Samantha Baby Shower: ఓటీటీలో ట్రెండింగ్ టాప్ 1గా మా ఇంటి బంగారం- మరోవైపు చిత్తూరులో సమంత సీమంతం- ఫొటోలు వైరల్
Samantha Baby Shower Photos: స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో సరికొత్త మధురమైన అధ్యాయం మొదలుకానుంది. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి చిత్తూరులో అత్యంత ఆత్మీయుల సమక్షంలో జరుపుకున్న సమంతం సీమంతం వేడుక ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే, మా ఇంటి బంగారం ఓటీటీ టాప్ 1లో ట్రెండింగ్‌లో నిలిచింది.
Samantha Baby Shower Photos: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే తల్లి కానున్నారు. తన వ్యక్తిగత జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్న ఆమె.. తాజాగా సీమంతపు వేడుకను జరుపుకున్నారు. భర్త, ప్రముఖ దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.

సమంత సీమంతం ఫొటోలు వైరల్
పూర్తి వ్యక్తిగతంగా ఉంచాలనుకున్న ఈ వేడుకకు సంబంధించిన సమంత సీమంతం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయి అభిమానుల్లో తెగ వైరల్ అవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సాంప్రదాయ వేడుకలో సమంత మెరూన్ కలర్ ఎత్నిక్ దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిపోయారు.
సింపుల్ మేకప్, లైట్ జ్యువెలరీతో ఆమె లుక్ క్లాసిక్‌గా ఉంది. భర్త రాజ్ నిడిమోరు కూడా సమంత దుస్తులకు మ్యాచ్ అయ్యేలా మెరూన్ కలర్ సిల్క్ కుర్తా ధరించారు. ఇద్దరూ మెడలో చిన్న పూలమాలలతో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పెళ్లి నుంచి ప్రెగ్నెన్సీ వరకు.. అంతా ఒకే ఏడాదిలో!
సమంత, రాజ్ నిడిమోరుల జీవితంలో గడిచిన కొన్ని నెలలు ఎన్నో మరుపురాని అనుభూతులను మోసుకొచ్చాయి. 2025 డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో అత్యంత సాదాసీదాగా, ఆధ్యాత్మిక వాతావరణంలో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే తాను గర్భవతిని అనే తియ్యటి వార్తను సమంత స్వయంగా ప్రకటించారు.
100 కోట్ల రికార్డు.. నిర్మాతగానూ బ్లాక్‌బస్టర్ విజయం
తన లేటెస్ట్ హిట్ సినిమా 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్ వేదికగా అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పి సర్‌ప్రైజ్ చేశారు. వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగానూ సమంతకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత, రాజ్ నిడిమోరు సంయుక్తంగా నిర్మించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
టాలీవుడ్ చరిత్రలోనే ఒక మహిళా ప్రధాన చిత్రం (Female-led film) వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఇదే తొలిసారి. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ చిత్రం జూలై 17 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో 4 భాషల్లో మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ అయింది.
ఓటీటీ ట్రెండింగ్‌లో మా ఇంటి బంగారం
ఓటీటీ రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది సమంత మా ఇంటి బంగారం. జియో హాట్‌స్టార్‌లో టాప్ 1 ప్లేసులో మా ఇంటి బంగారం ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సమయంలో మరోవైపు సమంత సీమంతం ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సినిమాలకు తాత్కాలిక బ్రేక్.. నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
ప్రస్తుతానికి సమంత తన ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను ఆస్వాదించడంపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఇందుకోసం ఆమె సినిమాలకు తాత్కాలికంగా మెటర్నిటీ బ్రేక్ ఇచ్చారు. డెలివరీ తర్వాతే ఆమె మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. 'మా ఇంటి బంగారం' చిత్రానికి సీక్వెల్ ఉంటుందని రాజ్ నిడిమోరు ఇప్పటికే స్పష్టం చేయడంతో, బ్రేక్ ముగిసిన వెంటనే ఆమె ఈ సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.
అయితే ఈ బ్రేక్‌కు ముందే సమంత షూటింగ్ పూర్తి చేసిన 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే హై-బడ్జెట్ ఓటీటీ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి, అలీ ఫజల్ వంటి స్టార్ నటులతో కలిసి సమంత స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


