Vishwanath And Sons OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన సూర్య, వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఏ రోజంటే?

Vishwanath And Sons OTT Streaming Platform: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ప్రేమలు ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సన్ ఆఫ్ విశ్వనాథ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడో చూద్దాం.

Published on: Aug 15, 2026, 06:06:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vishwanath And Sons OTT Release Platform Details: తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు టాప్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమాలో హీరోయిన్‌గా యూత్ డ్రీమ్ గర్ల్ మమితా బైజు చేసింది.

ఓటీటీలోకి నిన్న రిలీజైన సూర్య, వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఏ రోజంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన సూర్య, వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఏ రోజంటే?

ఇద్దరు సీనియర్ హీరోయిన్స్

సీనియర్ హీరోయిన్స్ రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్, నాజర్, యోగిబాబు, మ్యాథ్యూ వర్గీస్, వైవా హర్ష తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఆగస్ట్ 14న అంటే నిన్న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు ఈ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా సినిమా సన్ ఆఫ్ విశ్వనాథ్ వచ్చేసింది.

సూర్య ఈ సినిమాలో సంజయ్ విశ్వనాథ్ అనే ఇంటర్నేషనల్ షూటర్ పాత్రలో కనిపిస్తారు. కెరీర్, గెలుపుపైనే దృష్టి పెట్టిన ఒక క్రీడాకారుడి జీవితంలో వయసు పెరుగుతున్న కొద్దీ కుటుంబ బాధ్యతలు, ఊహించని ప్రేమ ఎలాంటి మలుపులు తిప్పాయనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

ఆశయాలు, పర్సనల్ లైఫ్ మధ్య

తన ఆశయాలు, వ్యక్తిగత జీవితం మధ్య సంజయ్ ఎలా బ్యాలెన్స్ చేశాడనేది డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎమోషనల్‌గా తెరకెక్కించారు. మమితా బైజు నటన, సూర్యతో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, కె. ఎన్. విజయ్ కుమార్ మాటలు అందించారు. శేఖర్ వి జె, విజయ్ బిన్నీ డాన్స్ కొరియోగ్రఫీ చేయగా, వి వెంకట్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు.

సన్ ఆఫ్ విశ్వనాథ్ ఓటీటీ

మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. దిగ్గజ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సన్ ఆఫ్ విశ్వనాథ్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు రూ. 85 కోట్లకు విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. సినిమాలోని పోస్టర్స్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్ లోగో ద్వారా ఈ విషయం తెలుస్తోంది.

ఇక, విశ్వనాథ్ అండ్ సన్స్ శాటిలైట్ రైట్స్‌ను రూ. 28 కోట్లు, ఆడియో హక్కులు రూ. 12 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రైడ్ వర్గాల సమాచారం. ఇదే కాకుండా ఓవరాల్‌గా విశ్వనాథ్ అండ్ సన్స్ థియేట్రికల్ హక్కులు రూ. 90 కోట్లకు, నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 125 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

దీంతో విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 215 కోట్ల వరకు రాబట్టాయని టాక్. ఇలా క్రేజీ డీల్స్ సొంతం చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ రిలీజ్ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, సెప్టెంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో సన్ ఆఫ్ విశ్వనాథ్ ఓటీటీ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉందని ఇన్‌సైడ్ టాక్.

ఓటీటీకి రాకముందే

కాకపోతే సూర్య, మమితా బైజుల కెమిస్ట్రీని ఓటీటీలోకి రావడానికంటే ముందే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను థియేటర్లలో చూడటం బెటర్ ఆప్షన్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More