DC Trailer: హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి హీరోయిన్- డీసీ ట్రైలర్ రిలీజ్-ఏరులైపారే రక్తం, కవ్వించే ప్రేమ!
Lokesh Kanagaraj Wamiqa Gabbi DC Trailer Released: దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డీసీ' ట్రైలర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదలైంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బీజీమ్, యాక్షన్ ఫిదా చేస్తున్నాయి.
Lokesh Kanagaraj Wamiqa Gabbi DC Trailer Released: టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన మార్క్ యాక్షన్ సినిమాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ మూవీ డీసీ (DC). తాజాగా డీసీ ట్రైలర్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామాలో బ్యూటిపుల్ వామికా గబ్బి హీరోయిన్‌గా చేసింది. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
'దేవదాస్, చంద్ర' కథ
మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ డీసీ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఇందులో లోకేష్ కనగరాజ్ 'దేవదాస్' పాత్రలో, వామికా 'చంద్ర' పాత్రలో కనిపించారు. ఈ ఇద్దరి పేర్లతోనే డీసీ అని టైటిల్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
చంద్రను చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు కోల్‌కతాలో వ్యభిచార కూపంలోకి నెట్టేయడం, అక్కడ నుంచి ఆమె ప్రయాణం ఎలా సాగింది అనే కోణంలో కథ మొదలవుతుంది. దేవదాస్ ఒక పోలీస్ ఆఫీసర్‌ను చంపి పరారీలో ఉన్న నేరస్థుడిగా, చంద్ర ఒక డాక్టర్‌ని చంపినట్లుగా చూపించారు.
క్రిమినల్స్‌గా మారిన ఇద్దరు ప్రేమికులుగా ఎలా మారారు, వీరిద్దరి చుట్టూ పోలీసులు ఎలా వల పన్నారు, ఆ తర్వాత జరిగిన బాంబు పేలుళ్లు, యాక్షన్ సీక్వెన్సులు ట్రైలర్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. చివరలో సూర్యాస్తమయం వేళ ఒక కొండపై ఈ జంట నిలబడే దృశ్యంతో ట్రైలర్ ముగుస్తుంది. ఆ సీన్ ట్రైలర్ అంతటికి హైలెట్‌గా నిలిచింది.
రక్తం ఏరులై పారే యాక్షన్
అంతేకాకుండా ట్రైలర్‌లో రక్తం ఏరులైపారేంత వయోలెంట్ యాక్షన్ సీన్స్, లోకేష్, వామికలు కలిసి ఉన్న సీన్ ఒకటి కంటే ఎక్కువ లేకపోయిన వారిద్దరి మధ్య ఉండే ప్రేమను హత్తుకునేలా, కవ్వించేలా చూపించారు. అందుకు అనిరుధ్ బీజీఎమ్ ప్రాణం పోసిందనే చెప్పాలి. నేపథ్య సంగీతం ఓవైపు వయోలెన్స్‌ను మరోవైపు ప్రేమను ఫీల్ అయ్యేలా చేసింది.
లోకి ఇంటెన్సిటీ అదిరిపోయింది: దర్శకుడు పా రంజిత్
ఈ ట్రైలర్ చూసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని అభినందించారు. "DC ట్రైలర్ అద్భుతంగా ఉంది. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మార్క్ మేకింగ్, టేకింగ్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. విజువల్స్, సౌండ్ డిజైన్ సినిమా మూడ్‌ను పర్ఫెక్ట్‌గా సెట్ చేశాయి" అని పా రంజిత్ పేర్కొన్నారు. లోకేష్ కనగరాజ్ నటనలో ఇంటెన్సిటీ బాగుందని, వామికా గబ్బి తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని ఆయన కొనియాడారు.
అనిరుధ్ మ్యూజిక్‌కు ఫిదా
ఈ ట్రైలర్‌కు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. "హింస కూడా అనిరుధ్ సంగీతం వల్ల ఎంతో పొయెటిక్‌గా అనిపిస్తోంది" అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్, విజయ్ సినిమాలకు అనిరుధ్ ఎప్పుడూ తన బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
గతంలో అరుణ్ మాథేశ్వరన్ తీసిన 'కెప్టెన్ మిల్లర్' తరహాలోనే ఈ సినిమాలోనూ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలవనుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. వామికా నోట్లో గులాబీ పువ్వు పెట్టుకున్న సీన్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
మెగా ఫోన్ పక్కన పెట్టి.. మేకప్ వేసుకున్న లోకేష్
లోకేష్ కనగరాజ్ గతంలో 'మాస్టర్', 'సింగపూర్ సెలూన్' వంటి సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. శ్రుతి హాసన్ ప్రైవేట్ ఆల్బమ్ 'ఇనిమేల్'లోనూ నటించారు. అయితే పూర్తిస్థాయి హీరోగా ఆయనకు ఇదే మొదటి సినిమా. 2025లో రజనీకాంత్‌తో లోకేష్ 'కూలీ' తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఒక భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు లోకేష్. ఈ క్రమంలో ఆయన హీరోగా నటిస్తున్న 'DC'పై తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'G2' (గూఢచారి 2) లో నటిస్తున్న వామికా గబ్బి ఈ సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


