OTT Bold: ఓటీటీని ఊపేస్తున్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్- ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 ప్లేస్- 7.7 ఐఎమ్‌డీబీ రేటింగ్
Dark Secrets OTT Trending In Top 1 Place Telugu: ఓటీటీలో టాప్ 1 ప్లేసులో దూసుకుపోతోంది తెలుగు బోల్డ్ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా డార్క్ సీక్రెట్స్. మనుషుల మనస్తత్వంలోని నిగూఢ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఆంథాలజీ మూవీ డార్క్ సీక్రెట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Dark Secrets OTT Trending In Top 1 Place Telugu: సినిమా అంటే కేవలం థియేటర్లలోనే చూడాలనే రోజులు పూర్తిగా మారిపోయాయి. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు, ఇండిపెండెంట్ సినిమాలకు ఇప్పుడు ఓటీటీ వేదికలు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నాయి.

సరైన ప్రమోషన్, బలమైన కథనం ఉంటే చాలు.. చిన్న సినిమా కూడా పాన్-ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించగలదని మరోసారి నిరూపితమైంది. తాజాగా తెలుగు బోల్డ్ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ఆంథాలజీ మూవీ డార్క్ సీక్రెట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ మీడియాలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.
డార్క్ సీక్రెట్స్ కథ ఏమిటి?
డార్క్ సీక్రెట్స్ సినిమా మానవ మనస్తత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసే చిత్రం. డార్క్ సీక్రెట్స్ ఒక అంథాలజీ డ్రామా. సాధారణంగా కనిపించే మనుషుల జీవితాల్లో దాగి ఉన్న అసాధారణ రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టతల చుట్టూ ఈ సినిమా కథలు తిరుగుతాయి.
ప్రతి కథలో ఒక ప్రత్యేక పరిస్థితి, ఒక రహస్యం, ఆ సీక్రెట్ బయటపడినప్పుడు జరిగే పరిణామాలను చూపించే ప్రయత్నం చేశారు. “ప్రతి మనిషి జీవితంలో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యం బయటపడితే ఏమవుతుంది?” అనే ప్రధాన అంశాన్ని ఆధారంగా తీసుకుని, విభిన్న పాత్రలు, కథల ద్వారా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఈ సినిమా సాగుతుంది.
సామాజిక ఒత్తిడి, నైతిక హద్దులు
సినిమాలోని కథలు ఒంటరితనం, సామాజిక ఒత్తిడి, నిషేధిత భావోద్వేగాలు, నైతిక హద్దులు వంటి అంశాలను స్పృశిస్తాయి. మామూలు కథలకు భిన్నంగా కాస్త బోల్డ్ అండ్ డార్క్ షేడ్స్‌లో సాగే ఈ కథలకు డిజిటల్ పాఠకులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
కాగా డార్క్ సీక్రెట్స్ చిత్రానికి అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. విభిన్న కథలను ఒకే ఎమోషనల్ థీమ్‌తో అనుసంధానిస్తూ, మానవ సంబంధాలు, రహస్యాలు, జీవితంలోని సంక్లిష్ట పరిస్థితులను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ఒకే ఎమోషనల్ థీమ్‌తో
ఈ చిత్రాన్ని దర్శకుడు అవినాష్ కొకటి ఎంతో ప్రతిభావంతంగా మలిచారు. వేర్వేరు కథలను ఒకే భావోద్వేగ థీమ్‌తో అనుసంధానిస్తూ డైరెక్టర్ చూపించిన మేకింగ్ స్టైల్ ఆకట్టుకుంది. 'టచ్‌వుడ్ టేల్స్' బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.
కథా బలం, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ డార్క్ సీక్రెట్స్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఇక డార్క్ సీక్రెట్స్ సినిమాలో అప్సర రాణి, జయశ్రీ, అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం, నైనిక అనసూయ ప్రధాన పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు.
డార్క్ సీక్రెట్స్ ఐఎమ్‌డీబీ రేటింగ్
ఇలా క్రేజ్ తెచ్చుకుంటున్న డార్క్ సీక్రెట్స్ సినిమా ఐఎమ్‌డీబీలో పదికి 7.7 రేటింగ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో సైతం ఈ సినిమాపై విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో ఓటీటీలో డార్క్ సీక్రెట్స్ వ్యూయర్ షిప్ రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video)లో డార్క్ సీక్రెట్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, అమెజాన్ ప్రైమ్‌లో పే-పర్-వ్యూ/రెంటల్ విభాగంలో డార్క్ సీక్రెట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయినా ఈ అద్దె విధానంలో కూడా డార్క్ సీక్రెట్స్ ఓటీటీలో సంచలనాలు నమోదు చేస్తోంది.
డార్క్ సీక్రెట్స్ ఓటీటీ ట్రెండింగ్
దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో "ట్రెండింగ్ టాప్ 10 పర్చాస్ ఇన్ ఇండియా" ( Trending Top 10 Purchases in India) జాబితాలో డార్క్ సీక్రెట్స్ ఏకంగా నంబర్ 1 స్థానానికి చేరుకుని ఆశ్చర్యపరిచింది. విభిన్న భాషలకు చెందిన భారీ బడ్జెట్ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ, తెలుగు చిన్న సినిమా డార్క్ సీక్రెట్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలవడం విశేషంగా మారింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


