OTT Family: ఓటీటీలోకి తమిళ సోషల్ ఫ్యామిలీ డ్రామా మూవీ- తల్లికి మళ్లీ పెళ్లి- 7.7 రేటింగ్- తెలుగులో స్ట్రీమింగ్-ఎక్కడంటే?

Vanda Devullu OTT Streaming: బిచ్చగాడు హీరో విజయ్ నటించిన లేటెస్ట్ తమిళ సోషల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం వంద దేవుళ్లు ఓటీటీలోకి వచ్చేయనుంది. 7.7 రేటింగ్ అందుకున్న వంద దేవుళ్లు సినిమాను తెలుగులో ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. మరి వంద దేవుళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 25, 2026, 05:35:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vanda Devullu OTT Release Date: బిచ్చగాడు సినిమాతో హీరోగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అలాంటి విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీనే నూరు సామి (Nooru Saami).

ఓటీటీలోకి తమిళ సోషల్ ఫ్యామిలీ డ్రామా మూవీ- తల్లికి మళ్లీ పెళ్లి- 7.7 రేటింగ్- తెలుగులో స్ట్రీమింగ్-ఎక్కడంటే?
ఓటీటీలోకి తమిళ సోషల్ ఫ్యామిలీ డ్రామా మూవీ- తల్లికి మళ్లీ పెళ్లి- 7.7 రేటింగ్- తెలుగులో స్ట్రీమింగ్-ఎక్కడంటే?

జోడీగా స్వాసిక విజయన్

తమిళంలో సోషల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన నూరు సామిని తెలుగులో వంద దేవుళ్లు (Vanda Devullu)గా డబ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీకి జోడీగా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ స్వాసిక విజయన్ నటించింది. వీరితోపాటు అజయ్ దిశన్, లిజోమోల్ జోస్, కరుణాకరన్, మునిష్‌కాంత్, బాలాజీ శక్తివేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

డైరెక్టర్ శశి దర్శకత్వం వహించిన వంద దేవుళ్లు సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మించాయి. జూన్ 19న థియేటర్లలో విడుదలైన వంద దేవుళ్లు సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.7 రేటింగ్ కూడా సాధించింది.

40 దాటిన తల్లికి మళ్లీ పెళ్లి

నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన వంద దేవుళ్లు చిత్రం వింతతువు, ఆమె ఇద్దరి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. నలభై దాటడం, మధ్య వయస్సుకి వచ్చిన అమ్మని మళ్లీ పెళ్లి చేయాలని కొడుకు అనుకోవడం, ఆ తల్లి సైతం తోడును వెతుక్కోవాలని ఆలోచించినప్పుడు, ఆమె నిర్ణయం బంధువులు, గ్రామస్తులు, మొత్తం సమాజం నుంచి ప్రతిఘటనను ఎదుర్కొంటుంది.

తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

మహిళల అణచివేతపై

తల్లీకొడుకుల అద్భుతమైన బంధాన్ని తెరపై అంతే అద్బుతంగా చూపించారు. 'వంద దేవుళ్లు' ఒక ఒంటరి తల్లి కథను చెబుతున్నప్పటికీ దానిలోని భావోద్వేగాలు కేవలం ఒక మహిళ ప్రయాణానికే పరిమితం కావు. ఈ చిత్రం వివాహం, మాతృత్వం, త్యాగం, సహచర్యం, మహిళలపై అణచివేతను చూపిస్తుంది. అన్ని తరాల తల్లులు, వివాహిత మహిళలు తమకు తాము అన్వయించుకోగలిగే కథగా నిలుస్తుంది.

ఈ చిత్రం థియేటర్లలో కూడా మంచి వసూళ్లను సాధించింది. ఇందులోని సహజమైన భావోద్వేగాలు, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేటి ప్రేక్షకులు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, చర్చలను రేకెత్తించి, మారుతున్న సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే కథల కోసం ఎదురుచూస్తున్నారని మేము నమ్ముతున్నామని మేకర్స్ తెలిపారు.

జీ5 ఓటీటీలో

'వంద దేవుళ్లు' మూవీ మన మూలాల్లోని కథనాన్ని, ప్రగతిశీల, ఆలోచింపజేసే ఇతివృత్తంతో మేళవించి, భావోద్వేగభరితంగా అందరికీ చేరువయ్యేలా చేస్తుందని వారు చెప్పుకొచ్చారు. ఇలాంటి వంద దేవుళ్లు ఓటీటీ ప్రీమియర్‌ను తాజాగా నిన్న (జూలై 24) ప్రకటించారు.

హీరో విజయ్ ఆంటోనీ బర్త్ డే సందర్భంగా వంద దేవుళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. జీ5లో వంద దేవుళ్లు ఓటీటీ రిలీజ్ కానుంది. ఆగస్టు నెలలో జీ5లో తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం వంటి నాలుగు భాషల్లో వంద దేవుళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. అయితే, ఇప్పటికీ వంద దేవుళ్లు ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More