Star Maa Serials: ఏమాత్రం తగ్గని వంటలక్క క్రేజ్.. కార్తీక దీపం 2 మళ్లీ నంబర్ వన్.. దూసుకెళ్తున్న పొదరిల్లు..
Star Maa Serials: తెలుగు టీవీ సీరియల్స్ లో కార్తీక దీపం 2 క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ ఏడాది 14వ వారం రేటింగ్స్ లోనూ ఈ సీరియల్ తొలి స్థానంలో నిలిచింది. మరో సీరియల్ పొదరిల్లు కూడా రేటింగ్స్ లో దూసుకెళ్తోంది.
Star Maa Serials: స్టార్ మా సీరియల్స్ తగ్గేదే లేదంటూ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్తున్నాయి. 2026లో 14వ వారం రేటింగ్స్ తాజాగా రిలీజయ్యాయి. వీటిలో కార్తీక దీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండె నిండా గుడి గంటలు, ఇంటింటి రామాయణం, నువ్వు లేక నేను లేనులాంటి సీరియల్స్ టాప్ లో నిలిచాయి. మరి టాప్ 10లో ఉన్న సీరియల్స్ ఏవో చూడండి.

'వంటలక్క' క్రేజ్ తగ్గలేదు..
తెలుగు ఇళ్లల్లో సాయంత్రం అయిందంటే చాలు టీవీల ముందు వాలిపోయే బుల్లితెర ప్రేక్షకులకు తమ ఫేవరెట్ సీరియల్ రేటింగ్ ఎంత వచ్చిందనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. తాజాగా విడుదలైన 14వ వారం టీఆర్పీ లెక్కలను గమనిస్తే, స్టార్ మా (Star Maa) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
గత కొన్నేళ్లుగా బుల్లితెరకు రారాజుగా వెలుగొందుతున్న 'కార్తీక దీపం 2 - ఇది నవ వసంతం' (Karthika Deepam 2) ఈ వారం కూడా 13.18 (U+R) రేటింగ్‌తో తన సత్తా చాటింది. అర్బన్ ఏరియాల్లో కూడా 10.26 పాయింట్లతో ఈ సీరియల్ తిరుగులేని విజయంతో దూసుకుపోతోంది. ఇక రెండో స్థానంలో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' నిలిచింది. ఇది 12.40 (U+R) రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
ఇతర ముఖ్యమైన సీరియల్స్ రేటింగ్స్ గమనిస్తే..
గుండె నిండా గుడి గంటలు: 12.03 (U+R) రేటింగ్‌తో మూడో స్థానంలో పటిష్టంగా ఉంది.
ఇంటింటి రామాయణం: 11.71 (U+R) రేటింగ్‌ను దక్కించుకొని నాలుగో స్థానానికి పడిపోయింది.
పొదరిల్లు: 10.11 (U+R) రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉంది. రోజురోజుకీ ఈ సీరియల్ క్రేజ్ పెరుగుతోంది.
నువ్వు లేక నేను లేను: 8.45 (U+R) రేటింగ్ సాధించిన ఈ సీరియల్ ఆరో స్థానంలో ఉంది.
బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారమవుతున్నా.. తాజా రేటింగ్స్ లో 5.44తో సత్తా చాటింది.
జీ తెలుగులో 'జయం' - 'జగద్ధాత్రి' మధ్య గట్టి పోటీ
జీ తెలుగు (Zee Telugu) ఛానల్ విషయానికి వస్తే రేటింగ్స్ సింగిల్ డిజిట్ లోనే ఉన్నప్పటికీ పోటీ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వారం 'జయం' సీరియల్ 6.77 (U+R) రేటింగ్‌తో ఛానల్ టాపర్‌గా నిలిచింది. దీనికి గట్టి పోటీ ఇస్తూ 'జగద్ధాత్రి' 6.75 (U+R) పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
మిగిలిన సీరియల్స్ విషయానికి వస్తే..
చామంతి: 6.59 (U+R) రేటింగ్ సాధించింది.
మేఘ సందేశం: 6.07 (U+R) రేటింగ్‌ను అందుకుంది.
లక్ష్మీ నివాసం: 4.55 (U+R) రేటింగ్‌తో పర్వాలేదనిపించింది.
చిన్న సీరియల్స్ అయిన 'ముక్కుపుడక' (3.31), 'ఉమ్మడి కుటుంబం' (3.74) ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. 'కర్ణ' సీరియల్ అత్యంత తక్కువగా 1.23 (U+R) రేటింగ్‌ను మాత్రమే మూటగట్టుకుంది.
అయితే ఏ రకంగా చూసినా జీ తెలుగు సీరియల్స్ మాత్రం స్టార్ మాతో పోటీ పడలేకపోతున్నాయి. ఆ ఛానెల్లో టాప్ 5 సీరియల్స్ అన్నీ రెండంకెల రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి. జీ తెలుగు సీరియల్స్ వాటికి దరిదాపుల్లో కూడా లేవు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
14వ వారం (Week 14) నంబర్ 1 సీరియల్ ఏది?
స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2' సీరియల్ 13.18 (U+R) రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచింది.
జీ తెలుగులో అత్యధిక రేటింగ్ సాధించిన సీరియల్ ఏది?
జీ తెలుగు ఛానల్‌లో 'జయం' సీరియల్ 6.77 (U+R) రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు తాజా రేటింగ్ ఎంత?
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తాజాగా 12.40 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


