Karthika Deepam 2: చిరంజీవి పాటకు డ్యాన్స్‌తో అదుర్స్-కార్తీక దీపం 2 సుమిత్రను ఇలా ఎప్పుడైనా చూశారా? సీత వీడియో వైరల్
Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ ను ఫాలో అయ్యేవాళ్లందరికీ అందులో సుమిత్ర క్యారెక్టర్ తెలిసే ఉంటుంది. అటు సొంత కూతురు దీప, ఇటు పెంచిన కూతురు జ్యోత్స్నకు తల్లిగా సుమిత్ర క్యారెక్టర్ సాగుతోంది. ఈ పాత్ర పోషిస్తున్న సీత ఇప్పుడు చిరంజీవి పాటకు చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది.
Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ లో సుమిత్ర క్యారెక్టర్ తో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న నటి సీత. సీరియల్ లో తన పాత్రలో ఆమె జీవిస్తూ, ప్రతి ఎపిసోడ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తోంది. సీరియల్ లో తల్లి పాత్ర పోషిస్తున్న సీత.. బయట మాత్రం డ్యాన్స్ లు, రీల్స్ తో హుషారుగా ఉంటోంది.

కార్తీక దీపం 2 సుమిత్ర
కార్తీక దీపం 2 సీరియల్ ను చూసేవాళ్లకు, అందులోని సుమిత్ర క్యారెక్టర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు కన్న కూతురు దీప, మరోవైపు పెంచిన కూతురు జ్యోత్స్న తల్లిగా సుమిత్ర క్యారెక్టర్ కొనసాగుతోంది. కానీ దీప కన్న కూతురని, జ్యోత్స్న తన సొంత కుమార్తె కాదని సుమిత్రకు ఇంకా నిజం తెలియదు.
డ్యాన్స్ తో అదుర్స్
కార్తీక దీపం 2 సీరియల్ లో బరువైన, ప్రధాన పాత్ర పోషిస్తున్న సుమిత్ర అలియాస్ సీత తాజాగా డ్యాన్స్ తో అదరగొట్టింది. డాడీ సినిమాలోని చిరంజీవి సాంగ్ కు సీత స్టెప్పులేసింది. మంచి రిథమ్ తో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సీత ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవెనింగ్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న డ్యాన్స్’’ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను సీత పెట్టింది.
సోషల్ మీడియాలో యాక్టివ్
కార్తీక దీపం 2 సీరియల్ లో యాక్టింగ్ తో అలరిస్తున్న సీత.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సహచర సీరియల్ ఆర్టిస్ట్ లు స్వర్ణ, గాయత్రి సింహాద్రి, ప్రేమి విశ్వనాథ్ లతో తరచుగా రీల్స్ చేసి సీత పోస్టు చేస్తూ ఉంటుంది. ఇలా డ్యాన్స్ వీడియోలూ పెడుతోంది.
రసవత్తరంగా
కార్తీక దీపం 2 సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. నిరుపమ్ ఏమో కార్తీక్ గా, ప్రేమి విశ్వనాథ్ ఏమో దీపగా నటిస్తున్నారు. విలన్ జ్యోత్స్న క్యారెక్టర్ లో గాయత్రి సింహాద్రి అదరగొడుతోంది. నటకుమారి ఏమో జ్యోత్స్న నానమ్మ పారిజాతం క్యారెక్టర్ ప్లే చేస్తోంది.
ఇప్పటికే కార్తీక దీపం ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీక దీపం 2 కూడా టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


