OTT Weekend: ఇవాళ సండే- ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 7 క్రైమ్ థ్రిల్లర్స్- 7కిపైగా రేటింగ్- ఒకేదాంట్లో స్ట్రీమింగ్!

OTT Crime Thrillers To Watch On Weekend: ఇవాళ సండే వీకెండ్ కాబట్టి ఇంట్లోనే కూర్చుని సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వారి కోసం టాప్ 6 సినిమాల జాబితాను రెడీ చేశాం. వీటిలో 2 నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కడం విశేషం. 7కిపైగా రేటింగ్ ఉన్న ఈ టాప్ 6 ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌ ఏంటో తెలుసుకుందాం.

Published on: Jul 19, 2026, 08:48:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
ఇవాళ సండే- ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 7 క్రైమ్ థ్రిల్లర్స్- 7కిపైగా రేటింగ్- ఒకేదాంట్లో స్ట్రీమింగ్!
ఇవాళ సండే- ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 7 క్రైమ్ థ్రిల్లర్స్- 7కిపైగా రేటింగ్- ఒకేదాంట్లో స్ట్రీమింగ్!

Top 6 OTT Crime Thrillers To Watch On Weekend: క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లంటే ఓటీటీ లవర్స్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీల్లో ఉత్కంఠ రేకెత్తించే కథలను చూసేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు.

టాప్ 6 ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్

ఒకవేళ మీరు కూడా ఇవాళ సండే (జూలై 19) సందర్భంగా వీకెండ్‌కు ఎలాంటి బోర్ కొట్టని, నరాలు తెగే ఉత్కంఠను పంచే క్రైమ్ థ్రిల్లర్స్ కోసం టాప్ 6 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ ఒక్క ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ టాప్ 6 ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్ ఏంటో వాటి ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో సహా చూద్దాం.

నిజ జీవిత భయానక గాథలు (True Crime Documentaries)

1. హాథ్రస్: 16 డేస్ (Hathras: 16 Days)

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.8/10

కథ: 2020లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హాథ్రస్ అత్యాచార ఘటన ఆధారంగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందించారు. ఆ దారుణం జరిగిన తర్వాత చోటుచేసుకున్న 16 రోజుల నాటకీయ పరిణామాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన జర్నలిస్టులు, బాధితురాలి కుటుంబ సభ్యుల కోణంలో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన విధానం ప్రేక్షకుడిని కదిలిస్తుంది.

2. హనీమ్యూన్ సే హత్య (Honeymoon Se Hatya)

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.0/10

స్టోరీ: ఇది కూడా నిజ జీవితంలో జరిగిన కొన్ని దారుణ ఉదంతాల ఆధారంగా తెరకెక్కిన 6 ఎపిసోడ్ల డాక్యుమెంటరీ ఓటీటీ సిరీస్. పెళ్లయిన కొత్తలోనే వైవాహిక జీవితంలో వచ్చే విభేదాలు, మనస్పర్థలు చివరకు దంపతుల మధ్య హత్యల వరకు ఎలా దారితీశాయనే కోణాన్ని ఇందులో లోతుగా విశ్లేషించారు. సమాజంలో మారుతున్న బంధాల స్వరూపాన్ని ఈ సిరీస్ ప్రశ్నిస్తుంది. తెలుగులో కూడా హనీమూన్ సే హత్య ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సస్పెన్స్, ప్రతీకార జ్వాలలు (Suspense & Revenge Drama)

3. సన్‌ఫ్లవర్ - సీజన్ 2 (Sunflower 2)

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.4/10

కథాంశం: ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్ లీడ్ రోల్‌లో, తెలుగు హీరోయిన్ ఆదా శర్మ కీలక పాత్రలో నటించిన ఈ సస్పెన్స్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ 2024లో విడుదలై మంచి ఆదరణ పొందింది. 'సన్‌ఫ్లవర్ సొసైటీ'లో జరిగే ఒక మర్డర్ కేసు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో హీరో సోనూనే ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్న తరుణంలో, సొసైటీలోకి వచ్చే కొత్త క్యారెక్టర్లు కథను ఎలాంటి మలుపులు తిప్పాయనేది 8 ఎపిసోడ్లలో ఆసక్తికరంగా చూపించారు.

4. బిచ్చు కా ఖేల్ (Bicchoo Ka Khel)

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.0/10

కథ: 2020లో వచ్చిన ఈ సిరీస్ ఒక వినూత్నమైన మైండ్ గేమ్‌తో సాగుతుంది. ఒక యువకుడు స్వయంగా పోలీసుల ముందుకు వచ్చి తనే ఒక హత్య చేశానని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అసలు కథను పోలీసులకు చెప్తూ.. తానే ఆ హత్య చేశానని చట్టబద్ధంగా నిరూపించాలంటూ వారికే ఓపెన్ ఛాలెంజ్ విసురుతాడు. ఆ సవాల్‌ను పోలీసులు ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ ఓటీటీ సిరీస్ హైలైట్.

అండర్ వరల్డ్, యాక్షన్ థ్రిల్లర్స్ (Underworld & Action)

5. ముర్షిద్ (Murshid)

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.3/10

కథాంశం: ఒకప్పుడు ముంబై అండర్ వరల్డ్‌ను శాసించి, ఆ తర్వాత నేర ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసిన ఒక మాజీ గ్యాంగ్‌స్టర్ కథ ఇది. తన వ్యక్తిగత జీవితంలో అనుకోకుండా ఎదురైన ఒక పెను ప్రమాదం కారణంగా అతడు మళ్లీ చేతికి గన్ పట్టాల్సి వస్తుంది. పాత తరం గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది పక్కా విందు భోజనం లాంటిది.

6. నక్సల్బరీ (Naxalbari)

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.0/10

కథ: మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల నేపథ్యంలో సాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆ ప్రాంతంలో నక్సలిజం మళ్లీ పంజా విసరాలని చూస్తున్న తరుణంలో, దానిని అణచివేయడానికి ఒక ఎస్టీఎఫ్ (STF) ఏజెంట్ రంగంలోకి దిగుతాడు. అతడు చేపట్టిన ఆపరేషన్‌లో ఎదురైన సవాళ్లు, వ్యూహ ప్రతివ్యూహాలతో స్క్రీన్‌ప్లే ఎంతో స్పీడ్‌గా సాగుతుంది.

ఈ ఆరు క్రైమ్ థ్రిల్లర్స్ హిందీతో పాటు తెలుగు సబ్‌టైటిల్స్ లేదా డబ్బింగ్ రూపంలో వీక్షించడానికి అందుబాటులో ఉన్నాయి. ఒక్క జీ5 ఓటీటీలోనే ఈ టాప్ 6 క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More