Hero: 440 కోట్ల సినిమాను రెజెక్ట్ చేసిన స్టార్ హీరో వరుణ్ ధావన్- 3 సార్లు అట్టర్ ఫ్లాప్ అయిన పెళ్లి ప్రపోజల్- ఎలా అంటే?
Varun Dhawan On Rejecting 440 Cr Movie And Marriage Proposal: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన కెరీర్‌లో రెజెక్ట్ చేసిన రూ. 440 కోట్ల సూపర్ హిట్, జాతీయ అవార్డు పొందిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అలాగే, 3 సార్లు తన పెళ్లి ప్రపోజల్ ఫ్లాప్ అయిందని తెలిపారు.
Varun Dhawan On Rejecting 440 Cr Movie And Marriage Proposal: సినిమా ఇండస్ట్రీలో ఒకరు వదులుకున్న కథ మరొకరి వద్దకు వెళ్లడం, అది కాస్తా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం చాలా సాధారణం. టాలీవుడ్‌లో ఎన్టీఆర్, మహేశ్ బాబు వదులుకున్న కొన్ని కథలు వేరే హీరోల వద్దకు వెళ్లి బ్లాక్‌బస్టర్లు అయినట్లే బాలీవుడ్‌లోనూ ఇలాంటి ఆసక్తికర సంఘటనలు జరిగాయి.

మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన కెరీర్‌లో వదులుకున్న ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఆ సినిమా మరేదో కాదు.. ఆయుష్మాన్ ఖురానాకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన 'అంధాధున్'.
ప్రముఖ యూట్యూబర్ తన్మయ్ భట్ చాట్ షోలో వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెరీర్‌లో రిజెక్ట్ చేసినా, ఆ తర్వాత పెద్ద హిట్ అయి బాధపడిన సినిమా ఏదైనా ఉందా? అని అడగ్గా వరుణ్ ధావన్ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు.
కంగనాతో చేయాల్సిన సినిమా.. కానీ!
"నేను ఒక మంచి సినిమాకు నో చెప్పాను, ఆ తర్వాత అది అద్భుతమైన చిత్రంగా మారింది. అదే 'అంధాధున్'. ఆ సమయంలో నేను వేరే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయాను. నిజానికి ఈ సినిమాలో మొదట నాతో పాటు కంగనా రనౌత్ నటించాల్సింది" అని వరుణ్ ధావన్ వెల్లడించారు.
442 కోట్ల కలెక్షన్స్
దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌లో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. కేవలం రూ. 17 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 442 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.
ఉత్తమ నటుడిగా ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో టబు పోషించిన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మొదట కంగనాను అనుకున్నారనే విషయం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రియల్ లైఫ్ ప్రపోజల్ అట్టర్ ఫ్లాప్!
ఇదే ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ తన భార్య నటాషా దలాల్‌తో ఉన్న ప్రేమాయణం, పెళ్లి ప్రపోజల్ గురించి ఒక సరదా విషయాన్ని పంచుకున్నారు. సినిమాల్లో చూపించే అద్భుతమైన లవ్ ప్రపోజల్స్ నిజ జీవితంలో అస్సలు వర్కవుట్ కావని నవ్వుతూ చెప్పారు.
"మేము అలీబాగ్‌లో ఉన్నప్పుడు సింగర్ మార్క్ ఆంథోనీ సాంగ్ ప్లే చేసి ప్రపోజ్ చేయాలనుకున్నాను. తను పూల్ నుంచి బయటకు రాగానే రింగ్ ఇవ్వాలనేది నా ప్లాన్. కానీ, నేను రింగ్ తెచ్చేలోపే తను పూల్ వెలుపలికి వచ్చేసింది. అలా రెండు మూడు సార్లు నా ప్లాన్ ఫ్లాప్ అయింది. సినిమాల్లో చూపించినట్లు పర్ఫెక్ట్ ప్రపోజల్స్ రియల్ లైఫ్‌లో అస్సలు జరగవు" అని వరుణ్ ధావన్ అన్నారు.
ఒక్క ప్రపోజల్ కోసం 3 సార్లు
"తను (నటాషా దలాల్) ఒక చోట కూర్చోకుండా డ్రింక్స్ అని, సలాడ్ అని తిరుగుతుంటే నా ఫ్రెండ్స్‌ని పంపించి ఒకే చోట ఆపాల్సి వచ్చింది. చివరికి నేను ప్రపోజ్ చేయబోతున్నానని తనే కనిపెట్టేసింది. ఆ ఒక్క ప్రపోజల్ కోసం ఒకే పాటను వరుసగా మూడు సార్లు ప్లే చేయాల్సి వచ్చింది" అని వరుణ్ ధావన్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. కాగా, వరుణ్, నటాషా జనవరి 2021లో వివాహం చేసుకోగా, వీరికి లారా అనే కుమార్తె ఉంది.
బాక్సాఫీస్ వద్ద వరుణ్ కొత్త సినిమా కష్టాలు
వరుణ్ ధావన్ ప్రస్తుతం తన తండ్రి, సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ స్పందన లభిస్తోంది.
దానిపైనే ఆశలు
'క్రింజ్ కామెడీ' అంటూ విమర్శకులు పెదవి విరుస్తున్నప్పటికీ, మూడు రోజుల్లో ఈ సినిమా దేశీయంగా రూ. 24 కోట్ల వసూళ్లను సాధించింది. వరుణ్ ధావన్ తన పాత స్టైల్ మాస్ ఎనర్జీతో మెప్పించినా, కథనంలో లోపాల వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా సాగుతోంది. దీని తర్వాత ఆగస్టులో విడుదల కానున్న క్రేజీ సీక్వెల్ 'భేడియా 2' సినిమాపైనే వరుణ్ ఆశలన్నీ పెట్టుకున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


