Raveena Tandon Dog Bite: స్టేజీపై సీనియర్ హీరోయిన్‌ను మొరుగుతూ కరవబోయిన కుక్క.. అప్పుడు రవీనా టాండన్ ఏం చేసిందంటే?

Dog Attacks Raveena Tandon: బాలీవుడ్, తెలుగు సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫొటోలకు ఫోజులిస్తుండగా సినిమాలో నటించిన కుక్క ఆమెపై దాడికి దిగి దాదాపుగా చేతిన కరవబోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అప్పుడు రవీనా చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంది.

Published on: Aug 7, 2026, 11:05:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dog Attacks Raveena Tandon: బాలీవుడ్ ప్రముఖ నటి, తెలుగు-హిందీ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌కు ముంబైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో ఊహించని సంఘటన ఎదురైంది. వర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి నటించిన 'ఓ మై డాగ్' (Ohh My Dog) ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆమె, రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.

స్టేజీపై సీనియర్ హీరోయిన్‌ను మొరుగుతూ కరవబోయిన కుక్క.. అప్పుడు రవీనా టాండన్ ఏం చేసిందంటే?
స్టేజీపై సీనియర్ హీరోయిన్‌ను మొరుగుతూ కరవబోయిన కుక్క.. అప్పుడు రవీనా టాండన్ ఏం చేసిందంటే?

కరవబోయిన కుక్క

ఈ సందర్భంగా ఓ మై డాగ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన కుక్కతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు రవీనా టాండన్. అయితే ఉన్నట్టుండి ఆ కుక్క ఒక్కసారిగా రవీనా టాండన్‌ను కరిచేందుకు ప్రయత్నించింది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

భయపడకుండా ఓపికతో లాలించిన రవీనా

ఈ వీడియోలో స్టేజీ మీద ఫొటోల కోసం కిందకు వంగిన రవీనా పైకి లేస్తుండగా, ఆ శునకం తీవ్రంగా మొరుగుతూ ఆమెను కరవబోయింది. ఈ క్రమంలో రవీనా వేసుకున్న డ్రెస్ దారాలు ఆ కుక్క నోటికి చిక్కుకున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎవరైనా భయంతో కేకలు వేయడం లేదా వెనక్కి పరుగెత్తడం చేస్తారు. కానీ, రవీనా మాత్రం ఏమాత్రం కూడా భయపడలేదు. ఎంతో ప్రశాంతంగా ఆ కుక్కను నిమురుతూ దానిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

రవీనాపై ప్రశంసల వర్షం

"ఇంత హడావుడి, లైట్ల మధ్య కుక్క ఒత్తిడికి గురై ఉంటుంది. రవీనా టాండన్ మేడమ్ ఎంతో ఓపికతో, దయతో పరిస్థితిని చక్కదిద్దారు. నిజమైన జంతు ప్రేమికులకు ఉండాల్సిన లక్షణం ఇది" అని నెటిజన్లు సోషల్ మీడియాలో రవీనాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

"మన దగ్గర సినిమా ఈవెంట్లలో స్టార్లకు ఏ చిన్న సమస్య వచ్చినా బాడీగార్డులు, అభిమానుల తోపులాటతో గందరగోళం నెలకొంటుంది. అలాంటిది అంతపెద్ద స్టార్ అయ్యుండి కూడా రవీనా చూపించిన సంయమనం అందరినీ ఆకట్టుకుంది" అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

జంతువులపై ప్రేమాభిమానాలను చాటే 'ఓ మై డాగ్'

అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన 'ఓ మై డాగ్' ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం. ఓ ప్రాంతంలో వరుసగా మాయమవుతున్న కుక్కల వెనుక ఉన్న ఒక పెద్ద ముఠా గుట్టును ఒక ధైర్యవంతమైన కుక్క ఎలా రట్టు చేసిందనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. పంకజ్ త్రిపాఠితో పాటు పవన్ మల్హోత్రా, మాహి రాయ్, రాజేష్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సినిమాపై దర్శకుడి కామెంట్స్

"కుక్కలు మనకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమను, విశ్వాసాన్ని అందిస్తాయి. జంతువుల పట్ల దయతో మెలగాలనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించాం. థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రేక్షకులు జంతువుల పట్ల కాస్త ప్రేమను పెంచుకుంటే మా ప్రయత్నం నెరవేరినట్లే" అని దర్శకుడు అమిత్ రాయ్ పేర్కొన్నారు.

ఇవాళే థియేటర్లలోకి

బాబులాల్ బయోస్కోప్, థింకింగ్ హ్యాట్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అమిత్ రాయ్, రాజేష్ భరద్వాజ్, సనా వార్సీ నిర్మించిన ఈ ఓ మై డాగ్ సినిమా ఆగస్టు 7న అంటే ఇవాళ థియేటర్లలో విడుదలైంది.

ఓ మై డాగ్ వాయిదా

థియేటర్లు దొరక్కపోవడం, ఇతర పెద్ద సినిమాల పోటీ కారణంగా జూలై 31 నుంచి ఆగస్టు 7కి ఈ సినిమా ఓ మై డాగ్ విడుదలను వాయిదా వేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More