Tabu: నిన్న 20 ఏళ్లు ఉంటే ఈరోజుకే 45 ఏళ్లు రావు కదా, నా ఇంట్లో అద్దం లేనట్టు మాట్లాడుతారు-సీనియర్ హీరోయిన్ టబు కామెంట్స్

Tabu About Age And Story Rejection: వయసు పెరగడం, ఇండస్ట్రీలో ఉండే కపటత్వంపై సీనియర్ హీరోయిన్ టబు మొహమాటం లేకుండా స్పందించారు. నాగార్జున 100వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న టబు తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. తన ఇంట్లో అద్దం లేనట్లు మాట్లాడుతారంటూ చురకలు అంటించారు టబు.

Published on: May 14, 2026, 10:45:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tabu About Age And Story Rejection: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గ్లామర్ బ్యూటి టబు. గ్లామర్ పాత్రలకైనా, నటనకు ప్రాధాన్యమున్న రూల్స్‌కు అయిన ఈ సీనియర్ హీరోయిన్ టబు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతారు. అయితే సినీ ఇండస్ట్రీలో అందరూ నడిచే దారిలో నడవడం టబుకు అస్సలు ఇష్టం ఉండదు.

నిన్న 20 ఏళ్లు ఉంటే ఈరోజుకే 45 ఏళ్లు రావు కదా, నా ఇంట్లో అద్దం లేనట్టు మాట్లాడుతారు-సీనియర్ హీరోయిన్ టబు కామెంట్స్
నిన్న 20 ఏళ్లు ఉంటే ఈరోజుకే 45 ఏళ్లు రావు కదా, నా ఇంట్లో అద్దం లేనట్టు మాట్లాడుతారు-సీనియర్ హీరోయిన్ టబు కామెంట్స్

వివాదాలకు దూరంగా ఉంటూ, తన పని తాను చేసుకుపోయే ఈ సీనియర్ బ్యూటీ.. తాజాగా వయసు పెరగడం (Ageing), సినిమా రంగంలో ఉండే ఒత్తిళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్పర్స్ బజార్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబు తన మనసులోని మాటను బయటపెట్టారు.

మీ ఇంట్లో అద్దం లేదా?

సినిమా రంగంలో హీరోయిన్ల వయసు గురించి జరిగే చర్చలపై టబు తీవ్రంగా స్పందించారు. "నా వయసు గురించి నాకంటే కూడా ఎదుటి వారికే ఎక్కువ ఆందోళన ఉంటుంది. ఏదో నా ఇంట్లో అద్దం లేనట్టుగా, జనం నాకు అద్దం చూపించాలని తాపత్రయపడుతుంటారు" అని టబు ఎద్దేవా చేశారు.

వయసు మళ్లడం అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదని, అది ప్రతిరోజూ మనం అనుభవించే ఒక సహజమైన ప్రక్రియ అని టబు వివరించారు. నిన్న 20 ఏళ్లలో ఉండి, ఈరోజు ఉదయాన్నే 45 ఏళ్లకు చేరుకోము కదా అని టబు ప్రశ్నించారు.

అబద్ధాలు చెప్పడం నావల్ల కాదు!

సాధారణంగా ఇండస్ట్రీలో ఏదైనా సినిమా నచ్చకపోతే.. స్క్రిప్ట్ బాలేదని చెప్పడానికి చాలా మంది మొహమాటపడుతుంటారు. అటువంటి సమయంలో "డేట్స్ ఖాళీ లేవు" అనే అబద్ధపు సాకుతో తప్పించుకోమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని టబు గుర్తు చేసుకున్నారు.

"సినిమా చేయకపోవడానికి అసలు కారణం ఎప్పుడూ చెప్పకూడదు, డేట్స్ సమస్య అని చెప్పి తప్పుకోమని నాకు చెప్పారు. కానీ, నాకు అది అర్థం కాలేదు. నాకు కథ నచ్చకపోతే.. నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తా. అదే నా పద్ధతి" అని టబు కుండబద్దలు కొట్టారు. ఆమెలోని ఈ నిజాయితీనే నేటి తరం నటీమణుల్లో చాలా తక్కువగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తుంటారు.

తెలుగు వెండితెరపై మళ్లీ 'నిన్నే పెళ్లాడతా' మేజిక్?

తెలుగు ప్రేక్షకులకు టబు అంటే ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా కింగ్ నాగార్జునతో ఆమె కెమిస్ట్రీ అప్పట్లో ఒక ఊపు ఊపింది. 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడ మా ఆవిడే' వంటి చిత్రాల తర్వాత మళ్లీ 28 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో సెట్స్ మీదకు వచ్చింది. నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం (King100)లో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నాగార్జున కింగ్ 100 మూవీ షూటింగ్‌లో టబు కూడా పాల్గొన్నారు. నవీన్ (రా) కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా, అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె నటించిన హారర్ కామెడీ 'భూత్ బంగ్లా' కూడా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More