OTT Crime: ఓటీటీలో మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ట్రెండింగ్- సైకో పోలీస్‌గా సునీల్ విలనిజం- తెలుగులో స్ట్రీమింగ్!

Sunil Ananthan Kaadu OTT Trending: తమిళ స్టార్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అనంతన్ కాడు ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. టాలీవుడ్ హీరో సునీల్ సైకో పోలీస్ విలన్‌గా మెప్పించిన ఈ సినిమా 5 ఓటీటీల్లో అందుబాటులో ఉంది. మరి అనంతన్ కాడు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Sep 9, 2026, 05:01:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sunil Ananthan Kaadu OTT Trending: కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పిరియాడికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'అనంతన్ కాడు'. ఈ సినిమాను తమిళ, మలయాళ రెండు భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో తెలుగు కమెడిన్, హీరో, నటుడు సునీల్ సైకో పోలీస్ విలన్ పాత్ర పోషించాడు.

ఓటీటీలో మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ట్రెండింగ్- సైకో పోలీస్‌గా సునీల్ విలనిజం- తెలుగులో స్ట్రీమింగ్!
ఓటీటీలో మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ట్రెండింగ్- సైకో పోలీస్‌గా సునీల్ విలనిజం- తెలుగులో స్ట్రీమింగ్!

పైశాచిక ఆనందం పొందే పాత్రలో సునీల్

అంతేకాకుండా ఓ యువతి శరీరాన్ని కాలుస్తూ, వాతలు పెడుతూ పైశాచిక ఆనందం పొందే పాత్రలో సునీల్ విలనిజం పండించాడు. అలాంటి అనంతన్ కాడు ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. అంతకుమించి ఒకేరోజున ఏకంగా 5 ఓటీటీల్లోకి అనంతన్ కాడు సినిమా రావడం మరింత విశేషం అని చెప్పుకోవచ్చు.

అనంతన్ కాడు ఐఎమ్‌డీబీ రేటింగ్

ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదలైన అనంతన్ కాడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి 6.1 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

1990ల కేరళ రాజకీయాల నేపథ్యంలో..

జీయన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అనంతన్ కాడు సినిమాకు ప్రముఖ నటుడు, రచయిత మురళీ గోపి కథ అందించారు. 1990ల కాలంలో కేరళ రాజధాని తిరువనంతపురంలో నెలకొన్న తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు, శ్రీలంక అంతర్యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

శ్రామిక వర్గాల పోరాటాలు

రాజకీయ నాయకులు, రౌడీ ముఠాలు, పవర్ బ్రోకర్ల స్వార్థ ప్రయోజనాల మధ్య నలిగిపోయే సాధారణ శ్రామిక వర్గాల జీవితాలు, వారి పోరాటాలను ప్రతిబింబించేలా ఈ కథను మలిచారు.

ఆర్య నటన.. కథనంలో వైవిధ్యం

ఈ చిత్రంలో ఆర్య 'వెట్రివేల్ కుమారన్' అనే బలమైన పాత్రలో కనిపించారు. ఒక సాధారణ యువకుడి జీవితం రాజకీయ ముఠాల వివాదాల్లోకి ఎలా లాగబడింది, దాని పరిణామాలు ఏంటనేవి ఈ పాత్ర ద్వారా చూపించారు.

అనేక ఉపకథలు

పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ, అనేక ఉపకథలు ఉండటంతో ప్రధాన కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుడికి పూర్తిస్థాయిలో చేరువ కాలేకపోయాయనే కామెంట్స్ వినిపించాయి. కానీ, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డ్రామా, సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగా చూపించారని టాక్ వచ్చింది.

ఇక అనంతన్ కాడు సినిమాలో మురళీ గోపి, ఇంద్రన్స్, విజయరాఘవన్, దేవ్‌మోహన్, అప్పాని శరత్, శాంతి బాలచంద్రన్, నిఖిలా విమల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో తమ నటనతో మెప్పించారు.

5 ఓటీటీల్లో రిలీజ్

ఇలాంటి అనంతన్ కాడు ఏకంగా 5 ఓటీటీలలో ఒకేరోజున రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే, మనోరమ మ్యాక్స్‌లలో సెప్టెంబర్ 2న అనంతన్ కాడు ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇది కేవలం ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్ కోసమే.

ఒక్కదాంట్లోనే తెలుగులో స్ట్రీమింగ్

విదేశీయుల కోసం సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో అనంతన్ కాడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో మాత్రమే అనంతన్ కాడు తెలుగు భాషలో అందుబాటులో ఉంది.

అనంతన్ కాడు ఓటీటీ ట్రెండింగ్

అలాగే, అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 8 నాటికి పదో స్థానంలో అనంతన్ కాడు ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. రాజకీయ అంశాలు, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు అనంతన్ కాడును ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More