Jana Nayagan OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన దళపతి విజయ్ జన నాయగన్- 60 కోట్ల తేడాతో మారిన ఓటీటీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jana Nayagan OTT Streaming Details: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. బాలకృష్ణ 'భగవంత్ కేసరి' రీమేక్‌గా వచ్చిన ఈ పొలిటికల్ మాస్ యాక్షన్ డ్రామా జన నాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ రూ. 60 కోట్ల తేడాతో మారిపోయింది. అదేంటో చూద్దాం.

Published on: Jul 24, 2026, 12:24:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jana Nayagan OTT Release Details: తమిళ స్టార్ హీరో, సీఎం దళపతి విజయ్ నటించిన లాస్ట్ సినిమా ‘జన నాయగన్’. తెలుగులో ‘జన నాయకుడు’. విజయ్ పూర్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు నటించిన ఈ సినిమా 7 నెలల ఆలస్యంతో ఎట్టకేలకు నిన్న (జూలై 23) థియేటర్లలో విడుదల అయింది.

ఓటీటీలోకి నిన్న రిలీజైన దళపతి విజయ్ జన నాయగన్- 60 కోట్ల తేడాతో మారిన ఓటీటీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన దళపతి విజయ్ జన నాయగన్- 60 కోట్ల తేడాతో మారిన ఓటీటీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తక్కువగా జన నాయగన్ కలెక్షన్స్

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తమిళనాడులో విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ శ్రేణులు, అభిమానుల పండుగ వాతావరణం నడుమ ఈ సినిమా కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి.

తెలుగులో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చి సంచలన విజయం సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి ఇది అధికారిక తమిళ రీమేక్. బాలయ్య పోషించిన పవర్ ఫుల్ క్యారెక్టర్‌ను తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా విజయ్ పాత్రను దర్శకుడు హెచ్. వినోద్ రూపుదిద్దారు.

జన నాయగన్ కథ

విజయ్ ఇందులో 'దళపతి వెట్రి కొండన్' అనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించారు. తన దివంగత మిత్రుడి కుమార్తె విజ్జీ (మమితా బైజు)ని ఇండియన్ ఆర్మీలో చేర్పించేందుకు, ఆమె గతాన్ని జయించేలా చేసే తండ్రి లాంటి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, విలన్‌గా బాబీ డియోల్, ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, ప్రియమణి మెరిసారు.

జన నాయగన్ సినిమా పక్కా విజయ్ అభిమానుల సినిమాలా అనిపించిందని టాక్ వచ్చింది. విజయ్ డైలాగ్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ విజిల్స్ కొట్టించేలా ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే, చాలా వరకు సీన్లు సాగదీతలా, అనవసరమైన యాక్షన్ జొప్పించారని కాస్తా నెగెటివిటీ కూడా వస్తోంది.

జన నాయగన్ ఐఎమ్‌డీబీ రేటింగ్

ఇలాంటి భిన్నమైన అభిప్రాయాల మధ్య జన నాయకుడు సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.1 రేటింగ్ వచ్చింది. ఇక థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చిన ప్రతి సినిమా ఓటీటీ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని తెలిసిందే. ఈ క్రమంలోనే జన నాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డీటేల్స్‌పై క్యూరియాసిటీ పెరిగింది.

మొదట్లో జన నాయకుడు సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 110 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరిపిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే సినిమా విడుదల ఆలస్యం కావడం, పైరసీ లీకుల భయాల కారణంగా ఆ ఒప్పందం ముందుకు సాగలేదని వార్తలు వచ్చాయి.

జన నాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్

ఆ తర్వాత ప్రసిద్ధ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) ఈ హక్కుల కోసం దాదాపు రూ. 50 కోట్ల భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, రూ. 60 కోట్లతో జన నాయగన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారిపోయిందని తెలుస్తోంది. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జీ5లోనే జన నాయగన్ ఓటీటీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది.

ఆగస్ట్ 21 నుంచి జీ5లో జన నాయకుడు ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని టాక్. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో జీ5 ఓటీటీలో జన నాయగన్ అందుబాటులో ఉండనుందట. విజయ్ లాస్ట్ సినిమాను మంచి అనిభూతితో చూడాలనుకునే అభిమానులు, ఆడియెన్స్ జన నాయగన్ మూవీని థియేటర్లలో చూడటం ఉత్తమం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More