OTT: గొర్రెలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే.. ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న మర్డర్ మిస్టరీ.. తెలుగులోనే స్ట్రీమింగ్!
The Sheep Detectives OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది క్రైమ్ కామెడీ మర్డర్ మిస్టరీ చిత్రం ది షీప్ డిటెక్టివ్స్. గొర్రెలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది ఈ సినిమా. మరి ది షీప్ డిటెక్టివ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
The Sheep Detectives OTT Trending: ఇప్పటివరకు ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో విభిన్న జోనర్లలో సినిమాలు వచ్చాయి. కానీ, గొర్రెలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు.

ఎక్స్ మెన్ నటించిన సినిమా
అలాంటి వినూత్నమైన కథతో తెరకెక్కిన సినిమానే 'ది షీప్ డిటెక్టివ్స్' (The Sheep Detectives) . ఎక్స్ మెన్ అలియాస్'వోల్వరైన్' (Wolverine) పాత్రతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్‌మన్ (Hugh Jackman) నటించిన కామెడీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమానే ఇది.
ఈ ఏడాది మే 8న థియేటర్లలో విడుదలై అంతర్జాతీయంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ వినూత్న చిత్రం ది షీప్ డిటెక్టివ్స్ ఓటీటీలోకి వచ్చేయడమే కాకుండా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. జూన్ 24న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో దంచికొట్టడం విశేషం.
గొర్రెలు డిటెక్టివ్‌లుగా మారితే.. వినూత్నమైన కథాంశం
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ లేదా మర్డర్ మిస్టరీ సినిమాల్లో పోలీసులు, సీఐడీ అధికారులు కేసులు ఛేదించడం మనం చూస్తుంటాం. కానీ, ఈ సినిమాలో గొర్రెలు డిటెక్టివ్‌లుగా మారి ఒక మర్డర్ మిస్టరీని ఛేదించడమే అసలైన ట్విస్ట్.
2005లో లియోనీ స్వాన్ రాసిన 'త్రీ బ్యాగ్స్ ఫుల్' (Three Bags Full) అనే ప్రసిద్ధ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టాలెంటెడ్ రైటర్ క్రేగ్ మజిన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించగా, కైల్ బాల్డా అద్భుతంగా దర్శకత్వం వహించారు.
గొర్రెలకు ఇన్వెస్టిగేషన్ కథలు
కథ విషయానికి వస్తే.. జార్జ్ (హ్యూ జాక్‌మన్) అనే గొర్రెల కాపరి ప్రతిరోజూ రాత్రి తను పెంచుకునే గొర్రెల మందకు డిటెక్టివ్ నవలలను కథలుగా చదివి వినిపిస్తుంటాడు. గొర్రెలకు ఆ కథలు అర్థం కావులే అని జార్జ్ భావిస్తాడు. కానీ, ఒకరోజు రాత్రి ఆ ఫామ్‌లో ఒక ఊహించని దారుణం జరుగుతుంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు జార్జ్‌ను దారుణంగా హత్య చేస్తారు.
తమను ప్రాణంగా చూసుకునే యజమాని చనిపోవడంతో ఆ గొర్రెల మంద తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. తమ యజమానిని చంపిన హంతకుడిని పట్టుకోవడానికి ఆ గొర్రెలన్నీ కలిసి ఒక డిటెక్టివ్ గ్యాంగ్‌గా మారతాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, హంతకుడిని అవి ఎలా పట్టుకున్నాయి అనేదే మిగతా కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
గొర్రెలకు హాలీవుడ్ స్టార్స్ వాయిస్ ఓవర్
ఈ సినిమాలో హ్యూ జాక్‌మన్‌తో పాటు నికోలస్ బ్రాన్, నికోలస్ గాలిట్జైన్, మోలీ గోర్డాన్, ఎమ్మా థాంప్సన్, కాన్లెత్ హిల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. వీరందరితో పాటు డిటెక్టివ్‌లుగా మారే గొర్రెల పాత్రలకు హాలీవుడ్ టాప్ సెలబ్రిటీలైన బ్రయాన్ క్రాన్‌స్టన్, జూలియా లూయిస్-డ్రేఫస్, క్రిస్ ఓ డౌడ్, రెజీనా హాల్, ప్యాట్రిక్ స్టెవర్ట్, బెల్లా రామ్సే తమ వాయిస్ ఓవర్ అందించడం విశేషం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 24 నుంచి ది షీప్ డిటెక్టివ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీషుతోపాటు తెలుగులోనూ ది షీప్ డిటెక్టివ్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అంతేకాకుండా అప్పటినుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాలో టాప్ ప్లేసులో ఈ సినిమా ఉండటం విశేషం.
ది షీప్ డిటెక్టివ్స్ ఓటీటీ ట్రెండింగ్
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 8 ప్లేసులో ది షీప్ డిటెక్టివ్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో అలరిస్తోంది. ఇండియాలోని అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్ 10 మూవీస్, సిరీస్‌లలో ఈ మర్డర్ మిస్టరీ కామెడీ 8వ స్థానంలో దూసుకుపోతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


