wamiqa gabbi: హారర్ థ్రిల్లర్ లో అదరగొట్టిన భామ.. ఫస్ట్ రూ.100 కోట్ల సినిమా..ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన వామికా
wamiqa gabbi: ప్రియదర్శన్-అక్షయ్ కుమార్ కాంబోలో వచ్చిన హారర్ కామెడీ 'భూత్ బంగ్లా' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రూ.100 కోట్ల కలెక్షన్లు దాటిన ఈ మూవీ హీరోయిన్ వామికా గబ్బి కెరీర్ లో ఎంతో స్పెషల్. ఫస్ట్ టైమ్ వంద కోట్ల సినిమా కావడంతో వామికా ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది.
wamiqa gabbi: ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్. దాదాపు పుష్కర కాలం తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా' ప్రేక్షకులను అలరిస్తోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది.

వామికా గబ్బి కెరీర్‌లో
భూత్ బంగ్లా విజయం ముఖ్యంగా బ్యూటీ వామికా గబ్బికి ఎంతో ప్రత్యేకం. తన సుదీర్ఘ కెరీర్‌లో రూ.100 కోట్ల వసూళ్లను సాధించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. షూటింగ్ సెట్స్‌లో చిత్ర యూనిట్‌తో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ తన కృతజ్ఞతలను చాటుకుంది.
ఎంతో ఆనందంగా
"నా తొలి రూ.100 కోట్ల సినిమా ఇది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచిన దర్శకుడు ప్రియదర్శన్, అక్షయ్ కుమార్, నిర్మాత ఏక్తా కపూర్ కు ధన్యవాదాలు. ఈ విజయం మా అందరి శ్రమకు దక్కిన ప్రతిఫలం. నన్ను, మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రతి అడుగులోనూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మిమ్మల్ని అలరించడానికి ఎప్పుడూ కష్టపడతా" అని వామికా తన పోస్ట్‌లో పేర్కొంది.
జబ్ వి మెట్ నుంచి భూత్ బంగ్లా వరకు..
వామికా గబ్బి ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన 'జబ్ వి మెట్' సినిమాలో కరీనా కపూర్ కజిన్‌గా చాలా చిన్న పాత్రలో ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత 'లవ్ ఆజ్ కల్', 'మౌసమ్' వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.
2013లో వచ్చిన 'సిక్స్ టీన్' సినిమాతో కథానాయికగా మారిన వామికా.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం హిందీలోనే కాకుండా పంజాబీ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మలయాళంలో తోవినో థామస్‌తో కలిసి నటించిన 'గోధా' సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
బాక్సాఫీస్ వద్ద భూత్ బంగ్లా హవా
గతంలో అక్షయ్ కుమార్-ప్రియదర్శన్ కాంబోలో వచ్చిన హేరా ఫేరి, గరం మసాలా, భాగం భాగ్, భూల్ భులైయా వంటి చిత్రాలు క్లాసిక్ కామెడీలుగా నిలిచాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన 'భూత్ బంగ్లా' ఏప్రిల్ 17న విడుదలైంది. సక్నిల్క్ ప్రకారం ఈ సినిమా ఇండియాలో రూ. 117 కోట్ల నెట్ వసూళ్లను సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 188 కోట్లను రాబట్టింది. ఈ చిత్రంలో టబు, రాజ్‌పాల్ యాదవ్, పరేష్ రావల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు.
క్రేజీ ప్రాజెక్టులు
ప్రస్తుతం వామికా గబ్బి చేతిలో ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. '83', 'ఖుఫియా', 'బేబీ జాన్' వంటి సినిమాలతో మెప్పించిన ఆమె, త్వరలో 'పతి పత్ని ఔర్ వో దో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీలో ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మే 15, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: భూత్ బంగ్లా సినిమా దర్శకుడు ఎవరు?
జవాబు: ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్‌తో ఆయనకు ఇది ఐదవ సూపర్ హిట్ మూవీ.
ప్రశ్న వామికా గబ్బి తొలి సినిమా ఏది?
జవాబు ఆమె కరీనా కపూర్ నటించిన 'జబ్ వి మెట్' (2007) చిత్రంలో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైంది.
ప్రశ్న భూత్ బంగ్లా మొత్తం వసూళ్లు ఎంత?
జవాబు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 188 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


