Sonam Kapoor: ఇద్దరు పిల్లల తల్లిగా స్టార్ హీరోయిన్.. జీవితం కలలా ఉందంటూ పోస్ట్.. క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్
Sonam Kapoor: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి. తన రెండో బిడ్డతో గడుపుతున్న మధుర క్షణాలను ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
బాలీవుడ్ స్టార్ నటి సోనమ్ కపూర్ రెండోసారి మదర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తోంది. గత నెలలో రెండోసారి మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్, తన కొత్త ప్రపంచానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆనంద్ అహుజా-సోనమ్ దంపతులు మార్చి 29, 2026న తమ రెండో కుమారుడిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నలుగురు సభ్యుల కుటుంబంగా మారిన తమ జీవితంలోని అందమైన చిత్రాలను ఆమె పోస్ట్ చేసింది.

సోనమ్ కపూర్ పోస్ట్
సోనమ్ కపూర్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో వారి కుటుంబం మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక చిత్రంలో సోనమ్ తన పెద్ద కుమారుడు వాయు అహుజాతో కలిసి ప్రశాంతంగా అల్పాహారం తీసుకుంటూ కనిపిస్తుండగా, మరో ఫోటోలో ఆనంద్ అహుజా తన పసికందును ఎత్తుకుని ఎంతో ఆనందంగా ఉన్న దృశ్యం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
అన్నిటికంటే ముఖ్యంగా, ఊయలలో నిద్రపోతున్న తన తమ్ముడిని వాయు ఎంతో ఎగ్జైటింగ్ గా చూస్తున్న దృశ్యం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, గతంలో లాగే పిల్లల గోప్యతను గౌరవిస్తూ సోనమ్ వారి ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడింది.
జీవితం ఒక కలల
ఈ అపురూప చిత్రాలతో పాటు సోనమ్ ఒక హృదయపూర్వక నోట్‌ను కూడా షేర్ చేసింది. "జీవితం ఒక కలలా ఉంది.. ఈ నెల అంతా ఎంతో అద్భుతంగా గడిచింది. థ్యాంక్యూ యూనివర్స్.. నా ముగ్గురు అబ్బాయిలు (ఆనంద్, వాయు, నవజాత శిశువు)" అంటూ సోనమ్ పేర్కొంది. ఈ పోస్టు వైరల్ గా మారింది.
ఈ పోస్ట్ కు సోనమ్ భర్త ఆనంద్ స్పందిస్తూ.. "నేను ఈ పోస్ట్‌ను ఒక్కసారి కంటే ఎక్కువసార్లు లైక్ చేయడం ఎలా?" అంటూ సరదాగా కామెంట్ చేయగా, సోదరి రియా కపూర్ హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను కురిపించింది.
సూపర్ హ్యూమన్ స్ట్రెంత్
గతంలో సోనమ్ సోదరి రియా కపూర్ తన మేనల్లుడి మొదటి గ్లింప్స్‌ను షేర్ చేస్తూ.. సోనమ్ పై ప్రశంసలు కురిపించింది. “మనకు కావాల్సింది కేవలం ప్రేమ మాత్రమే.. సోనమ్ కపూర్ విషయంలో చెప్పాలంటే ఆమెకు సూపర్ హ్యూమన్ మామ్ స్ట్రెంత్ ఉంది” అని రియా పేర్కొంది.
ఇద్దరు పిల్లలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా మారింది. 2018లో ఆనంద్ ను సోనమ్ పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2022లో మొదటి సంతానంగా వాయు జన్మించాడు. ఇప్పుడు రెండో బాబు రాకతో వారి ఇల్లు సరికొత్త వెలుగులతో నిండిపోయింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. సోనమ్ కపూర్ రెండో కుమారుడు ఎప్పుడు జన్మించాడు?
సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాల రెండో కుమారుడు మార్చి 29, 2026న జన్మించాడు.
2. సోనమ్ కపూర్ పెద్ద కుమారుడి పేరు ఏమిటి?
సోనమ్ కపూర్ పెద్ద కుమారుడి పేరు వాయు అహుజా. ఆమెకు 2022లో మొదటి సంతానం కలిగింది.
3. సోనమ్ కపూర్ తన పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో చూపించారా?
లేదు, సోనమ్ కపూర్ తన పిల్లల ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో కూడా వారి ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


