The Odyssey OTT: ఏకంగా 5 ఓటీటీల్లోకి నిన్న రిలీజైన నోలన్ విజువల్ వండర్ ది ఒడిస్సీ- తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
The Odyssey OTT Streaming Details: ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిన సరికొత్త ఎపిక్ డ్రామా ది ఒడిస్సీ థియేటర్లలో సందడి చేస్తోంది. హాలీవుడ్ స్టార్ నటులతో రూపొందిన ది ఒడిస్సీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకటి కాదు ఏకంగా 5 ఓటీటీల్లో ది ఒడిస్సీ ఓటీటీ రిలీజ్ కానుంది.
The Odyssey OTT Release Details: 'ఓపెన్‌హైమర్' సినిమాతో ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి మరో అద్భుత దృశ్యకావ్యం థియేటర్లలోకి నిన్న వచ్చేసింది. హోమర్ రాసిన ప్రసిద్ధ పురాణ గాథ (ఇతిహాసం) ఆధారంగా నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' (The Odyssey) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా జూలై 17న విడుదలైంది.

భారీ వసూళ్లతో ది ఒడిస్సీ
2 గంటల 52 నిమిషాల సుదీర్ఘ నిడివి గల ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో ఆయన అందించిన ఇంటర్‌స్టెల్లార్, ఇన్‌సెప్షన్, ఓపెన్‌హైమర్ చిత్రాలకు తెలుగులోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి.
ఇక ఇప్పుడు వచ్చిన 'ది ఒడిస్సీ' కూడా అదే స్థాయి అంచనాలతో థియేటర్లలో ఐమాక్స్ (IMAX) స్క్రీన్లపై ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. "తొలి వారాంతంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 117 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 970 కోట్లు) భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది" అని ఫోర్బ్స్ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.
గ్రీకు వీరుడి సుదీర్ఘ ప్రయాణం.. భారీ తారాగణం
ఈ సినిమాలో ఇథాకా గ్రీకు రాజు ఒడిస్సియస్ పాత్రలో హాలీవుడ్ స్టార్ నటుడు మాట్ డామన్ నటించారు. ట్రాజన్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత తన భార్య రాణి పెనెలోప్ (అన్నే హాత్వే), కుమారుడు ప్రిన్స్ టెలిమాకస్ (టామ్ హాలండ్)లను కలుసుకోవడానికి ఒడిస్సియస్ చేసే పదేళ్ల సుదీర్ఘమైన, ప్రమాదకరమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం.
ఒడిస్సియస్ చనిపోయాడని భావించి, రాణి పెనెలోప్‌ను పెళ్లి చేసుకుని రాజ్యాన్ని దక్కించుకోవాలని చూసే విలన్ యాంటినస్ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటించారు. వీరితో పాటు జెండయా (ఎథీనా), షార్లిజ్ థెరాన్ (కాలిప్సో), లుపితా న్యాంగో (హెలెన్ ఆఫ్ ట్రాయ్) వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు.
నోలన్ పంతం.. ఓటీటీ రిలీజ్‌కు భారీ నిరీక్షణ!
సాధారణంగా యూనివర్సల్ పిక్చర్స్ నిర్మించే సినిమాలు థియేటర్లలోకి వచ్చిన ఐదు వారాల్లోనే (దాదాపు 30 రోజుల్లో) ఓటీటీ స్ట్రీమింగ్ లేదా ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD) పద్ధతిలో ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తుంటాయి. కానీ, క్రిస్టోఫర్ నోలన్ రూటే వేరు. సినిమాను థియేటర్లలోనే చూడాలనేది ఆయన బలమైన సిద్ధాంతం.
హాలీవుడ్‌లో ఆయనకున్న విపరీతమైన క్రేజ్ కారణంగా, తన సినిమాలను అంత త్వరగా ఓటీటీకి ఇవ్వడానికి నోలన్ అంగీకరించరు. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన 'ఓపెన్‌హైమర్' విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సినిమా థియేటర్లలో విడుదలైన సరిగ్గా నాలుగు నెలల (123 రోజులు) తర్వాతే ఓటీటీలోకి అద్దె రూపంలో అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఏ ప్లాట్‌ఫామ్‌లో?
నోలన్ మునుపటి ప్లాన్ ప్రకారమే 'ది ఒడిస్సీ' కూడా దాదాపు నాలుగు నెలల పాటు థియేటర్లలోనే రన్ కానుంది. ఈ లెక్కన నవంబర్ 17, 2026 నాటికి ఈ చిత్రం యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మూవీస్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో డబ్బులు పెట్టి కొనుగోలు చేయడానికి లేదా అద్దెకు తీసుకునే (PVOD) రూపంలో అందుబాటులోకి రానుంది.
ఈ 3 ఓటీటీల్లో ది ఒడిస్సీ సినిమాను కొనుగోలు చేయడానికి 20 నుంచి 30 డాలర్లు (ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ. 1925 నుంచి రూ. 2890), లేదా 48 గంటల పాటు అద్దెకు తీసుకోవడానికి 15 నుంచి 25 డాలర్లు (రూ. 1,444 నుంచి రూ. 1,926) చెల్లించాల్సి ఉంటుంది.
ది ఒడిస్సీ ఓటీటీ ప్రీమియర్
ఈ మూడు ఓటీటీల తర్వాతే ది ఒడిస్సీ సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్ అయిన పీకాక్ (Peacock) యాప్‌లోకి వస్తుంది. ఓపెన్‌హైమర్ తరహాలోనే పీకాక్ సబ్‌స్క్రైబర్ల కోసం 2027 ఫిబ్రవరి 12 నాటికి ది ఒడిస్సీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని హాలీవుడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక వీటన్నింటి తర్వాత జియో హాట్‌స్టార్‌లో తెలుగులో ది ఒడిస్సీ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని సమాచారం. ఇంగ్లీషుతోపాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఆరు భాషల్లో హాట్‌స్టార్‌లో ది ఒడిస్సీ ఓటీటీ రిలీజ్ అవనుంది.
5 ఓటీటీల్లో ది ఒడిస్సీ
పీకాక్ తరహాలోనే ఫిబ్రవరి నెలలోనే జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి తెలుగు వంటి సౌత్ భాషల్లో ది ఒడిస్సీ అందుబాటులోకి రానుందని ప్రస్తుతం ఉన్న సమాచారం. ఈ లెక్కన థియేట్రికల్ రన్ అయిన తర్వాత యాపిల్ టీవీ ప్లస్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, పీకాక్, జియో హాట్‌స్టార్ వంటి 5 ఓటీటీల్లో ది ఒడిస్సీ స్ట్రీమింగ్ అవనుంది.
కాకపోతే, ఈ విజువల్ వండర్‌ను ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో చూడాలనుకునే వారు మరికొన్ని నెలలు వేచి చూడక తప్పదు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


