Mouni Roy: విడాకుల వార్తలపై నాగిని బ్యూటీ మౌనీ రాయ్ పోస్ట్- ప్రైవసీ కావాలంటూ! ఇన్‌స్టా అకౌంటే డిలీట్ చేసిన భర్త సూరజ్
Mouni Roy Reacts Divorce Rumours With Husband Suraj Nambiar: బాలీవుడ్ నటి మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారంటూ, విడాకులు తీసుకోనున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత విషయాలపై తప్పుడు కథనాలు ప్రచురించవద్దని, తమ ప్రైవసీని గౌరవించాలని కోరుతూ పోస్ట్ చేశారు.
Mouni Roy Post On Divorce Rumours With Husband Suraj Nambiar: తెలుగు ప్రేక్షకులకు 'నాగిని' సీరియల్ ద్వారా సుపరిచితమైన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. గత కొన్ని రోజులుగా మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోబోతోందని, విడాకులు తీసుకోనుందనే పుకార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇన్ స్టాగ్రామ్‌లో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఈ వివాదం ముదురుతుండటంతో మౌనీ రాయ్ ఎట్టకేలకు మౌనం వీడి స్పందించారు. "దయచేసి మా వ్యక్తిగత విషయాలపై తప్పుడు కథనాలను సృష్టించవద్దు. మాకు కొంత సమయం, ప్రైవసీ ఇవ్వాలని మీడియా సంస్థలను వినమ్రంగా కోరుతున్నాను" అని మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.
వివాదానికి ఆజ్యం పోసిన ఇన్‌స్టా చర్యలు
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ జంట గతంలో తమ ప్రేమను సోషల్ మీడియా వేదికగా తరచుగా వ్యక్తపరిచేవారు. అయితే, ఇటీవల వీరిద్దరూ అన్‌ఫాలో చేసుకోవడమే కాకుండా, సూరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఏకంగా డిలీట్ చేయడం సంచలనంగా మారింది.
మరోవైపు, మౌనీ రాయ్ సన్నిహిత మిత్రురాలు దిశా పటానీ కూడా సూరజ్‌ను అన్‌ఫాలో చేయడం ఈ విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే మౌనీ రాయ్ తన పెళ్లి ఫోటోలను, హనీమూన్ జ్ఞాపకాలను ఇంకా తన ప్రొఫైల్‌లో ఉంచడం గమనార్హం.
దుబాయ్‌లో మొదలైన ప్రేమాయణం
మౌనీ రాయ్, సూరజ్ లవ్ స్టోరీ ఒక సినిమాను తలపిస్తుంది. వీరిద్దరూ 2018లో దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో మొదటిసారి కలుసుకున్నారు. ఉమ్మడి స్నేహితుల ద్వారా పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది.
సూరజ్ దుబాయ్‌లో వ్యాపారవేత్తగా ఉండగా, మౌనీ రాయ్ ముంబైలో నటిగా బిజీగా ఉండేవారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ, తరచుగా ఒకరినొకరు కలుసుకుంటూ తమ బంధాన్ని దృఢపరుచుకున్నారు. చివరకు 2022లో గోవా వేదికగా మలయాళ, బెంగాలీ పద్ధతుల్లో ఘనంగా వివాహం చేసుకున్నారు.
తెలుగు ప్రేక్షకులతో మౌనీ అనుబంధం
మౌనీ రాయ్ కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. 'దేవోన్ కే దేవ్.. మహాదేవ్' (తెలుగులో హరహర మహాదేవ) సీరియల్‌లో సతి పాత్రతో తెలుగు లోగిళ్లలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'నాగిని' సీరియల్ మౌనీ రాయ్‌ను టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు ఇండియా అంతటా స్టార్‌ను చేసింది.
అనంతరం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో కింగ్ నాగార్జున సరసన విలన్ పాత్రలో మౌనీ రాయ్ అద్భుతంగా నటించి మెప్పించారు. ప్రస్తుతం మౌనీ రాయ్ పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న వార్తలు ఆమె అభిమానులను కలవరపెడుతున్నాయి.
ప్రైవసీ మాత్రమే అనడంతో
అయితే, తమకు కొంత ప్రైవసీ మాత్రమే కావాలని మౌనీ రాయ్ కోరింది కానీ భర్తతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పకపోవడంతో విడాకులు తీసుకునే ఆలోచనలోనే ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ నిజంగా విడిపోతున్నారా?
ప్రస్తుతానికి వీటిని మౌనీ రాయ్ ఖండించారు. తప్పుడు కథనాలను నమ్మవద్దని, తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆమె మీడియాను కోరారు.
2. సూరజ్ నంబియార్ ఎవరు?
సూరజ్ నంబియార్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ వ్యాపారవేత్త. వీరిద్దరూ 2022 జనవరిలో వివాహం చేసుకున్నారు.
3. మౌనీ రాయ్ భర్త ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఎందుకు కనిపించడం లేదు?
విడాకుల పుకార్లు వినిపిస్తున్న తరుణంలో సూరజ్ నంబియార్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేశారు.
4. మౌనీ రాయ్ నటించిన ప్రముఖ చిత్రాలు ఏవి?
ఆమె అక్షయ్ కుమార్ సరసన 'గోల్డ్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'మేడ్ ఇన్ చైనా', 'బ్రహ్మాస్త్ర' వంటి చిత్రాల్లో నటించారు. 'నాగిని' సీరియల్ ఆమెకు భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


