OTT Romantic: ఓటీటీలోకి పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ కామెడీ- భార్య, లవర్ ఒకేసారి ప్రెగ్నెంట్ అయితే? ఎక్కడంటే?

Pooja Hegde Mrunal Thakur Hai Jawani Toh Ishq Hona Hai OTT Streaming: యంగ్ హీరో వరుణ్ ధావన్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ హై జవానీ తో ఇష్క్ హోనా హై ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. వాటిపై లుక్కేద్దాం.

Published on: Jun 13, 2026, 17:46:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pooja Hegde Mrunal Thakur Hai Jawani Toh Ishq Hona Hai OTT Release: తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా బాలీవుడ్ చిత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (Hai Jawani Toh Ishq Hona Hai).

ఓటీటీలోకి పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ కామెడీ- భార్య, లవర్ ఒకేసారి ప్రెగ్నెంట్ అయితే? ఎక్కడంటే?
ఓటీటీలోకి పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ కామెడీ- భార్య, లవర్ ఒకేసారి ప్రెగ్నెంట్ అయితే? ఎక్కడంటే?

జవానీ తో ఇష్క్ హోనా హై ఓటీటీ రిలీజ్ డీటేల్స్

సీనియర్ ఫిల్మ్ మేకర్ డేవిడ్ ధావన్ మార్క్ కామెడీతో రూపొందిన ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలైంది. అయితే, వెండితెరపై ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ రైట్స్, ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియక ముందే హై జవానీ తో ఇష్క్ హోనా హై ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుందనే విషయం అటు తెలుగు, ఇటు బాలీవుడ్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

టాలీవుడ్ భామల క్రేజ్.. థియేటర్ టాక్ ఎలా ఉందంటే?

'సీతా రామం', 'హాయ్ నాన్న' చిత్రాలతో తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్, 'అల వైకుంఠపురములో' చిత్రంతో బుట్టబొమ్మగా మారిన పూజా హెగ్డే ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో టాలీవుడ్ ఆడియన్స్‌లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

యంగ్ హీరో వరుణ్ ధావన్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కెరీర్‌లో ఇది చివరి సినిమా కానుందనే ప్రచారం కూడా ఈ మూవీకి హైప్ తెచ్చింది. అయితే హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

చప్పగా సాగే పంచ్ లైన్స్

పాతకాలపు కథాంశం, పదే పదే వచ్చే రొటీన్ డైలాగులు, చప్పగా సాగే పంచ్ లైన్ల వల్ల ఈ రొమాంటిక్ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కేవలం కొద్దిమంది ప్రేక్షకులు మాత్రమే దీనిని ఒక టైమ్ పాస్ ఎంటర్‌టైనర్‌గా అభివర్ణించారు.

ప్రముఖ నిర్మాత రమేష్ తౌరానీ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన పూజా, మృణాల్ పోటీ పడి నటించారు. వీరితో పాటు చంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, రాకేష్ బేడీ, మనీష్ పాల్ కీలక పాత్రలు పోషించగా, గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ ఒక ప్రత్యేక పాత్రలో మెరిసింది.

జవానీ తో ఇష్క్ హోనా హై కథ

జవానీ తో ఇష్క్ హోనా హై కథలోకి వెళితే.. హీరో (వరుణ్ ధావన్)కు బాణి (మృణాల్ ఠాకూర్) భార్య ఉంటుంది. కానీ, పిల్లలు పుట్టరు. దాంతో భార్యతో విడాకులు తీసుకోవాలనుకుంటాడు హీరో. మరోవైపు సింగిల్ అని చెప్పి ప్రీత్ (పూజా హెగ్డే)తో ఫిజికల్‌గా ఒక్కటవుతాడు హీరో.

కట్ చేస్తే తిరిగి హీరో దగ్గరికి వచ్చిన భార్య తాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. అనంతరం లవర్ ప్రీత్ కూడా గర్భవతిని అయ్యాని సంతోషంగా చెబుతుంది. అలా ఒకేసారి భార్య, లవర్ ప్రెగ్నెంట్ కావడంతో హీరోకు సమస్యలు ఎదురవుతాయి. అవేంటీ?, ఒకరికి తెలియకుండా మరొకరిని హీరో ఎలా మ్యానేజ్ చేశాడు? చివరికి ఏమైంది? అనేదే ఈ సినిమా కథ.

ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు?

థియేటర్లలో మిశ్రమ రెస్పాన్స్‌ రావడంతో, డిజిటల్ వీక్షకులు హై జవానీ తో ఇష్క్ హోనా హై ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా వెతుకుతున్నారు. ఈ క్రమంలో హై జవానీ తో ఇష్క్ హోనా హై ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 (Zee5) మంచి ధరకే సొంతం చేసుకుందని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అంటే, జీ5లో హై జవానీ తో ఇష్క్ హోనా హై ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు మేకర్స్ కానీ, జీ5 ఓటీటీ సంస్థ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా హిందీ సినిమాలు థియేటర్లలో విడుదలైన 45 నుంచి 60 రోజుల విండో పీరియడ్ తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి.

జీ5 ఓటీటీలో

ఈ లెక్కన చూసుకుంటే జూన్ మొదటి వారంలో విడుదలైన ఈ చిత్రం హై జవానీ తో ఇష్క్ హోనా హై ఆగస్టు నెలలో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినిమా టాక్ ఎలా ఉన్న కాస్తా కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్ ఎంజాయ్ చేయాలనుకునే వారు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More