OTT Thriller: అడవిలో రక్తపాతం.. మరో ఓటీటీలోకి మలయాళం హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. క్రూరమైన పాత్రలో సునీల్
OTT Thriller: ఓటీటీలో మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాట్టాలన్ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
OTT Thriller: దట్టమైన అడవి నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'కాట్టాలన్' (Kattalan) ఇప్పుడు మరో ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే మలయాళం ఆడియోతో మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు హిందీలో మరో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్ (పెపే), టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సునీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ రివేంజ్ డ్రామా సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ కాబోతోంది.

అడవిలో ఏనుగు దంతాల స్మగ్లింగ్.. రా అండ్ రస్టిక్ యాక్షన్
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాట్టాలన్ కథ మొత్తం ఒక ప్రమాదకరమైన ఐవరీ (ఏనుగు దంతాల) స్మగ్లింగ్ సిండికేట్ చుట్టూ తిరుగుతుంది. అడవిని తమ గుప్పిట్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడే క్రూరమైన గ్యాంగ్‌తో.. ఒక ఒంటరి వేటగాడు ఎలాంటి పోరాటం చేశాడనేది ప్రధాన కథాంశం.
విశ్వాసఘాతుకం, పాత కక్షలు, ప్రతీకార జ్వాలల నడుమ సాగే ఈ సర్వైవల్ పోరాటంలో ప్రతీ సీన్ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించిన రియలిస్టిక్ యాక్షన్ సీన్స్, రా ఫైట్స్ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.
తన అడవిని, అక్కడ ఉండే జంతువులను కాపాడుకోవడానికి వేటగాడు వేసే ఎత్తుగడలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పగతో రగిలిపోయే స్మగ్లర్ల బారిన పడకుండా అతడు చేసే వీరోచిత పోరాటం థ్రిల్ ఇస్తుంది.
నెగిటివ్ షేడ్స్‌లో సునీల్.. పెపేతో మైండ్ గేమ్స్
'పుష్ప', 'జైలర్', 'జపాన్' చిత్రాలతో విలన్‌గా మెప్పించిన టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్ ఈ సినిమాలో అత్యంత పవర్‌ఫుల్, క్రూరమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన క్యారెక్టర్ ఈ కథకి మెయిన్ హైలైట్‌గా నిలవనుంది.
మరోవైపు 'అంగమలై డైరీస్', 'ఆర్‌డిఎక్స్' (RDX) లాంటి రస్టిక్ హిట్లతో ఊరమాస్ ఇమేజ్ తెచ్చుకున్న ఆంటోనీ వర్గీస్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్‌లో జీవించేశారు. సునీల్, ఆంటోనీ వర్గీస్ మధ్య వచ్చే యాక్షన్ అండ్ మైండ్ గేమ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.
కబీర్ దుహాన్ సింగ్, దుషారా విజయన్..
ఈ సినిమాలో టాలెంటెడ్ నటీనటుల బృందం పనిచేసింది. పవర్‌ఫుల్ విలన్‌గా గుర్తింపు పొందిన కబీర్ దుహాన్ సింగ్, హీరోయిన్ దుషారా విజయన్, సీనియర్ నటుడు జగదీష్ కీలక పాత్రల్లో అలరించనున్నారు.
సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ ఈ థ్రిల్లర్‌కు ప్రాణం పోశాయి. అడవిలోని సహజసిద్ధమైన వాతావరణం, విజువల్స్, నెక్స్ట్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రియల్ వైల్డ్‌లైఫ్ అట్మాస్ఫియర్‌ను క్రియేట్ చేశాయి.
సోనీ లివ్‌లో స్ట్రీమింగ్.. తెలుగు వెర్షన్ లేదు
ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే మనోరమ మ్యాక్స్ ఓటీటీలో మలయాళంలో అందుబాటులో ఉంది. అయితే సెప్టెంబర్ 18 నుంచి సోనీ లివ్ ఓటీటీలో హిందీ వెర్షన్ రానుంది. అయితే తెలుగు ఆడియో లేకపోవడం మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు కాస్త నిరాశ కలిగించేదే. ఓటీటీలో డార్క్ క్రైమ్, వైల్డ్‌లైఫ్ యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


