Oh Sukumari OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ఓ సుకుమారి- 8.4 రేటింగ్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Oh Sukumari OTT Streaming Details: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటించిన రొమాంటిక్ విలేజ్ కామెడీ డ్రామా ఓ సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తిగా మారాయి. థియేటర్లలో విడుదలవక ముందే ఓ సుకుమారి ఓటీటీ డీల్ ఫిక్స్ అయిపోయింది. 8.4 రేటింగ్ ఉన్న ఓ సుకుమారి ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 18, 2026, 11:52:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Oh Sukumari OTT Release Details: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఓటీటీలోకి నిన్న రిలీజైన ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ఓ సుకుమారి- 8.4 రేటింగ్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ఓ సుకుమారి- 8.4 రేటింగ్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

జోడీగా ఐశ్వర్య రాజేష్

ఆ సినిమానే ఓ సుకుమారి. ఈ సినిమాలో తిరువీర్‌కు జోడీగా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చేసింది. భరత్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు మురళీధర్ గౌడ్, ఆమని, ఆనంద్, విష్ణు ఓయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించుకున్న ఓ సుకుమారి నిన్న అంటే జూలై 17న థియేటర్లలో విడుదల అయింది. ప్రేమించిన అమ్మాయిని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే వంటి వినూత్న కథాంశంతో ఈ సినిమాను మలిచారు.

తాత ఆస్తికి కండీషన్

నరాల యాదగిరి తన ఊరికి సర్పంచ్ కావాలని కలలు కంటాడు. మరోవైపు అతని తాత ఒక కండీషన్‌తో ఆస్తి వచ్చేలా వీలునామా రాస్తాడు. ఈ క్రమంలోనే దామినిని చూసి ఇష్టపడుతాడు యాదగిరి. ప్రేమించిన ఆమెతో పెళ్లి ప్రపోజల్ పెట్టి, అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.

కానీ, దామినికి ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే వింత సమస్య ఉంటుంది. అది దాచి అమాయకుడైన యాదగిరికి దామినిని ఇచ్చి పెళ్లి చేస్తారు ఊరి జనం. ఆ తర్వాత ఏమైంది? దామినికి ఆ సమస్య ఎలా వచ్చింది? యాదగిరికి తాత ఆస్తి దక్కిందా? తాత వీలునామాలో ఏముంది? మరి దామినితో యాదగిరి కాపురం చేశాడా? పిల్లలను కన్నాడా? అనేది తెలియాలంటే? ఓ సుకుమారి సినిమాను చూడాల్సిందే.

ఓ సుకుమారి రేటింగ్

ఓ సుకుమారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఫస్టాఫ్ సీన్లు, యాదగిరి అమాయకత్వం, లవ్ స్టోరీ, పెళ్లి వరకు అన్నీ ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. కానీ, సెకండాఫ్‌లో కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా వరకు నటీనటులు తమ టైమింగ్‌తో నవ్వించారు. దీంతో ఈ సినిమాకు బుక్ మై షోలో పదికి 8.4 రేటింగ్ (ప్రస్తుతానికి) ఉంది.

ఇంతటీ క్రేజ్ తెచ్చుకుంటున్న ఓ సుకుమారి ఓటీటీ డీల్ రిలీజ్‌కు ముందే ఫిక్స్ అయిపోయింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ సుకుమారి ఓటీటీ హక్కులను కొనేసుకుంది. కాబట్టి, అమెజాన్ ప్రైమ్‌లోనే ఓ సుకుమారి ఓటీటీ రిలీజ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అయితే, మేకర్స్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఆగస్ట్ 7 అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఓ సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని సమాచారం. లాంగ్ రన్, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ టాక్‌ను బట్టి ఓ సుకుమారి ఓటీటీ రిలీజ్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా విభిన్న భాషల్లోనూ ఓ సుకుమారి ఓటీటీలోకి వచ్చేయనుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఓ సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని ప్రస్తుతం ఉన్న సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More