి 10 బాహుబలిలతో సమానం అంటూ ఆక్ష్న పోల్చిన తీరు ఆకట్టుకుంటోంది.

NTR Adavi Ramudu: ఈ సినిమా 10 బాహుబలిలతో సమానం.. పాన్ ఇండియా కాదు.. థియేటర్లలో విసిరిన చిల్లరే రూ.కోటి: రాఘవేంద్రరావు
NTR Adavi Ramudu: ఈ సినిమా 10 బాహుబలిలతో సమానం.. పాన్ ఇండియా కాదు.. థియేటర్లలో విసిరిన చిల్లరే రూ.కోటి: రాఘవేంద్రరావు

నిన్ననే జరిగినట్లుంది.. ఆ జ్ఞాపకాలు వెలకట్టలేనివి

"అడవి రాముడు సినిమా వచ్చి 49 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పటికీ ఇది నిన్నకాక మొన్న జరిగినట్లుగానే ఉంది" అంటూ రాఘవేంద్రరావు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా కేవలం విజయాన్ని మాత్రమే కాకుండా, జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలను, అనుబంధాలను ప్రసాదించిందని ఆయన వివరించారు.

ముఖ్యంగా సినిమా వెనుక శ్రమించిన ప్రతి టెక్నీషియన్‌ను ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. "నాతో పాటు నిలబడి, ఈ చిత్రం కోసం తమ ఆత్మను ధారపోసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి నేను ఎంతో రుణపడి ఉంటాను" అని ఆయన రాసుకొచ్చారు.

తెలుగు ప్రేక్షకుల ఆదరణే నా బలం

ఈ సినిమా ఇంతటి క్లాసిక్ కావడానికి కారణం తెలుగు ప్రేక్షకుల అభిమానమేనని రాఘవేంద్రరావు కొనియాడారు. "మీరు ఈ సినిమాను కేవలం థియేటర్లలో చూడటమే కాదు.. మీ గుండెల్లో దాచుకున్నారు. తరతరాలుగా ఈ కథను ముందుకు తీసుకెళ్లి, కాలంతో సంబంధం లేని అజరామరమైన చిత్రంగా మార్చారు. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని దర్శకేంద్రుడు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

రికార్డుల రారాజు 'అడవి రాముడు'

తెలుగులో మొదటిసారిగా ఒకటి కంటే ఎక్కువ థియేటర్లలో 365 రోజులు ఆడిన రికార్డు ఈ సినిమా సొంతం. ఎన్టీఆర్ మార్క్ యాక్షన్, రాఘవేంద్రరావు కమర్షియల్ విలువల కలయికతో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే కోట్లాది రూపాయల వసూళ్లను సాధించింది. జయప్రద, జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని పాటలు, ముఖ్యంగా 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' సాంగ్ నేటికీ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ గా నిలిచిపోయింది.

ఆ చిల్లరే రూ.కోటి

రాఘవేంద్రరావు చేసిన పోస్టులో అడవి రాముడు మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్న స్లైడ్ ఒకటి ఉంది. అందులో అప్పట్లో థియేటర్లలో ప్రేక్షకులు విసిరిన పది పైసలు, 20 పైసలులాంటి చిల్లరతోనే రూ.కోటి వచ్చాయని, ఇప్పటితో పోలిస్తే అది పది బాహుబలిలతో సమానం అని ఉంది.

పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు.. కేవలం తెలుగులోనే అడవి రాముడి సృష్టించిన ప్రభంజనం ఇది. 32 థియేటర్లలో 100 రోజులు, 16 థియేటర్లలో 175 రోజులు, 4 థియేటర్లలో 200 రోజులు, 3 థియేటర్లలో 365 రోజులు ఆడిన సినిమా ఇది అని రాఘవేంద్రరావు పోస్టులో ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. 'అడవి రాముడు' సినిమా విడుదలైన సంవత్సరం ఏది?

ఈ చిత్రం 1977లో విడుదలైంది. 2026 నాటికి ఈ సినిమా విడుదలై 49 ఏళ్లు పూర్తయ్యాయి.

2. అడవి రాముడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించింది?

అడవి రాముడు సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో మొదటిసారిగా 30కి పైగా కేంద్రాల్లో 100 రోజులు, పలు కేంద్రాల్లో ఏడాది పాటు (365 రోజులు) ప్రదర్శితమై సరికొత్త రికార్డులు సృష్టించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More